iDreamPost
android-app
ios-app

గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: MP విజయ సాయి రెడ్డి

గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: MP విజయ సాయి రెడ్డి

వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తరచూ టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై  తీవ్ర స్థాయిలో విరుచకు పడుతుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు. క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో  గతంలో సాధించిన సీట్ల కంటే ఎక్కువ  గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం  చేశారు. అలానే చంద్రబాబు.. అసత్య హరిచంద్రుడు అంటూ కామెంట్స్ చేశారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని విజయసాయిరెడ్డి విమర్శించారు. బాపట్ల జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో విజయసాయిరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం వరుసగా రెండో రోజూ కూడ సమావేశం నిర్వహించారు.

బాపట్ల జిల్లా వైసీపీ నేతలతో ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీకి సంబంధించిన అంశాల గురించి చర్చించారు. అలానే నేతలకు పలు సూచలను, సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. చంద్రబాబు అసత్య హరిచంద్రుడని, టీడీపీ పార్టీ ద్రోహుల పార్టీ అంటూ ఫైరయ్యారు. చంద్రబాబు ప్రతి రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి గుణపాఠం నేర్పిస్తాం. చంద్రబాబు.. తనకు తాను సింహానని చెప్పుకుంటాడు. ఆయన గర్జించలేని సింహం. చంద్రబాబు చెప్పేవన్ని అబద్దాలే. అధికారం కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు దేశ ద్రోహానికి కూడా వెనకాడరు. పోలీసులపై దాడి చేసిన చరిత్ర చంద్రబాబుది. ఏపీలో చంద్రబాబుకు ఒక స్థిర నివాసం లేదు” అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

అలానే వైసీపీ మరోసారి అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  సంక్షేమ పథకాలను అమలులో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. అందుకే గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ స్థానాల్లో గెలుస్తాం. 51 శాతానికి పైగా ప్రజలందరూ వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారు. 151 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గదు. సీఎం జగన్ సంక్షేమ పాలననే ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని గొప్ప విజన్ అంటూ  బాబు తెగ హడావుడి చేస్తాడు. ఇప్పుడు విజన్ 2047 అంటూ కొత్త రాగం అందుకున్నాడు. ప్రజలను నమ్మించి మోసం చేసేందుకే విజన్ మాట తెచ్చాడు. 2024 తరువాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుంది. టీడీపీ మునిగి పోయే పడవ” అని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యనించారు. మరి.. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వైసీపీ దారిలోకి స్టార్ ప్రొడ్యూసర్స్! ఇప్పటికి జ్ఞానం బోధపడిందట!