iDreamPost

మూడ్ ఆఫ్ మునుగోడ్..

మూడ్ ఆఫ్ మునుగోడ్..

ఎవరికీ అక్కరకు కాని విధంగా మొదలైంది మునుగోడు ఉప ఎన్నిక. నెలరోజుల తరబడి వేలకొద్దీ కార్ల హారన్ మోతలతో ఆ ప్రాంతం ఎన్నడూ చూడని ఆసక్తిని రేకెత్తింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చిత్రపఠంలో మునుగోడు ఎరుగని ప్రాముఖ్యతని సంతరించుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మరో ప్రతిపక్షమైన బిజేపి నుంచి పోటీ చేస్తానంటూ దిగిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి గారు ఊహించని విధంగా, జీవితంలో ఎప్పుడు తెలియని విధంగా శ్రమించి పోరాడాల్సి వచ్చింది.

కాంగ్రెస్ సీటే కదా పోతే పోయిందని ఒదలలేదు సీఎం కేసీఆర్ గారు. కేంద్రంతో తనకు జరుగుతున్న తగాదాలకు తనేంటో చూపే వేదికగా మునుగోడు ఉప ఎన్నికను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ బలగం మొత్తం ఎమ్మెల్యేలు, మినిస్టర్‌లు, సలహా మండలి, కార్యవర్గ నేతలు వగైరా వగైరా అందరినీ మునుగోడులో మొబిలైజ్ చేశారు. ప్రతీ రెండు వేల ఓటర్లకు ఒక ప్రతినిధిని నియమించారు‌. చివరికి కేకేసీఆర్ గారి తనయుడు కేటీఆర్‌ను స్వయంగా ఘట్టుప్పల్ మండల్‌కు ఇంఛార్జ్ గా నియమించారు.

పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతలకు సంధి లేక విచిత్రంగా తయారైన కాంగ్రెస్ పార్టీకి ఈ సిట్టింగ్ సీట్‌ చేజారడం ఒకింత బాధాకరం. 97 వేల ఓట్లు సాధించి రాజ్‌గోపాల్ గారు గత ఎన్నికలో హస్తం పార్టీకి వన్నె తెచ్చిన క్షేత్రం ఇది. ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలు, అధికార పార్టీలోకి వెళ్లిపోయిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ని సంస్థాగతంగా వీక్ చేశాయి. ఆ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైతే బాగుంటుందని కేడర్‌తో పాటు చాలా మంది పార్టీ సపోర్టర్లు కోరుకున్నారు. కానీ అది జరగలేదు. దాదాపు నాలుగేళ్ళ పాటు అంతర్గత పోరు, నియోజకవర్గంలో జరగని అభివృద్ధి, క్రమంగా తగ్గిపోతున్న గ్రాఫ్‌కు మరో దారి లేక ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచిస్తున్న టైంలో బిజేపితో చర్చలు కలిసి వచ్చాయి. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడం బెటర్ అని రాజ్‌గోపాల్ భావించారు. దీంతో కేసీఆర్ ని టైట్ చేయాలనుకుంటున్న బిజేపి మరో అస్త్రం లభించింది.

తెలంగాణలో బిజేపి గ్రాఫ్ పెంచేందుకు వీక్ స్పాట్ ను ఎంచుకుని అక్కడ ఓ ఉప ఎన్నిక జరిపించాలి అని కూడా ప్లాన్ చేసినట్టు వినిపించింది. ఆ క్రమంలో మొదట ఖమ్మం జిల్లా వైపు ఆలోచించారు. కానీ అనుకోకుండా మునుగోడు వాళ్ళకు తగిలి కలిసి వచ్చింది. కారణం నల్గొండ జిల్లాలో బిజేపి నిన్న మొన్నటివరకూ వీక్ పార్టీనే కాబట్టి‌.

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నికలు.. నియోజకవర్గంలో నిఘా ఏర్పాట్లు..

  • మరి సడన్‌గా ఉద్భవించిన ఈ బై ఎలక్షన్‌లో ఏ పార్టీ పైచేయి సాధించబోతోంది?

మూడ్ ఆఫ్ మునుగోడ్

రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన రోజునుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు నామినేషన్ వేసిన రోజువరకూ టీయారెస్ 7 నుంచి 8 శాతం ఎడ్జ్‌లో సాగుతూ వచ్చింది. బూర నర్సయ్య గౌడ్ బిజేపిలో చేరడంతో ఆ గ్యాప్ తరిగి బిజేపి, టీఆర్ఎస్ లు సమవుజ్జీలుగా మారిపోయాయి. బిజేపికి బూర నర్సయ్య చాలా పెద్ద అసెట్ అయ్యారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ పరిణామాన్ని తిప్పికొట్టడానికి టీఆర్ఎస్ దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్‌లను ఆహ్వానించి ఆ ఇంపాక్ట్‌ని బ్యాలెన్స్ చేయాలనుకుంది కానీ ఆ విషయాన్ని మునుగోడు ప్రజలతో పాటు రాష్ట్రం కూడా మర్నాడే మర్చిపోయింది. నాలుగు రోజుల క్రితం రాపోలు ఆనంద్ భాస్కర్ గారు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు అన్నారు కానీ ఆయన బిజేపికి రాజీనామా చేసిన లేఖ మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఆ వార్త కూడా కనుమరుగైపోయింది. ఈ చేరికల పరిణామం బిజేపికి చేసిన నష్టం కానీ, టీఆర్ఎస్ కు చేసిన లాభాలు కానీ శూన్యం.

రాజ్‌గోపాల్ గారు బిజేపి పార్టీలోకి చేరేలోపే తన పాత కాంగ్రెస్ క్యాడర్‌ని తనతో పాటు లాగేశారు. బూత్ లెవెల్ కార్యకర్తనుంచి మండల ప్రెసిడెంట్‌ల వరకూ దాదాపు 80 శాతం క్యాడర్ కేఆర్ఆర్ వెంటే సై.. అంది. ఇది జరుగుతున్న సమయంలో ఈ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫు అభ్యర్థి ఎవరా అని ప్రకటించకపోవడంతో రాజ్‌గోపాల్ గారికి తను అనుకున్న పని సులభంగా జరిగిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పాల్వాయి శ్రవంతిని అభ్యర్థిగా ప్రకటించింది. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.

దాసోజు, స్వామి గౌడ్‌ల చేరికల తర్వాత కూడా ఓట్ గ్రాఫ్‌లో పెద్దగా మార్పులు కనిపించకపోవడంతో అధికార పార్టీ లీడర్లు మరో విచిత్రమైన పనికి పూనుకున్నారు. కోమటిరెడ్డి సోదరులకు అత్యంత సన్నిహితులు కొందరిని పర్సనల్ గా లిఫ్ట్ చేసి (కిడ్నాప్‌లు కాదు) ఓ కీలక నేత ముందు హాజరు చేశారు. అతను వీళ్ళపై బహుమానాలు, వరాలు ఝుళిపించాడు. ఈ విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ కొంచెం తడబడ్డారు. ఆ తర్వాత తన అంతరంగికులపై నమ్మకం ఉంది చివరికి నా దగ్గరకే వస్తారని తనవాళ్ళతో చెప్పుకున్నట్టు తెలిసింది. కొన్ని మండలాల్లో ఒకేరోజు పార్టీలు మారిన తన సొంత అనుచరగణ స్థానంలో అప్పటికప్పుడు ఇతరులని నియమించి జాగ్రత్త పడ్డారు. బహుషా కేఆర్ఆర్ ఆతృతపడ్డ క్షణాలు అవి. సడెన్‌గా సాయంత్రం పూట ప్రెస్‌మీట్ పెట్టిన వైనంలో ఇది అర్ధం అయింది.

Munugode By Election On November 3: Action Plan Of Major Parties - Sakshi

 

రాజీనామా చేసిన రోజునుంచి రాజ్‌గోపాల్ గతంలో తనకు పడ్డ 97 వేల ఓట్లలో 67-68% శాతం తిరిగి సెక్యూర్ చేస్కున్నట్టు తేలింది. అంటే దాదాపు 65-67 వేల ఓట్లు. 2018 లో బిజేపి గడించిన ఓట్లు 12 వేల పైచిలుకు. సో ఈ రెండు కలిస్తే రాజ్‌గోపాల్ క్లియర్ ఎడ్జ్‌కి చేరుకున్నారని తెలిసింది. ఆ మిగిలిన 33% శాతం ఓట్లలో కాంగ్రెస్‌కి వెళ్ళేవి వినహాయించి మిగతావి టీయారెస్‌కు వెళ్తాయి అనిపించింది. ఆ తర్వాత నుంచి కాలం గడిచేకొద్దీ.. కాంగ్రెస్‌‌ నుంచి తరుగుతున్న గ్రాఫ్ కేవలం బిజేపికే కలిసిరావడం మొదలైంది. టీఆర్ఎస్ మాత్రం ఆ పాత ఓట్ల (38%) వరకే స్టేబుల్ గా సాగింది.

పోలింగ్‌కి మూడు రోజుల ముందు జరిగిన కేసీఆర్ సభ, ఆ మర్నాడు బిజేపి కేంద్రమంత్రుల చిన్నచిన్న సభలు ఓట్ గ్రాఫ్ పై పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. చివరగా యువకులు, మహిళలు, నడి వయస్కుల పూర్తిస్థాయి మద్దతుతో ముగ్గురు ప్రధాన అభ్యర్థులలో రాజ్‌గోపాల్ ముందంజలో నిలిచారు. పెన్షనర్లు, కురువృద్ధులు, వ్యాపారస్థులు, రైతుల మద్దతు కేసీయార్ వైపు కనిపిస్తుంది. కాలలకతీతంగా సాగే కాంగ్రెస్ సెంటిమెంట్ ఓట్ బ్యాంక్ అన్ని వర్గాల నుంచి సమపాళ్ళలో పొందుచేస్తే 14-16% శాతం వరకూ ఉంది అనిపిస్తుంది. ఈ పరిమాణంలో చూస్తే 38 వేల యువతరం ఓట్లు, 30 వేలు మహిళలు, నడివయస్కులు ఉన్నారు. ఇతర వర్గాల నుంచి ఓ 20 వేల ఓట్లు కేఆర్ఆర్ గడిస్తారు.

Munugode by-poll: Political parties ready to distribute gold for votes

అభ్యర్థుల వారిగా..

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 2014లో 69,496 ఓట్లు గడించి గెలిస్తే.. 2018లో 38 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ 2018 నుంచి మునుగోడు టీఆర్ఎస్ క్యాడర్‌లో చాలా అసంతృప్తి నెలకొందని సమాచారం. క్యాడర్.. ఆ తర్వాత వర్గాలుగా చీలి కూసుకుంట్ల పై వ్యతిరేకత ఏర్పడిందని తెలుస్తోంది. ఈసారి కూడా టికెట్ ఆయనకే ఇవ్వడంతో వాళ్ళలో పూర్తి ఉత్సాహం కనిపించలేదు. 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రుల భర్తీతో ఆ గ్యాప్ బయట ప్రపంచానికి తెలియకుండా మిగిలిపోయింది.

2018 లో అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు పోయి ప్రతిపక్షాల ఊహలను ఛిద్రం చేస్తూ తనదే అయిన స్ట్రేటజీతో తెలంగాణ గద్దెను తిరిగి దక్కించుకున్నారు కేసీఆర్. ఆ సమయంలో మునుగోడులో 97 వేల ఓట్లు గడించి కాంగ్రెస్ పార్టీ పరువును కాపాడారు రాజ్‌గోపాల్ రెడ్డి. ఈ నాలుగేళ్ళలో మునుగోడులో ఏ అభివృద్ధీ జరగకపోవడం, కేంద్రం వర్సెస్ కేసీఆర్ ల నడుమ నెలకొన్న వైరంతో.. తన భవిష్యత్తును కూడా పరీక్షించుకోవాలి అనుకున్నారు రాజ్‌గోపాల్. బిజేపి పెద్దలతో చర్చలు, వెనువెంటనే రాజీనామా.. ఆ తర్వాత ఉప ఎన్నిక ప్రటకన.. ఇవాల్టి దాకా హడావిడి.. తను నమ్ముకున్న ప్రజలు తనను గెలిపిస్తారన్న నిశ్చయంతో ర్యాడికల్‌గా దిగిపోయారు ఆయన. ఆ ప్రోసస్‌లో 78-80% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు‌. గత రెండురోజులుగా మునుగోడు మొత్తం రాజ్‌గోపాల్ పేరుతో ఓ వేవ్ ఏర్పడటం ఇందుకు నిదర్శనం.

 పాల్వాయి స్రవంతి..

తన తండ్రి రాజకీయ వారసత్వం చేబట్టి వచ్చిన పాల్వాయి స్రవంతి ఉప ఎన్నిక ప్రకటించిన సమయంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఆ తర్వాత బిజేపి, టీఆర్ఎస్ ల వ్యూహాలకు బలి అయిన క్యాడర్.. ఈరోజు శ్రవంతిని ఆల్మోస్ట్ హెల్ప్‌లెస్‌గా మిగిల్చారు. 2014 తెలంగాణ రాష్డ్ర ఏర్పడ్డాక వచ్చిన ఎన్నికలో శ్రవంతి 27 వేల ఓట్లు గడించి రెండో స్థానంలో నిలిచారు. 2018లో రాజ్‌గోపాల్ రెడ్డి ఆ స్థానం నుంచి పోటీ చేయడంతో ఆమె పోటీ చేయకుండా మద్దతుదారుగా నిలిచారు. సిట్టింగ్ సీట్‌ను ఈరోజు కోల్పోయే పరిస్థితుల్లో ఈరోజు పాల్వాయి స్రవంతితో పాటు కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ ఓటర్లు సహా నిస్సహాయులుగా మిగిలిపోయారు.

కులాల వారిగా క్యాల్కులేషన్స్ వేస్కుంటే రెడ్డి, ముదిరాజ్, ఎస్టీ లంబాడా, విశ్వబ్రాహ్మణ, ఆర్యవైశ్య, వడ్డెరలు బిజేపికి పెద్దస్థాయిలో మద్దతిస్తున్నట్టు కనిపించింది.. ఎస్సీ మాల, యాదవ, మైనారిటీ, కమ్మ, వెలమ, మున్నూరు కాపు, పద్మశాలీలు టీయారెస్‌కు మక్కువ చూపుతున్నారు అనిపించింది. గౌడ్ ఓట్లు చెరిసగం చీలాయి. మొత్తం ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి 14 శాతం కంటే తక్కువ రాగా.. అన్ని కులాలలోనూ ఆ పార్టీ ఓట్ల శాతం చాలా తక్కువే మిగిలింది అని అంచనా వేసుకోవచ్చు. ఈ సెక్షన్‌లో.. క్రింద పేర్కొన్న కులాల వారిగా ఓట్లు పరిశీలిస్తే రాజ్‌గోపాల్ సునాయాసంగా గెలుస్తారని చెప్పవచ్చు.

మండలాల వారిగా..

నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో TRS ఆధిక్యంలో ఉంది. మర్రిగూడ మండలంలో కాంగ్రెస్‌ గణనీయ ఓట్ బ్యాంక్ కలిగి ఉండటంతో ఈ ఒక్కచోట టీయారెస్‌తో సమానంగా లేదా కాస్త తక్కువ సంఖ్యతో రెండో స్థానంలో నిలబడింది. మిగతా అన్ని మండలాల్లోనూ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది.

చండూరు, మునుగోడు మండలాల్లో టీయారెస్ బిజేపిలు నువ్వానేనా అన్నట్టు సాగాయి. పోలింగ్ సరిగ్గా నాలుగు రోజుల ముందు చండూరులో బిజేపి ఆధిక్యాన్ని సాధించింది. ఎన్నికల ప్రచారాలు ముగిసిన అనంతరం మునుగోడు మండలం రాజ్‌గోపాల్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయింది.

రాజ్‌గోపాల్ రెడ్డి బిజేపిలో చేరిన రోజునుంచి చౌటుప్పల్, ఘట్టుప్పల్, సంస్థాన్ నారాయణ్‌పుర్ మండలాలు బిజేపి వైపే మొగ్గుచూపాయి. బూరనసర్సయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకున్నాక పోలింగ్ జరిగిన రోజువరకూ ఈ మూడు మండలాల్లో బిజేపి హవానే కొనసాగింది. కేటీయార్ ఇంఛార్జ్‌గా వ్యవహరించిన ఘట్టుప్పల్ మండలంలో కూడా బిజేపి ఆధిక్యంలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచిన అంశంగా తీస్కోవచ్చు‌.

 

మర్రిగూడ మండలం:

TRS 38%

INC 36%

BJP 24%

Others 2%

చండూరు మండలం:

BJP 45%

TRS: 40%

INC 10%

others 5%

మునుగోడు మండలం:

BJP 55%

TRS 35%

INC 8%

others 2%

నారాయణ్‌పుర్ మండలం:

BJP 47%

TRS 38%

INC 10%

others 5%

నాంపల్లి మండలం:

BJP 50%

TRS 40%

INC 7%

Others 3%

చౌటుప్పల్ మండలం:

BJP 45%

TRS 40%

INC 10%

Others 5%

ఘట్టుప్పల్ మండలం:

BJP 55%

TRS 38%

INC < 5%

Others 2%

ఎన్నికలకి సరిగ్గా పదిహేను రోజుల ముందు నుంచి టీఆర్ఎస్ పై బిజేపి ఎడ్జ్ పొంది క్రమేణా పెరుగుతూ వచ్చింది. టీఆర్ఎస్ మాత్రం 38-39% శాతం దగ్గర స్టేబుల్‌గా నడిచింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం  14% శాతానికి దిగిపోయింది. కాంగ్రెస్ కోల్పోయిన ఆ మొత్తం ఓట్లు కోమటిరెడ్డి గారికే చేరుకున్నాయి అని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ విధంగా‌ చూసుకుంటే.. రాజ్‌గోపాల్ గారు 2018లో గడించిన 97 వేల ఓట్లలో దాదాపు 80 వేల‌ ఓట్లను కన్వర్ట్ చేసుకోగలిగారు అనిపించింది. వీటికి తోడు బిజేపి ఓట్లు కలిపితే తిరిగి అంతే ఓట్లతో ఆయన గడిస్తారని చెప్పవచ్చు.

సో.. ఈ లెక్కన నవంబర్ 3వ తేదీన జరిగే ఎన్నికలో 80% శాతం.. అంతకంటే అధికంగా పోలింగ్ అయితే.. రాజ్‌గోపాల్ రెడ్డి (బిజేపి) 6% నుంచి 12% వరకూ ఆధిక్యంలో నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి