iDreamPost
android-app
ios-app

భారత్​తో మ్యాచ్​కు ముందు రోహిత్​ను ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ టీమ్!

  • Author singhj Updated - 09:40 AM, Sat - 14 October 23
  • Author singhj Updated - 09:40 AM, Sat - 14 October 23
భారత్​తో మ్యాచ్​కు ముందు రోహిత్​ను ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ టీమ్!

ప్రతి క్రికెటర్​కు ఒక డిఫరెంట్ స్టయిల్ ఉంటుంది. బ్యాటింగ్ లేదా బ్యాటింగ్ ఏదైనా సరే ఒక్కొక్కరిది ఒక్కో శైలి. బ్యాట్స్​మన్ అన్ని షాట్లు బాగానే ఆడినా వారికంటూ పేరు తీసుకొచ్చేవి కొన్ని ప్రత్యేకమైన షాట్స్ ఉంటాయి. ఆ షాట్స్ ఆడినంత బాగా మిగిలిన షాట్స్ వాళ్లు ఆడలేరు. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా స్ట్రయిట్ డ్రైవ్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ షాట్ కొట్టడంలో మాస్టర్​ను మించినోళ్లు లేరని చెప్పొచ్చు. ఎంతటి భీకర పేసర్​ బౌలింగ్​లోనైనా సచిన్ పర్ఫెక్ట్ టైమింగ్​తో స్ట్రయిట్ డ్రైవ్ ఆడితే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.

సచిన్ వారసుడిగా పేరు తెచ్చుకున్న రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ బాగా ఫేమస్. మ్యాచ్ కండీషన్స్ ఎలా ఉన్నా సరే బాల్ కాస్త ఆఫ్ సైడ్ పడినా కోహ్లీ కవర్ డ్రైవ్ కొడతాడు. ఆ వైపు ఎంత మంది ఫీల్డర్లను మోహరించినా బాల్​ను బౌండరీకి తరలించడం విరాట్ స్పెషాలిటీ. ఇక, లెజెండరీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని హెలికాప్టర్ షాట్ ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేం. అప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఎవరూ ఆడని షాట్ ఇది. యార్కర్లను కూడా సిక్సులుగా తరలించొచ్చని ఈ షాట్​తో మాహీ ప్రూవ్ చేశాడు. దిల్షాన్ దిల్ స్కూప్ కూడా ప్రత్యేకమైన షాటే.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఒకటి కాదు.. రెండు, మూడు షాట్స్ అద్భుతంగా ఆడగలడు. ముఖ్యంగా అతడి పుల్ షాట్ గురించి చెప్పుకోవాలి. పేసర్ల బౌలింగ్​లో పుల్ షాట్​తో ఎక్కువ రన్స్ రాబడతాడు రోహిత్. అతడి ఈ షాట్​కు పాకిస్థాన్ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. పుల్ షాట్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారని పాక్ క్రికెటర్లను అడిగితే ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం సహా అందరూ రోహిత్ శర్మ అని చెప్పారు. హిట్​మ్యాన్ పుల్ షాట్ సూపర్బ్ అని మెచ్చుకున్నారు. రోహిత్​ను పాక్ టీమ్ మెచ్చుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. రోహిత్​ను పాక్ ప్లేయర్లు మెచ్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్​తో మ్యాచ్​ అంటే ఈ ప్లేయర్​కు పూనకాలే.. మళ్లీ గెలిపిస్తాడా?

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)