శ్రీలంకతో మ్యాచ్ తర్వాత డీఆర్ఎస్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో నిర్ణయాన్ని అతడికే వదిలేశానన్నాడు.
శ్రీలంకతో మ్యాచ్ తర్వాత డీఆర్ఎస్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో నిర్ణయాన్ని అతడికే వదిలేశానన్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. బ్రేకుల్లేని బుల్డోజర్లా మెగా టోర్నీలో దూసుకెళ్తున్న టీమిండియా వరుసగా ఏడో మ్యాచ్‌లో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్‌కు చేరుకున్న రోహిత్ సేన.. అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి సౌతాఫ్రికాతో కాగా.. మరొకటి నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది. ఆల్రెడీ సెమీస్‌కు క్వాలిఫై అయినందున ఈ రెండు మ్యాచుల్లో కొందరు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచుల్లో ప్రయోగాలు చేసేందుకు కూడా టీమిండియాకు అవకాశం ఉంది. అయితే విన్నింగ్ స్ట్రీక్‌ను మెయింటెయిన్ చేయాలంటే మాత్రం అదే టీమ్‌తో వెళ్లొచ్చు. ఇదిలా ఉంటే.. లంకపై విజయం తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్ మొత్తం సమష్టిగా ఆడటం వల్లే ఇది సాధ్యమైందన్నాడు. సెమీస్‌కు అఫీషియల్‌గా క్వాలిఫై అవ్వడం సంతోషంగా ఉందన్నాడు. చెన్నైలో స్టార్ట్ అయిన తమ వరల్డ్ కప్ జర్నీలో ఫస్ట్ టార్గెట్ పూర్తయిందన్నాడు రోహిత్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడం తమకు దక్కిన గొప్ప సవాల్ అన్నాడు. లంకపై గెలుపులో క్రెడిట్ పేసర్లకు ఇవ్వాలన్నాడు రోహిత్ శర్మ. అసాధారణ బౌలింగ్‌తో పేసర్లు అదరగొట్టారని మెచ్చుకున్నాడు.
బుమ్రా, సిరాజ్, షమీలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరన్నాడు రోహిత్. శ్రేయస్ అయ్యర్ సత్తా ఏంటో తమకు తెలుసన్నాడు. అతడి పవర్ ఏంటో మరోమారు చూపించాడని ప్రశంసించాడు హిట్‌మ్యాన్. ఈ సందర్భంగా డీఆర్ఎస్ పైనా రోహిత్ కామెంట్స్ చేశాడు. డీఆర్ఎస్ నిర్ణయంలో తాను జోక్యం చేసుకోనని.. ఆ డెసిజన్ను పూర్తిగా కీపర్ కేఎల్ రాహుల్‌కే వదిలేశానన్నాడు. రెండు రివ్యూలు తీసుకుంటే ఒకటి తమకు అనుకూలంగా.. మరొకటి ప్రతికూలంగా వచ్చిందన్నాడు. డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా? అనేది రాహుల్‌కు, బౌలర్లకే వదిలేశానని రోహిత్ స్పష్టం చేశాడు. మరి.. డీఆర్ఎస్ విషయంలో కీపర్, బౌలర్‌కు రోహిత్ స్వేచ్ఛను ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శ్రీలంకపై టీమిండియా విజయం! ఊహించని కామెంట్స్ చేసిన అక్తర్
Rohit Sharma said, “I’ve left the DRS call on bowlers and KL Rahul. I know I can trust them, especially KL. He’s been brilliant”. pic.twitter.com/2Y1MF3SgRi
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023