iDreamPost

మీరు మూవీ లవర్సా?.. ప్రతి నెలా థియేటర్‌ లో ఫ్రీగా సినిమాలు చూడొచ్చు!.. ఎలా అంటే?

సినిమాలు ఎక్కువగా చూసే వారికి గుడ్ న్యూస్. థియేటర్ లో ఫ్రీగా సినిమా చూడొచ్చు. ప్రతి నెల ఉచితంగా సినిమాలు చూసే అవకాశం. ఇలా చేసి ఫ్రీ మూవీ టికెట్లను పొందొచ్చు.

సినిమాలు ఎక్కువగా చూసే వారికి గుడ్ న్యూస్. థియేటర్ లో ఫ్రీగా సినిమా చూడొచ్చు. ప్రతి నెల ఉచితంగా సినిమాలు చూసే అవకాశం. ఇలా చేసి ఫ్రీ మూవీ టికెట్లను పొందొచ్చు.

మీరు మూవీ లవర్సా?.. ప్రతి నెలా థియేటర్‌ లో ఫ్రీగా సినిమాలు చూడొచ్చు!.. ఎలా అంటే?

మూవీ లవర్స్ విడుదలైన ప్రతి సినిమాను వదిలి పెట్టకుండా చూడాలనుకుంటారు. సినిమాను అంతగా ప్రేమిస్తుంటారు కొందరు వ్యక్తులు. అయితే థియేటర్ కు వెళ్లిన ప్రతిసారి డబ్బులు ఖర్చవుతుంటాయి. ఈ నేపథ్యంలో అసలు రూపాయి ఖర్చు లేకుండా ఎంచక్కా థియేటర్ లో సినిమా చూడొచ్చు అనే విషయం మీకు తెలుసా? సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడే వారు ప్రతినెలా థియేటర్ లో ఫ్రీగానే సినిమాలు చూడొచ్చు. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా ఫ్రీగా సినిమాలు చూడొచ్చు. ఇంతకీ ఏ క్రెడిట్ కార్డులు, ఫ్రీగా సినిమాలు చూడడం ఎలా సాధ్యం? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాంకులు పలు రకాల క్రెడిట్ కార్డులను కస్టమర్లకు జారీ చేస్తుంటాయి. అవసరాలకు వాడుకుని ఆ తర్వాత సదరు బ్యాంక్ నియమాల ప్రకారం బిల్లులను చెల్లిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డుతో ఆర్థిక అవసరాలే కాదు.. ఫ్రీగా సినిమాలు కూడా చూడొచ్చు. ఆ క్రెడిట్ కార్డు ఏంటంటే.. పీవీఆర్ కోటక్ గోల్డ్ క్రెడిట్ కార్డు. కోటక్ మహీంద్రా బ్యాంక్ పీవీఆర్ సంస్థ భాగస్వామ్యంతో ఈ క్రెడిట్ కార్డును ప్రవేశ పెట్టింది. ఈ క్రెడిట్ కార్డును ఫ్రీగా పొందొచ్చు. ఈ కార్డు ఉపయోగించడం ద్వారా ప్రతి నెలా ఒక పీవీఆర్ మూవీ టికెట్ ఉచితంగానే పొందొచ్చు.

అయితే ఫ్రీ టికెట్ పొందాలంటే మాత్రం నెలకు రూ.10 వేలకు పైగా కార్డు ద్వారా ఖర్చు చేయాలి. అదే రూ. 15 వేలకు పైగా ఖర్చు చేస్తే 2 ఉచిత పీవీఆర్ మూవీ టికెట్లు సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు ద్వారా నెలకు నాలుగు సార్లు బై 1 గెట్ 1 టికెట్ ఫెసిలిటీ పొందొచ్చు. అయితే బుక్ మై షో ద్వారా టికెట్ బుక్ చేసుకుంటేనే ఈ ప్రయోజనం లభిస్తుంది. ఈ విధంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫ్రీగా టికెట్లను పొంది సినిమాలు చూడొచ్చు. మరి క్రెడిట్ కార్డుల ద్వారా థియేటర్ లో ఫ్రీగా సినిమాలు చూడొచ్చన్న అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి