iDreamPost

ఈ 3 పథకాలతో లక్షల్లో టాక్స్ ఆదా చేసుకోవచ్చు!

ఆదాయ పన్ను చెల్లించే వారు తమ పన్ను ఆదా చేసుకోవడానికి మూడు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆ పథకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదాయ పన్ను చెల్లించే వారు తమ పన్ను ఆదా చేసుకోవడానికి మూడు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆ పథకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ 3 పథకాలతో లక్షల్లో టాక్స్ ఆదా చేసుకోవచ్చు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే వాటిల్లో పన్నుల విభాగం ఒకటి. దేశంలో టాక్స్ చెల్లించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారు తమ ఆదాయాన్ని పన్ను రహిత మార్గాల్లోకి మళ్లించుకునేందుకు ఎన్నో ప్రణాళికను వేస్తుంటారు. ఈ క్రమంలోనే టాక్స్ ప్లాన్ పైనే ప్రధానంగా దృష్టి సారిస్తుంటారు. అయితే వారు కట్టే పన్నులను ఆదా చేసుకునేందుకు అందుబాటులో ఓ మూడు స్కీమ్స్ ఉన్నాయి. మరి.. ఆ స్కీమ్స్ ద్వారా ఎంత మేర టాక్స్ ను ఆదా చేసుకోవచ్చు, వాటి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నవంబర్ నెల చివరి వారానికి వచ్చాము. ఈ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు.. తమ పన్ను ప్రణాళికలపై దృష్టి సారిస్తున్నారు. టాక్స్ పరిధిలోకి వెళ్లే వారు.. తమ డబ్బును ఆదా చేసుకునేందుకు అనువైన మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వం.. కొన్ని పథకాలను నిర్వహిస్తోంది. ఇన్ కమ్ టాక్స్ యాక్ట్ లో అందించిన పలు సెక్షన్ల కింద కొన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆ విధంగా కేంద్ర టాక్స్ పేయర్స్ కు పన్ను ప్రయోజనాల్ని అందిస్తుంటాయి. అలాంటి మూడు చిన్న సేవింగ్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిల్లో చాలా మంది పెట్టుబడి చేస్తుంటారు. మంచి ఆదరణ కూడా ఉంది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన,ఈపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసి.. టాక్స్ పేయర్స్ ప్రయోజనాల్ని పొందొచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్):

తక్కువ మొత్తంలో పొదుపు చేసుకునే పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఈ పీపీఎఫ్ పన్నురాయితీల కోసం అందుబాటులో ఉన్న మంచి పథకాల్లో ఇది ఒకటి. ఇన్‌కంటాక్స్ యాక్ట్‌లోని సెక్షన్- 80సి కింద రూ. 1.50 లక్షలు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా టాక్స్ మినహాయింపు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీంట్లో కనీసం 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకం కింద వచ్చే పెట్టుబడులకు కింద ప్రస్తుతం 7.10 శాతం వడ్డీ వస్తుంది. రూ.500 నుంచి పెట్టుబడి ప్రారంభించొచ్చు.

సుకన్య సమృద్ధి యోజన:

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం.. బేటీ బచావో.. బేటీ పడావో స్కీమ్ కింద సుకన్య సమృద్ధి స్కీం తీసుకొచ్చింది. దీని కింద ఎవరైనా తమ కుమార్తె పేరిట పెట్టుబడి పెట్టడం ద్వారా సంవత్సరానికి రూ. లక్ష వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ స్కీం కింద డిపాజిటర్ కుమార్తెకు 18 ఏళ్లు నిండాక.. పెట్టుబడి మొత్తంలో సగం, 21 ఏళ్లు నిండాక మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కింద ప్రస్తుతం 8 శాతం వడ్డీ అమల్లో ఉంది.

ఉద్యోగుల భవిష్య నిధి..

ఎవరైనా తమ పన్ను చెల్లింపుల్ని తగ్గించుకోవాలంటే.. దాని కోసం అందుబాటులో ఉన్న పథకాల్లో ఈపీఎఫ్ కూడా ఒకటి. ఉద్యోగుల జీతంలో 12 శాతం ప్రతి నెలా యాజమాన్యం వారి పీఎఫ్ అకౌంట్లలో జమ చేయాల్సి ఉంటుంది. ఆ సంస్థ కూడా అంతే మొత్తం యాడ్ చేయాలి. ఈ స్కీం కింద కూడా ఏడాదికి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. దీని కింద ప్రస్తుతం 8.10 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి