iDreamPost
android-app
ios-app

వీడియో: 26 ఏళ్ల తర్వాత సచిన్ షార్జా సిక్స్ రిపీట్! 2 కళ్లు సరిపోవు!

  • Published Jul 06, 2024 | 9:25 PM Updated Updated Jul 06, 2024 | 9:25 PM

Sikandar Raza: భారత్-జింబాబ్వే మ్యాచ్​లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. 26 ఏళ్ల తర్వాత సచిన్ షార్జా సిక్స్‌ రిపీట్ అయింది. ఆ షాట్​ను చూసేందుకు రెండు కళ్లు చాలవంతే!

Sikandar Raza: భారత్-జింబాబ్వే మ్యాచ్​లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. 26 ఏళ్ల తర్వాత సచిన్ షార్జా సిక్స్‌ రిపీట్ అయింది. ఆ షాట్​ను చూసేందుకు రెండు కళ్లు చాలవంతే!

  • Published Jul 06, 2024 | 9:25 PMUpdated Jul 06, 2024 | 9:25 PM
వీడియో: 26 ఏళ్ల తర్వాత సచిన్ షార్జా సిక్స్ రిపీట్! 2 కళ్లు సరిపోవు!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. లెక్కపెట్టలేనన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడాడు. వాటిల్లో టాప్​-3లో నిలిచేది షార్జా ఇన్నింగ్స్ అనే చెప్పాలి. కోకాకోలా కప్​లో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్​లో మాస్టర్ బ్లాస్టర్ నెక్స్ట్ లెవల్ హిట్టింగ్​తో అలరించాడు. సరిగ్గా మ్యాచ్​కు ముందు దాదాపు అరగంట పాటు ఇసుక తుఫాన్ వచ్చింది. దీంతో డక్​వర్త్ లూయిస్ సీన్​లోకి వచ్చింది. ఆ ట్రయాంగిల్ సిరీస్​లో ఫైనల్​కు చేరాలంటే డక్​వర్త్ ప్రకారం భారత్ టార్గెట్​ను 46 ఓవర్లలో 237 పరుగులుగా నిర్ణయించారు. ఇసుక తుఫాన్ తర్వాత సచిన్ బ్యాటింగ్ తుఫాన్ మొదలైంది.

టామ్ మూడీ, షేన్ వార్న్, మైకేల్ కాస్ప్రోవిచ్, డామిన్ ఫ్లెమింగ్​ లాంటి కంగారూ బౌలర్లతో ఆడుకున్న సచిన్.. ఏకంగా 143 పరుగులు బాదేశాడు. ఆ మ్యాచ్​లో భారత్ ఓడినా అతడి నాక్ వల్ల ఫైనల్​కు క్వాలిఫై అయింది. ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడిన క్రికెట్ దేవుడు.. గ్రౌండ్ నలువైపులా అద్భుతమైన షాట్లు కొట్టాడు. ఇదే క్రమంలో అతడు కొట్టిన కొన్ని స్ట్రయిట్ డ్రైవ్​లు, స్ట్రయిట్ సిక్స్​లు మ్యాచ్​కే కాదు.. క్రికెట్ హిస్టరీలో ఎవర్​గ్రీన్​గా నిలిచిపోయాయి. సరిగ్గా అదే షాట్​ ఇవాళ భారత్-జింబాబ్వే మధ్య జరిగిన తొలి టీ20లో రిపీట్ అయింది.

ఆవేశ్ ఖాన్ వేసిన 10వ ఓవర్​ మూడో బంతిని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అచ్చం సచిన్ మాదిరిగానే స్ట్రయిట్ సిక్స్​ బాదాడు. నిల్చున్న చోట నుంచి బౌలర్ తల మీదుగా కొట్టిన ఆ షాట్​ చూసి అంతా షాకయ్యారు. మాస్టర్ బ్లాస్టర్ మాదిరిగానే స్వీట్ టైమింగ్, పర్ఫెక్ట్ బాడీ బ్యాలెన్స్​తో రజా బాదిన ఈ షాట్​ను చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. దీన్ని చూసిన క్రికెట్ లవర్స్ సచిన్ షార్జా ఇన్నింగ్స్​ను గుర్తు చేసుకుంటున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న రజా.. 17 పరుగులు చేసి అదే ఆవేశ్​ ఖాన్ బౌలింగ్​లో ఔట్ అయ్యాడు. మరి.. రజా సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.