iDreamPost

శ్రీలంకపై టీమిండియా విజయం! ఊహించని కామెంట్స్‌ చేసిన అక్తర్‌

  • Published Nov 03, 2023 | 3:42 PMUpdated Nov 03, 2023 | 3:42 PM

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ సక్సెస్‌గా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి టేబుల్‌ టాపర్‌గా ఉంది. లంకపై విజయంతో సగర్వంగా సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియాపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ సక్సెస్‌గా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి టేబుల్‌ టాపర్‌గా ఉంది. లంకపై విజయంతో సగర్వంగా సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియాపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Nov 03, 2023 | 3:42 PMUpdated Nov 03, 2023 | 3:42 PM
శ్రీలంకపై టీమిండియా విజయం! ఊహించని కామెంట్స్‌ చేసిన అక్తర్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. ఈ టోర్నీలో హాట్‌ ఫేవరేట్స్‌లో ఒకటిగా అడుగుపెట్టిన టీమిండియా.. ఆ మాటను నిజం చేస్తూ ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది టీమిండియా. గురువారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అయితే టీమిండియాకు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అసలు తిరుగులేదని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం లంకను కేవలం 55 పరుగులుకే టీమిండియా బౌలర్లు కుప్పకూల్చారు.

టీమిండియా సాధిస్తున్న ఈ వరుస విజయాలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏకంగా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, దిగ్గజ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం టీమిండియా విజయాలపై సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా ఎంతో అద్భుతంగా ఆడుతోందని, బౌలర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ సూపర్‌ బౌలింగ్‌తో రాణిస్తున్నారని, వారి బౌలింగ్‌ చూస్తుంటే తనకెంతో సంతోషంగా ఉందని అన్నాడు. ఓ ఫాస్ట్‌ బౌలర్‌గా మంచి బౌలింగ్‌ ప్రదర్శనను చూస్తుండటంతో అక్తర్‌ అలా హ్యాపీగా ఫీలై ఉంటాడు. టీమిండియా ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్‌ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది.

హాట్‌ ఫేవరేట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆరంభంలో రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి పటిష్టంగానే కనిపించింది. కానీ, వినయ విధేయ రామ సినిమాలో రామ్‌ చరణ్‌ చెప్పే డైలాగ్‌.. ‘సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు.. మగాడే’ అన్నట్లు.. టీమిండియాతో మ్యాచ్‌కి ముందు విజయాలు సాధించిన పాకిస్థాన్‌.. టీమిండియాతో మ్యాచ్‌లో చితికిలపడింది. ఆ తర్వాత వరుసగా మరో మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. నాలుగు వరుస ఓటముల తర్వాత బంగ్లాదేశ్‌పై విజయంతో సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. కానీ, ఇప్పటికీ పాకిస్థాన్‌ సెమీస్‌ చేరడం అంత సులువు కాదు. దాని చాలా సమీకరణాలు కలిసిరావాలి. మరి సొంత జట్టు వరల్డ్‌ కప్‌ చెత్త ప్రదర్శన చేస్తున్నా.. టీమిండియా ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తున్న అక్తర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి