iDreamPost

శుబ్​మన్​ గిల్​కు ICC అవార్డు.. తొలి టీమిండియా ప్లేయర్​గా రికార్డు!

  • Author singhj Published - 05:12 PM, Sun - 15 October 23
  • Author singhj Published - 05:12 PM, Sun - 15 October 23
శుబ్​మన్​ గిల్​కు ICC అవార్డు.. తొలి టీమిండియా ప్లేయర్​గా రికార్డు!

సూపర్ ఫామ్​లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుబ్​మన్​ గిల్​ను అరుదైన అవార్డు వరించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్​ ది మంత్ పురస్కారాన్ని గిల్ గెలుచుకున్నాడు. 2023 సెప్టెంబర్ నెలలో బెస్ట్ పెర్ఫార్మెన్స్​కు గానూ ఈ అవార్డు భారత యంగ్ ఓపెనర్​కు దక్కింది. ఈ పురస్కారం గెలుచుకోవడం ద్వారా గిల్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించే ప్లేయర్ ఆఫ్​ ది మంత్ అవార్డును రెండుసార్లు దక్కించుకున్న తొలి టీమిండియా క్రికెటర్​గా రికార్డు క్రియేట్ చేశాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి నెలలో మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గిల్ దక్కించుకున్నాడు. ఈ పురస్కారాన్ని అతడు ఒకే ఏడాది రెండుమార్లు సాధించడం విశేషమనే చెప్పుకోవాలి. కాగా, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎక్కువ సార్లు దక్కించుకున్న ఘనత పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం సొంతం. అతడు ఇప్పటిదాకా మూడు సార్లు ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. శుబ్​మన్ గిల్ కంటే ముందు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కొంతమంది భారత స్టార్లు గెలుచుకున్నారు.

టీమిండియా నుంచి రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీలు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఒక్కోసారి గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2021 జనవరి నుంచి ఈ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పురస్కారాలను మొదటి మూడు నెలలు (పంత్, అశ్విన్, భువనేశ్వర్) టీమిండియా క్రికెటర్లే దక్కించుకోవడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఇక, ఐసీసీ తాజాగా ప్రకటించిన టీమ్ ర్యాంకింగ్స్​లో భారత జట్టు హవా కొనసాగింది. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా ఫస్ట్ ప్లేసులో కొనసాగుతోంది. మరి.. గిల్​కు ఐసీసీ అవార్డు దక్కడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: దెబ్బ మీద దెబ్బ.. కష్టాల్లో ఉన్న శ్రీలంకకు బిగ్ షాక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి