iDreamPost
android-app
ios-app

TET అభ్యర్థులకు అలర్ట్.. టెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి..

TG TET: తెలంగాణలో టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఇది శుభవార్త.

TG TET: తెలంగాణలో టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఇది శుభవార్త.

TET అభ్యర్థులకు అలర్ట్.. టెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి..

సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో విలువ ఉంటుంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది. విద్యార్థుల భవితను తీర్చి దిద్ది వారి భవిష్యత్తును బంగారుమయం చేసేది గురువులే. ఇంతటి ప్రాధాన్యత ఉన్న వృత్తిలోకి రావాలని చాలా మంది కలలుకంటుంటారు. అయితే టీచింగ్ ఫీల్డ్ లోకి రావాలంటే వృత్తి విద్యా కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీచర్ జాబ్స్ కోసం అర్హత సాధించాలంటే ప్రభుత్వాలు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ అభ్యర్థులకు ఇది శుభవార్తే అని చెప్పాలి.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే టీచర్ అభ్యర్థుల డిమాండ్ మేరకు ఇటీవల టెట్ నిర్వహించింది ప్రభుత్వం. అయితే ఈ టెట్ లో క్వాలిఫై కాని టీచర్ అభ్యర్థులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటినుంచి ఏడాదికి రెండుసార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జూన్ లో ఒకసారి, డిసెంబర్ లో ఒకసారి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

అభ్యర్థులు స్కోర్ పెంచుకునేందుకు టెట్ పరీక్షను ఎన్ని సార్లైనా రాసుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది. గతంలోనే నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌ టీచర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ (ఎన్​సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్‌‌‌‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది కేంద్ర ప్ర‌భుత్వం. దీంతో ఒక్కసారి టెట్ లో క్వాలిఫై అయితే డీఎస్సీకి అర్హులవుతారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడే వారు టెట్ పేపర్ 2లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టుల కోసం పోటీపడే వారు పేపర్ 1లో క్వాలిఫై కావాలి. డీఎస్సీలో 20 శాతం మార్కులు కలుస్తుండడంతో టెట్ స్కోర్ కు ప్రాధాన్యత పెరిగింది.