iDreamPost

ఇది వాళ్లను అవమానించడమే.. BCCIపై ఫ్యాన్స్ సీరియస్!

  • Author singhj Published - 01:55 PM, Wed - 11 October 23
  • Author singhj Published - 01:55 PM, Wed - 11 October 23
ఇది వాళ్లను అవమానించడమే.. BCCIపై ఫ్యాన్స్ సీరియస్!

భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్ కప్-2023 రసవత్తరంగా సాగుతోంది. భారీ స్కోర్లు, ఛేజింగ్​లతో ప్రేక్షకులకు ఫుల్ మజాను పంచుతోంది. ఇప్పటికే అన్ని జట్లు ఒకట్రెండు మ్యాచ్​లు ఆడేశాయి. ఇంకా మెగా టోర్నీలో చాలా మ్యాచ్​లు మిగిలి ఉన్నాయి. మొదట్లో మ్యాచులకు ఆడియెన్స్ నుంచి ఆదరణ తక్కువగా కనిపించింది. కానీ క్రమంగా మ్యాచులకు భారీగా తరలి వస్తున్నారు ప్రేక్షకులు. మ్యాచ్​లు పోటాపోటీగా సాగుతుండటటంతో చూసేందుకు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ఈ తరుణంలో వరల్డ్ కప్​పై హైప్​ను మరింత పెంచే ఒక మ్యాచ్​కు అంతా సిద్ధమవుతోంది. అదే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.

ఇండియా-పాకిస్థాన్​ల మధ్య సాధారణంగా ఎప్పుడు మ్యాచ్ జరిగినా చూసేందుకు ప్రేక్షకులు తెగ ఉత్సాహం చూపిస్తారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం రూ.వేలు, రూ.లక్షలు ఖర్చు చేసేందుకూ రెడీ అయిపోతారు. అలాంటిది వరల్డ్ కప్​లో ఇరు జట్లు పోటీపడుతున్నాయంటే ఇంకా హంగామా ఏ రేంజ్​లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 15న ఇండో-పాక్ నడుమ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ మ్యాచ్​ కోసం టికెట్లన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి. మ్యాచ్ నాడు స్టేడియం కిక్కిరిసిపోవడం ఖాయం. మిగిలిన ఫ్యాన్స్ అంతా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం పక్కా అనే చెప్పాలి.

ఎంతో హైప్ ఉన్న భారత్-పాక్ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ టైమ్​కు మూవీ సెలబ్రిటీస్​తో స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సెలబ్రిటీల ఆటపాటలతో ఫ్యాన్స్​లో ఫుల్ జోష్ నింపాలని ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు ఎంజాయ్ చేయడం ఖాయం. కానీ బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్, ఇతర టీమ్స్ ఫ్యాన్స్ మాత్రం సీరియస్ అవుతున్నారు. ఇండో-పాక్ మ్యాచ్ నుంచి మరింత డబ్బులు రాబట్టుకోవడానికే ఇలా చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

ప్రపంచ క్రికెట్​లో అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించలేదని.. కానీ ఇండియా-పాక్ మ్యాచ్​కు మాత్రం గ్రాండ్​గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుండటం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. భారత్-పాక్ టీమ్స్​ను ఒకలా చూడటం.. మిగిలిన జట్లను వేరేలా చూడటం ఎంతవరకు కరెక్ట్ అని ఇతర టీమ్స్ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్​కు గనుక స్పెషల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారంటే ఇతర టీమ్స్ కెప్టెన్స్​ను అవమానించడమేనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీపై బీసీసీఐ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి.. బీసీసీఐ స్పెషల్ ప్రోగ్రామ్స్​కు ఏర్పాట్లు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గిల్ ఆరోగ్యంపై అప్​డేట్ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్.. ఆయన ఏమన్నాడంటే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి