iDreamPost
android-app
ios-app

టీమిండియా ICC ట్రోఫీలు గెలవకపోవడానికి అదే కారణం: గంభీర్

  • Author singhj Published - 03:48 PM, Wed - 11 October 23
  • Author singhj Published - 03:48 PM, Wed - 11 October 23
టీమిండియా ICC ట్రోఫీలు గెలవకపోవడానికి అదే కారణం: గంభీర్

టీమిండియా ఐసీసీ ట్రోఫీ నెగ్గి చాలా కాలమే అవుతోంది. 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు.. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అనంతరం పలు ఐసీసీ టోర్నీలు జరిగినప్పటికీ భారత్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. ఐసీసీ టోర్నీల్లో మన జట్టు ఛాంపియన్​గా నిలిచి దాదాపు 10 ఏళ్లు కావొస్తోంది. అప్పుడెప్పుడో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అదే టీమిండియా నెగ్గిన చివరి ఐసీసీ ట్రోఫీ. ఆ తర్వాత పలుమార్లు సెమీస్, ఫైనల్స్​ వరకు వెళ్తున్నా ట్రోఫీ మాత్రం కైవసం చేసుకోలేకపోయింది.

ఈసారి వన్డే వరల్డ్ కప్​ స్వదేశంలో జరుగుతుండటంతో టీమిండియాపై ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో లెజెండరీ క్రికెటర్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టు ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి ఒక కారణం ఉందన్నాడు గంభీర్. ప్లేయర్లు సెంచరీల కోసం పాకులాడటం, పర్సనల్ రికార్డుల కోసం ఆడటం వల్లే భారత్ ఐసీసీ ట్రోఫీలు నెగ్గలేకపోతోందని గంభీర్ అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ లెజెండరీ బ్యాటర్.. ఏ ఆటగాడైనా 40 రన్స్ చేసినా లేదా 140 రన్స్ చేసినా.. ఆఖర్లో టీమ్ గెలిచిందా? లేదా? అనేదే ముఖ్యమని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాలోని ప్లేయర్లు తమ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నారని.. అందుకే ఎన్నో ఏళ్లుగా జట్టు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ ఛాంపియన్​గా నిలవలేకపోయిందని గంభీర్ స్పష్టం చేశాడు.

ఏ ఆటగాడైనా సెంచరీ చేశాడా? హాఫ్ సెంచరీ చేశాడా? అనేది తనకు ముఖ్యం కాదన్నాడు గంభీర్. మ్యాచ్​లో ఆఖరి వరకు క్రీజులో నిలబడి టీమ్​ను గెలిపించామా? లేదా? అనేదే తన దృష్టిలో కీలకమన్నాడు గంభీర్. కానీ టీమిండియాలోని ప్రస్తుత ప్లేయర్లలో ఆ ఆలోచన కొద్దిగా తగ్గినట్లు తనకు అనిపిస్తోందన్నాడు. కాగా, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ పలు మార్లు ఐసీసీ టోర్నీల్లో సెమీస్, ఫైనల్స్ వరకు వెళ్లింది. కానీ ట్రోఫీని దక్కించుకోలేకపోయింది. ఈ పదేళ్ల గ్యాప్​లో 2015, 2019 వన్డే వరల్డ్ కప్​లు, నాలుగు టీ20 వరల్డ్ కప్​లు జరిగాయి. మరి.. గంభీర్ చేసిన కామెంట్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇది వాళ్లను అవమానించడమే.. BCCIపై ఫ్యాన్స్ సీరియస్!