iDreamPost

Yatra-2 OTT: యాత్ర-2 OTT రిలీజ్ ఎప్పుడు? ఆ డేట్ లాక్ చేయబోయితున్నారా?

  • Published Apr 06, 2024 | 12:38 PMUpdated Apr 06, 2024 | 12:38 PM

థియేటర్ లో విడుదల అయినా సినిమాలు దాదాపు నెలలోపే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. అయితే ఇటీవల పొలిటికల్ టచ్ తో వచ్చిన సినిమా యాత్ర-2 . థియేటర్ లో విడుదలైన ఇన్ని రోజులకు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

థియేటర్ లో విడుదల అయినా సినిమాలు దాదాపు నెలలోపే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. అయితే ఇటీవల పొలిటికల్ టచ్ తో వచ్చిన సినిమా యాత్ర-2 . థియేటర్ లో విడుదలైన ఇన్ని రోజులకు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 06, 2024 | 12:38 PMUpdated Apr 06, 2024 | 12:38 PM
Yatra-2 OTT: యాత్ర-2 OTT రిలీజ్ ఎప్పుడు? ఆ డేట్ లాక్ చేయబోయితున్నారా?

సాధారణంగా పొలిటికల్ టచ్ తో వచ్చే సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించడంతో.. దర్శకులు కూడా పొలిటికల్ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. రాజకీయ నాయకుల నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని.. వారి గురించి అందరికి తెలియజేస్తున్నారు. దీనితో చూసే వారందరికీ కూడా ఈ సినిమాలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం “యాత్ర 2”. 2019లో విడుదలైన చిత్రం యాత్ర‌కు సీక్వెల్‌గా.. ఇప్పుడు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ యాత్ర 2 మూవీని తెర‌కెక్కించాడు. కాగా ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 8న థియేట‌ర్ల‌లో విడుదలైంది. సాధారణంగా థియేటర్ లో రిలీజ్ అయిన ఏ సినిమాలైనా నెల రోజులలోనే ఓటీటీలోకి వచేస్తుంటాయి. కానీ, ఈ సినిమా మాత్రం ఆలస్యం అయింది. ఈ క్రమంలో తాజాగా యాత్ర-2 ఓటీటీ ఎంట్రీపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, క‌మ‌ర్షియ‌ల్ సినిమా రేంజ్‌లో యాత్ర-2 సినిమాను .. 30 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమా విడుదల ముందు ప్రమోషన్స్ కూడా భారీగానే జరిగాయి. దీనితో ఈ సినిమా విడుదలైన మొదటి రోజునే రెండున్న‌ర కోట్లవ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అలాగే ఫ‌స్ట్ వీక్‌లో ఏడుకోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను, మూడున్న‌ర కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. అయితే ఈ సినిమా.. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో ఉండడం వలన.. కాంట్రవర్సిసిస్ రావొచ్చేమో అనే భయంతో ఇప్పటివరకు ఈ సినిమాను కొనేందుకు ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ముందుకు రాలేదనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో యాత్ర-2 సినిమాను కొనేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ .. మూవీ టీం ను సంప్రదించి భారీ ధరలకే .. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిందట. తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ సినిమా ఏప్రిల్ 19నుంచి.. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా యాత్ర 2 స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై అమెజాన్ ప్రైమ్ నుంచి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

When is Yatra-2 OTT release

కాగా, యాత్ర 2 సినిమా కథ విషయానికొస్తే.. 2019లో విడుదలైన యాత్ర సినిమాకు సిక్వెల్ గా .. డైరెక్టర్ మ‌హి .వి రాఘ‌వ్ యాత్ర 2ను తెర‌కెక్కించాడు. యాత్ర సినిమా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా తీశారు. ఇక యాత్ర 2 సినిమాలో.. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత.. ఆయన కుమారుడు ఇప్పటి సీఎం జ‌గ‌న్ జీవితంలో చోటుచేసుకున్న రాజ‌కీయ‌ ప‌రిణామాల‌ను.. చూపించారు . దాదాపు పదేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఈ సినిమాలో ప్రస్తావించారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలేయడాని గల కారణాలు..
ఓదార్పు యాత్ర‌ను సొంత పార్టీవాళ్లే అడ్డుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు, జ‌గ‌న్‌ సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తుతో తొలిసారి సీఏంగా ఎలా ఎంపికయ్యారన్న విషయాలన్నింటిని ఈ సినిమాలో చూపించారు. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి