iDreamPost

ఒక్కరోజులో సుమారు 20 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఒక్కరోజులో సుమారు 20 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఒక్కరోజులో 19,459 పాజిటివ్ కేసులు – 380 మరణాలు

కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 17 వేలకు పైగా కేసులు, 350 పైగా మరణాలు సంభవించడం నిత్యకృత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,459 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,48,318 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 16,475 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 380 మరణాలు సంభవించాయి.  ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 3,21,722 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 2,10,120 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసుల నమోదు:

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు.నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 5493 పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఆ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా 156 మంది మృతి చెందారు. నిన్నటి పాజిటివ్ కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,64,626 చేరింది.అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,429 చేరింది.     

ప్రస్తుతం మహారాష్ట్రలో 70,607 వైరస్ యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 86575 మంది కరోనా మహమ్మారి  కోల్పోని డిశ్చార్జ్ అయ్యారు.ఆర్థిక రాజధాని ముంబైలో ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాప్తి స్తుండటం ఆందోళన పరుస్తుంది.ఇక ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా పేరు పొందిన ధారవిలో వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటం ఒక్కటే ఉద్ధవ్ ప్రభుత్వానికి కాస్త ఊరటనిస్తుంది.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 983 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 14418 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9000 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 5172 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 237 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 813 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 13098 మందికి కరోనా సోకగా 169 మంది మృత్యువాత పడ్డారు. 5908 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్  అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7021 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 10,243,858 మందికి కోవిడ్ 19 సోకగా 504,410 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 5,553,495 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,637,077 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 128,437 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి