iDreamPost

వీడియో: పార్టీ మార్పుపై ప్రశ్నలు.. కాంగ్రెస్‌ కార్యకర్తల మీద చేయి చేసుకున్న రాజగోపాల్‌రెడ్డి

  • Published Nov 06, 2023 | 3:03 PMUpdated Nov 06, 2023 | 3:03 PM

మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కోమటిరెడ్డి.. కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఆ వివరాలు..

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. సరిగా 24 రోజులు మాత్రమే ఉంది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని స్పీడ్‌గా దూసుకుపోతున్నాయి. ఓవైపు ప్రచార కార్యక్రమాలతో పార్టీలన్ని ఊపు మీద ఉండగా.. మరో వైపు అసంతృప్త నేతలు కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తూ.. సొంత పార్టీలకు తలనొప్పులుగా మారుతున్నారు. కొందరైతే.. ఏకంగా పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో గతేడాది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తాజాగా ఎన్నికల ముందు తిరిగి సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కూడా మునుగోడు టికెట్‌ను.. రాజగోపాల్‌రెడ్డికే కేటాయించింది. ప్రస్తుతం రాజగోపాల్‌ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది.

పార్టీ మార్పు గురించి కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇన్నిరోజులు బీజేపీలో ఉండి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వచ్చారు అంటూ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని నిలదీశారు. దాంతో ఆగ్రహించిన రాజగోపాల్‌ రెడ్డి.. కాంగ్రెస్ కార్యకర్తల మీద చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే దీనిపై కార్యకర్తలు, నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మాత్రం ఇష్టారీతిగా పార్టీలు మారొచ్చు.. మీ అవసరాల కోసం ఏమైనా చేయవచ్చు.. కానీ కార్యకర్తలు వాస్తవాల గురించి ప్రశ్నిస్తే.. మీకు ఈ ఉలికిపాటు ఎందుకు అని విమర్శిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి