ఐసీసీ టోర్నీల్లో గాయలు భారత్‌కు శాపంగా మారుతున్నాయి. ఇంజ్యురీల వల్ల ట్రోఫీలను చేజార్చుకుంటోంది టీమిండియా. తాజాగా హార్దిక్ పాండ్యా గాయంతో మళ్లీ ఏం అవుతుందోనని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.
ఐసీసీ టోర్నీల్లో గాయలు భారత్‌కు శాపంగా మారుతున్నాయి. ఇంజ్యురీల వల్ల ట్రోఫీలను చేజార్చుకుంటోంది టీమిండియా. తాజాగా హార్దిక్ పాండ్యా గాయంతో మళ్లీ ఏం అవుతుందోనని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.
వన్డే వరల్డ్ కప్-2023లో ఫస్ట్ ప్లేసులో కొనసాగుతున్న టీమిండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఇంజ్యురీ కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మెగా టోర్నీకి దూరమైనట్లు ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ టైమ్‌లో బాల్‌ను ఆపే క్రమంలో హార్దిక్ పాండ్యా కిందపడ్డాడు. చీలమండ గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్లిపోయాడు. అయితే తొలుత మూడు మ్యాచులకు అతడు దూరమవుతాడని మేనేజ్మెంట్ చెప్పింది. కానీ గాయం తీవ్రత ఎక్కువవడంతో అతడికి రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో వరల్డ్ కప్ నుంచి హార్దిక్‌ను పూర్తిగా తప్పించింది. అతడి ప్లేస్‌లో యంగ్ పేసర్ ప్రసిధ్ కృష్ణను భారత మేనేజ్మెంట్ భర్తీ చేసింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కేవలం మూడు బాల్స్ మాత్రమే వేశాడు హార్దిక్ పాండ్యా. అంతకుముందు ఆడిన మూడు మ్యాచుల్లో మాత్రం ఐదు వికెట్లు తీశాడు. ఆ మ్యాచుల్లో అతడికి ఒకేసారి బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అందులోనూ 11 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు మ్యాచుల్లోనూ విజయాలతో పాయింట్స్ టేబుల్లో (14) ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న రోహిత్ సేనకు పాండ్యా దూరమవ్వడం గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. లీగ్ దశలో ఆడాల్సిన రెండు మ్యాచ్‌లను వదిలేస్తే సెమీఫైనల్, ఫైనల్ లాంటి బిగ్ మ్యాచ్‌లకు హార్దిక్ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా చెప్పొచ్చు.
బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించే హార్దిక్ టీమ్‌లో మంచి బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. మెయిన్ బౌలర్లకు వికెట్లు పడనప్పుడు అతడు వచ్చి బ్రేక్ త్రూ ఇచ్చేవాడు. అలాగే ఆరేడు ఓవర్లు వేసి ప్రధాన బౌలర్లకు కాస్త రెస్ట్ ఇచ్చేవాడు. రన్స్ ఆపడంతో పాటు వికెట్లు తీస్తూ ప్రెజర్ తగ్గించేవాడు. ఫీల్డింగ్‌లో కూడా విలువైన రన్స్ కాపాడటమే గాక బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచులతో ప్రత్యర్థి బ్యాటర్లను వెనక్కి పంపేవాడు. సిచ్యువేషన్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేసే పాండ్యా.. కావాలంటే మెళ్లిగా రన్స్ చేయగలడు, అవసరమైతే ఫోర్లు, సిక్సులతో డామినేట్ చేయగలడు. ఆఖర్లో వచ్చి మ్యాచ్‌లు ముగించే పాండ్యా లాంటి ఫినిషర్ లేకపోవడం రోహిత్ సేనను పెద్ద మ్యాచుల్లో ఇబ్బంది పెట్టక తప్పదు.
హార్దిక్ టీమ్‌లో ఉంటే ఎక్స్ట్రా పేసర్ లేదా స్పిన్నర్‌ను తీసుకునేందుకు టీమ్ మేనేజ్మెంట్కు ఛాన్స్ ఉండేది. పాండ్యా వల్ల ముగ్గురు పేసర్లు లేదా ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ ట్రై చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మకు ఛాన్స్ ఉండేది. పిచ్‌ను బట్టి పేస్‌కు అనుకూలిస్తే అదనపు పేసర్‌ను, స్పిన్‌కు అనుకూలిస్తే ఎక్స్ట్రా స్పిన్నర్‌ను ఆడించేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు అతడు లేకపోవడంతో ఆ బ్యాలెన్స్ తప్పింది. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో వెళ్లాల్సిన పరిస్థితి. ఆల్‌రౌండర్ జడేజా ఉండటంతో ఐదుగురు బౌలర్లు అవుతారు. వీళ్లలో ఎవర్నైనా ప్రత్యర్థి బ్యాటర్లు టార్గెట్ చేసుకుంటే లేదా ఎవరైనా భారీగా రన్స్ ఇస్తే.. కెప్టెన్ రోహిత్‌కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని హిట్‌మ్యాన్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.
ఐసీసీ టోర్నీల్లో భారత టాప్ ప్లేయర్లకు గాయాలవ్వడం, ఇంజ్యురీల వల్ల వాళ్లు దూరమవ్వడం ఇది కొత్తేమీ కాదు. ఒక్క హార్దికే కాదు గతంలోనూ కొందరు ఆటగాళ్లు ఇలాగే గాయాల వల్ల టీమ్‌కు దూరమవ్వడంతో మెయిన్ మ్యాచుల్లో ఓడి టీమిండియా కప్పులు చేజార్చుకుంది. ఒకరకంగా చెప్పాలంటే గాయాలు భారత్‌కు చాలా కప్పులు చేజార్చాయి. ఇంజ్యురీలు మన టీమ్‌కు శాపంగా మారుతున్నాయి. 2020 టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా, జడేజాలు గాయాలతో టోర్నీ నుంచి దూరమయ్యారు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో బుమ్రాతో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు ఇంజ్యురీలతో టోర్నీ నుంచి వైదొలిగారు. ఈ ఎఫెక్ట్ భారత్ ఆడిన మిగిలిన మ్యాచ్‌లపై పడింది. సరైన్ రీప్లేస్మెంట్ లేకపోవడం, బ్యాలెన్స్ తప్పడంతో టీమిండియా ఓడిపోయింది. మరి.. భారత్‌కు గాయాలు శాపాలుగా మారడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘానిస్థాన్! మెగా టోర్నీకి క్వాలిఫై.. మరి ఆ టీమ్ సంగతేంటి?
2022 T20 WC – Bumrah & Jadeja ruled out.
2023 WTC final – Bumrah, Pant & Iyer ruled out.
2023 WC – Pant & Hardik ruled out.
– Injury is hurting India badly in big tournaments. pic.twitter.com/uTarGhtusr
— Johns. (@CricCrazyJohns) November 4, 2023