iDreamPost

ఇంగ్లండ్​పై రవిశాస్త్రి సెటైర్లు.. మీరా వరల్డ్ ఛాంపియన్స్ అంటూ..!

  • Author singhj Published - 10:08 PM, Tue - 31 October 23

ప్రపంచ కప్​లో వరుస ఓటములతో దిక్కుతోచని స్థితిలో ఉంది ఇంగ్లండ్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటూ గొప్పలు పోతే.. ఇప్పుడు పాయింట్స్ టేబుల్​లో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో బట్లర్ సేనపై రవిశాస్త్రి సెటైర్లు వేశాడు.

ప్రపంచ కప్​లో వరుస ఓటములతో దిక్కుతోచని స్థితిలో ఉంది ఇంగ్లండ్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటూ గొప్పలు పోతే.. ఇప్పుడు పాయింట్స్ టేబుల్​లో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో బట్లర్ సేనపై రవిశాస్త్రి సెటైర్లు వేశాడు.

  • Author singhj Published - 10:08 PM, Tue - 31 October 23
ఇంగ్లండ్​పై రవిశాస్త్రి సెటైర్లు.. మీరా వరల్డ్ ఛాంపియన్స్ అంటూ..!

వన్డే వరల్డ్ కప్​-2023 మొదలవ్వడానికి ముందు ఫేవరెట్ టీమ్స్​లో ఇంగ్లండ్ ఒకటి. ఈసారి సెమీస్ కాదు.. ఫైనల్​కు కూడా ఆ టీమ్ చేరుకుంటుందని క్రికెట్ అనలిస్టులు అంచనా వేశారు. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ అందరి ఎక్స్​పెక్టేషన్స్​ను తలకిందులు చేస్తూ దారుణంగా ఫెయిల్ అవుతోంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం ఒకే మ్యాచ్​లో అదీనూ బంగ్లాదేశ్​ మీద మాత్రమే నెగ్గింది. ప్రస్తుతం ఆ టీమ్ పాయింట్స్ టేబుల్​లో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ టీమ్ పెర్ఫార్మెన్స్​ మీద టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లండ్ పెర్ఫార్మెన్స్ ఆ టీమ్ ఫ్యాన్స్​తో పాటు ఆడియెన్స్​ను కూడా ఎంతగానో నిరాశపర్చిందన్నాడు రవిశాస్త్రి. టీమిండియాకు, ఇంగ్లండ్​ టీమ్​కు మధ్య ఉన్న తేడాను కూడా వివరించాడు. న్యూజిలాండ్​తో ఫస్ట్ మ్యాచ్​లో మరో 17 ఓవర్లు ఉండగానే బట్లర్ సేన ఓడిపోయిందన్నాడు రవిశాస్త్రి. సౌతాఫ్రికాపై కనీసం ఫైట్ చేయకుండా 22 ఓవర్లకే ఆలౌట్ అయ్యారన్నాడు. ఆ తర్వాత శ్రీలంక మీద 33 ఓవర్లకు చేతులెత్తేశారని.. ఇంగ్లీష్ టీమ్ నిర్దేశించిన టార్గెట్​ను లంక 25 ఓవర్లలో ఛేజ్ చేసిందని రవిశాస్త్రి తెలిపాడు. భారత్​తో మ్యాచ్​లోనూ 32 ఓవర్లలోపే 8 వికెట్లు కోల్పోయారని.. వీళ్లా ప్రపంచ ఛాంపియన్స్ అంటూ ఇంగ్లండ్ పరువు తీసేశాడు.

‘వరుసగా దారుణంగా ఫెయిల్ అవుతున్న వీళ్లా వరల్డ్ ఛాంపియన్స్? ఈ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ బాధపడకపోతే మరెవరు బాధపడతారు? టీమిండియాకు, ఇంగ్లండ్​కు మధ్య ఉన్న తేడా ఏంటని అడిగితే.. ఎనిమిది జట్లని చెబుతా. పాయింట్స్ టేబుల్​లో ఈ తేడాను చూడొచ్చు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇస్తోంది. ఆతిథ్యం ఇస్తున్న పాక్​తో పాటు వరల్డ్ కప్​లో టాప్-7లో నిలిచిన టీమ్స్ మాత్రమే టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ఇకనైనా ఇంగ్లండ్ పరువు కాపాడుకునేందుకు ఆడాలి. ఒకవేళ టాప్-7లోకి రాకపోతే ఆ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై కాదు. ఇది ఇంగ్లీష్ క్రికెట్​కు పెద్ద దెబ్బే అవుతుంది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి.. ఇంగ్లండ్​ టీమ్​పై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఎట్టకేలకు పాకిస్థాన్ ఓటములకు బ్రేక్.. సెమీస్ ఛాన్స్ ఉందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి