iDreamPost
android-app
ios-app

టీమ్ కంటే అదే ఇంపార్టెంటా? అంత వెంపర్లాట అవసరమా విరాట్​?

  • Author singhj Published - 08:16 PM, Fri - 3 November 23

వరల్డ్ కప్​లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. అయితే ఒక విషయంలో అతడు అంతగా వెంపర్లాడటం పెద్దగా ఎవరికీ నచ్చట్లేదు. దీంతో టీమ్ కంటే కోహ్లీకి అదే ఇంపార్టెంటా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వరల్డ్ కప్​లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. అయితే ఒక విషయంలో అతడు అంతగా వెంపర్లాడటం పెద్దగా ఎవరికీ నచ్చట్లేదు. దీంతో టీమ్ కంటే కోహ్లీకి అదే ఇంపార్టెంటా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • Author singhj Published - 08:16 PM, Fri - 3 November 23
టీమ్ కంటే అదే ఇంపార్టెంటా? అంత వెంపర్లాట అవసరమా విరాట్​?

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా డామినేషన్ మామూలుగా లేదు. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తూ మెగాటోర్నీలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది రోహిత్ సేన. ఆ టీమ్, ఈ టీమ్ అనే తేడాలేదు.. ఇప్పటిదాకా ఎదురుపడ్డ ప్రతి జట్టును ఓడిస్తూ వచ్చింది భారత్. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్​లో విక్టరీతో సెమీఫైనల్ బెర్త్​ను అఫీషియల్​గా కన్ఫర్మ్ చేసుకుంది. ఈ టోర్నమెంట్​లో భీకరమైన గేమ్​తో ఒకప్పుడు ప్రత్యర్థి జట్లను చివురుటాకులా వణికించిన ఆస్ట్రేలియాను గుర్తుకుతెస్తోంది టీమిండియా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లో ఇరగదీస్తున్న మన జట్టుతో మ్యాచ్ అంటేనే అవతలి టీమ్స్ భయపడిపోతున్నాయి.

ముఖ్యంగా భారత బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. బౌలింగ్​లో మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్​, కుల్దీప్ యాదవ్​లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్​లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్​మన్​ గిల్​తో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు రాణిస్తున్నారు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కమ్​బ్యాక్ ఇస్తే బౌలింగ్​, బ్యాటింగ్ విభాగాలు మరింత బలోపేతం అవుతాయి. ప్రస్తుతం బ్యాటింగ్​లో అందరూ భీకరమైన ఫామ్​లో ఉన్నా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రోహిత్ ఔట్ అయితే విరాట్ మ్యాచ్​ పూర్తయ్యే వరకు క్రీజులో నిలబడుతున్నాడు. ఒకవేళ కోహ్లీ ఫెయిలైతే రోహిత్ బాధ్యతను తీసుకుంటున్నాడు.

రోహిత్​లాగే ఈ వరల్డ్ కప్​లో కోహ్లీ కూడా అదరగొడుతున్నాడు. కానీ ఒక విషయంలో మాత్రం విరాట్​పై విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్, శ్రీలంకపై మ్యాచుల్లో కోహ్లీ భారీ స్కోర్లు చేశాడు. ఆసీస్​పై 85 రన్స్ చేసిన విరాట్, న్యూజిలాండ్​తో మ్యాచ్​లో 95 పరుగులు చేశాడు. లంకతో మ్యాచ్​లో 88 రన్స్​ వద్ద ఔటయ్యాడు. ఈ మూడు సార్లు కూడా ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్లాక తీవ్ర నిరాశలో కనిపించాడు కింగ్ కోహ్లీ. ఎందుకు ఔటయ్యానా అని తల బాదుకోవడం, నిరుత్సాహంగా ఉన్నట్లు కనిపించడం కెమెరా కంటికి చిక్కింది. ఒకసారైతే సెంచరీ మిస్ చేసుకున్నాననే బాదలో కోహ్లీ ఏడుస్తూ కనిపించాడు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. కోహ్లీ లాంటి లెజెండరీ ప్లేయర్ సెంచరీ మిస్సయితే ఇంతలా రియాక్ట్ అవ్వడం ఏంటనేది అర్థం కావట్లేదు.

సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. బహుశా ఆ ఒత్తిడి వల్లే సెంచరీ మిస్సయితే కోహ్లీ ఫ్రస్టేట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. 80 లేదా 90ల్లో ఎంటర్ అవ్వగానే కోహ్లీ నిదానంగా బ్యాటింగ్ చేయడం, డబుల్స్ తీయకపోవడం, ఎక్కువగా షాట్లు ఆడకపోవడం ఈ వరల్డ్ కప్​లో చూసే ఉంటారు. దీంతో పర్సనల్ రికార్డుల కోసం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. టీమ్ గెలుపు ముఖ్యం, నెట్ రన్​రేట్ ముఖ్యం కాబట్టి అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకొని అవసరమైనప్పుడు గేర్లు ఛేంజ్ చేయాలి. కానీ కోహ్లీ మాత్రం అలా చేయడం లేదు.

ఆడుతున్న క్రమంలో రికార్డులు బ్రేక్ చేస్తే బాగుంటుంది.. కానీ రికార్డుల కోసం ఆడటం మాత్రం సరికాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా అంటున్నారు. దీనికి భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఉదహరిస్తున్నారు. ఇంగ్లండ్​తో మ్యాచ్​లో రోహిత్ 87 రన్స్ చేసి ఔటయ్యాడు. అతడు కావాలనుకుంటే మెళ్లిగా ఆడి సెంచరీ కంప్లీట్ చేయొచ్చు. కానీ టీమ్ కోసం షాట్లు కొడుతూ మ్యాచ్​ను త్వరగా ఫినిష్ చేయబోయి హిట్​మ్యాన్ పెవిలియన్ చేరాడు. కోహ్లీతో పాటు రోహిత్ కూడా వరల్డ్ కప్​లో రెండుసార్లు సెంచరీ మిస్ చేసుకున్నాడు.

రెండుసార్లు సెంచరీకి దగ్గరగా వచ్చి తృటిలో మిస్సయినా డ్రెస్సింగ్ రూమ్​లో నవ్వుతూ, కూల్​గా కనిపించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ విరాట్ కోహ్లీ మాత్రం సెంచరీ మిస్సయితే బాధలో మునిగిపోయాడు. దీంతో టీమ్ కంటే మైల్​స్టోన్స్ ముఖ్యమా అని విరాట్​ను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా రికార్డులను పక్కనబెట్టి టీమ్ కోసం ఆడాలని సూచిస్తున్నారు. అలా చేస్తే రికార్డులు వాటంతట అవే కోహ్లీ కాళ్ల దగ్గరకు వస్తాయని చెబుతున్నారు. మరి.. రికార్డుల గురించి విరాట్ అంతగా పరితపించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఆఫ్ఘాన్ టీమ్​లో ఇది గమనించారా? వాళ్లిద్దరూ సేమ్ టు సేమ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి