iDreamPost
android-app
ios-app

గూగుల్‌ని చావు దెబ్బ కొట్టిన ప్రముఖ భారత కంపెనీ.. వందల కోట్ల నష్టం..

  • Published Jul 06, 2024 | 8:12 PM Updated Updated Jul 06, 2024 | 8:12 PM

Bold Move Of Indian Businessman: ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా ఉన్న గూగుల్ కంపెనీని ఒక ఇండియన్ చావు దెబ్బకొట్టారు. మన ఇండియన్ కంపెనీ వల్ల గూగుల్ కి వందల కోట్ల నష్టం వాటిల్లనుంది. అయితే గూగుల్ ని కాదని స్వదేశీ సేవలను నమ్మడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా ఆ వ్యాపారవేత్త బోల్డ్ మూవ్ అంటూ కొనియాడుతున్నారు.

Bold Move Of Indian Businessman: ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా ఉన్న గూగుల్ కంపెనీని ఒక ఇండియన్ చావు దెబ్బకొట్టారు. మన ఇండియన్ కంపెనీ వల్ల గూగుల్ కి వందల కోట్ల నష్టం వాటిల్లనుంది. అయితే గూగుల్ ని కాదని స్వదేశీ సేవలను నమ్మడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా ఆ వ్యాపారవేత్త బోల్డ్ మూవ్ అంటూ కొనియాడుతున్నారు.

గూగుల్‌ని చావు దెబ్బ కొట్టిన ప్రముఖ భారత కంపెనీ.. వందల కోట్ల నష్టం..

ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ గూగుల్ ని చావు దెబ్బ కొట్టినంత పనయ్యింది. అతను చేసిన పనికి గూగుల్ కి ఇక నుంచి కొన్ని వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ప్రముఖ భారతీయ కంపెనీ తీసుకున్న నిర్ణయంతో గూగుల్ కి ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే ఇస్రో కంపెనీ గూగుల్ మ్యాప్స్ ని మించిన మ్యాప్స్ ని రూపొందిస్తామని ప్రకటించగా.. తాజాగా మరో కంపెనీ గూగుల్ మ్యాప్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. 

భారత క్యాబ్ సేవలను అందించే ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ఓలా.. గూగుల్ మ్యాప్స్ తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఒక ప్రకటన చేసింది. ఇక నుంచి ఓలా క్యాబ్స్ ప్లాట్ ఫామ్స్ లో గూగుల్ మ్యాప్స్ ని వాడేది లేదని తేల్చి చెప్పింది. గూగుల్ మ్యాప్స్ కి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చామని ఓలా సంస్థ ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల తమ సంస్థకు ఏటా 100 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కంపెనీ సహ వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ తెలిపారు. గూగుల్ మ్యాప్స్ కి బదులు కొత్త లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి కస్టమర్లు ఈ కొత్త సేవలను పొందేందుకు ఓలా యాప్ ను అప్డేట్ చేసుకోవాలని అన్నారు.

కాగా ఓలా లొకేషన్ ఇంటెలిజెన్స్ లో స్ట్రీట్ వ్యూ, 3డీ మ్యాప్, ఇండోర్ చిత్రాలు, డ్రోన్ మ్యాప్ లు వంటి ఫీచర్స్ ఉన్నాయని అన్నారు. అక్టోబర్ 2021లో పుణెకు చెందిన జియోసాక్ అనే సంస్థతో ఓలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ ఓలాకి జియో స్పేషియల్ సేవలను అందిస్తుంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ స్థానంలో జియోసాక్ సేవలను వినియోగించుకుంటుంది ఓలా కంపెనీ. ఈ మ్యాప్స్ కోసం ఓలా సంస్థ ఏటా గూగుల్ మ్యాప్స్ కి వంద కోట్ల రూపాయలు చెల్లించేది. ఇప్పుడు జియోసాక్ అందిస్తున్న జియో స్పేషియల్ సేవల కారణంగా ఓలా కంపెనీకి ఏటా వంద కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఈ లెక్కన గూగుల్ మ్యాప్స్ కి ఏటా 100 కోట్ల నష్టం వాటిల్లుతుందన్న మాట.

ఇన్నాళ్లూ విదేశీ కంపెనీ మీద ఆధారపడిన ఓలా ఇప్పుడు.. పూర్తిగా మ్యాప్స్ కి సంబంధించిన సేవల కోసం స్వదేశీ కంపెనీపైనే ఆధారపడింది. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రీసెంట్ గా ఇస్రో గూగుల్ మ్యాప్స్ ని మించిన సేవలను అందిస్తామని.. భువన్ పోర్టల్ ద్వారా గూగుల్ కంటే 10 రెట్లు మెరుగైన మ్యాప్స్ ని అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. ఈ భారీ పరిణామాలతో గూగుల్ కి ఫ్యూచర్ లో భారీ దెబ్బపడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఓలా క్లౌడ్ సర్వీసులను కూడా గతంలో మైక్రోసాఫ్ట్ అజూర్ నిర్వహించేది.

అయితే ఇటీవల మైక్రోసాఫ్ట్ తో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. అజూర్ కి బదులు ‘కృత్రిమ్ ఏఐ క్లౌడ్’ సేవలను వాడుతున్నామని ఓలా సంస్థ తెలిపింది. ఈ కృత్రిమ్ ఏఐ క్లౌడ్.. ఏఐ మ్యాపింగ్ సొల్యూషన్స్ ని కూడా అందిస్తుందని ఓలా సంస్థ పేర్కొంది. ఈ కృత్రిమ్ ఏఐ క్లౌడ్ లో త్వరలో మరిన్ని ప్రోడక్ట్ అప్డేట్స్ వస్తాయని కంపెనీ తెలిపింది. భారత కంపెనీ ఇలా విదేశీ కంపెనీలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మంచి విషయమని నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.