రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరూ భారత టీమ్‌కు వెన్నెముకగా చెప్పొచ్చు. వీళ్లలో ఒకరు ప్రస్తుత కెప్టెన్ అయితే, మరొకరు మాజీ సారథి. గ్రౌండ్లోకి దిగితే కూల్‌గా తన పని తాను చేసుకోవడం ఒకరి స్టైల్. మైదానంలోకి దిగితే ఫుల్ అగ్రెషన్‌తో అపోజిషన్నను కోలుకోలేకుండా చేయడం మరొకరి పద్ధతి. ఎన్నో ఏళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు రోహిత్-విరాట్. అయితే వీళ్లిద్దరి మధ్య గొడవలున్నాయని, ఒకరంటే ఒకరికి పడదని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. రోహిత్‌కు మద్దతుగా ఓ వర్గం ఒకవైపు.. కోహ్లీకి సపోర్టుగా మరో గ్రూప్ ఒకవైపు టీమ్‌లో ఉన్నాయని చాలా సార్లు రూమర్స్ వినిపించాయి.
రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా పగ్గాలు చేపట్టాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రోహిత్-విరాట్లు మునుపటి కంటే మరింత ఫ్రెండ్లీగా కనిపిస్తున్నారు. భారత ఫీల్డింగ్ టైమ్‌లో కీలక డెసిషన్స్‌లో హిట్‌మ్యాన్‌కు కోహ్లీ అండగా ఉండటాన్ని, విలువైన సూచనలు ఇవ్వడాన్ని గమనించే ఉంటారు. ఆసియా కప్ నెగ్గడం, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో విక్టరీ.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఈసారి కప్పు మనదే అనే ధీమా ప్లేయర్లందరిలో కనిపిస్తోంది. అయితే రోహిత్-విరాట్ మధ్య బయటకు కనిపించని పోటీ నడుస్తున్నట్లు అనిపిస్తోంది. ఇందుకు శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎంగ్జాపుల్ అని చెప్పొచ్చు.
పాక్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ టైమ్‌లో రోహిత్‌తో మాట్లాడుతూ, అతడికి సలహాలు ఇస్తూ కనిపించాడు కోహ్లీ. కానీ బ్యాటింగ్‌లో మాత్రం ఇద్దరి మధ్య పోరు కనిపించింది. రోహిత్ విషయంలో విరాట్ అసూయతో ఉన్నట్లు అనిపించిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా అంటున్నారు. దానికి కారణం.. అవసరం లేకున్నా హిట్‌మ్యాన్‌కు పోటీగా విరాట్ హిట్టింగ్‌కు దిగడమే. వన్డేల్లో ముఖ్యంగా ఛేజింగ్ టైమ్‌లో క్రీజులో కుదురుకున్నాకే కోహ్లీ షాట్స్ ఆడతాడు. కానీ పాక్‌తో మ్యాచ్‌లో ఒకవైపు రోహిత్ వరుసగా ఫోర్లు, సిక్సులతో దాయాది బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు.
రోహిత్ బ్యాట్‌తో రెచ్చిపోతున్న టైమ్‌లో విరాట్ కొట్టిన షాట్లు సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో సింగిల్స్, డబుల్స్‌తో సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ రోహిత్ మాత్రం నీళ్లు తాగినంత సులువుగా బాల్‌ను బౌండరీకి తరలిస్తున్నాడు. గ్రౌండ్ మొత్తం రోహిత్.. రోహిత్ అంటూ ఒకటే అరుపులు, కేకలు. దీంతో రోహిత్‌లాగే తానూ హిట్టింగ్ చేయాలని ప్రయత్నించి ఫెయిలయ్యాడు కింగ్ కోహ్లీ. చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆ టైమ్‌లో అతడ్ని చూస్తే ఏదో కొత్తగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. రోహిత్‌తో పోటీపడాలనే తాపత్రయమే విరాట్‌ను ఔట్ చేసిందని చెప్పొచ్చు. అనవసరంగా హిట్‌మ్యాన్‌కు పోటీగా వెళ్లి వికెట్ పారేసుకున్నాడు గానీ కోహ్లీ క్రీజులో ఉంటే మ్యాచ్ ఎప్పుడో ముగిసేది.
అటాకింగ్ చేయడం రోహిత్ శర్మ న్యాచులర్ గేమ్. స్ట్రయిక్ రొటేట్ చేయడం, గ్యాప్స్‌లోకి బంతిని తరలించడం, అదును చూసి చెత్త బంతుల్ని శిక్షించడం, అవసరమైన టైమ్‌లో గేమ్ స్పీడ్‌ను పెంచడం కోహ్లీ శైలి. కానీ నిన్న దీనికి పూర్తి భిన్నంగా అతడి ఆట సాగింది. ఒకవేళ కోహ్లీ తర్వాత రోహిత్, అయ్యర్ కూడా వెంటవెంటనే అవుటైతే భారత్ పరిస్థితి ఏమయ్యేదో? దీన్ని చూసి నెటిజన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. అనవసరమైన పోటీలు పెట్టుకోకుండా టీమ్ కోసం గెలిపించే దాకా క్రీజులో ఉండాలని, ఎవరి గేమ్ వాళ్లు ఆడితే జట్టుకు కప్పు ఖాయమని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శుబ్‌మన్ గిల్‌కు ICC అవార్డు.. తొలి టీమిండియా ప్లేయర్‌గా రికార్డు!