iDreamPost
android-app
ios-app

కుప్పకూలుతున్న గోల్డ్ రేట్లు.. ఇంకా తగ్గుతాయా? నిపుణులు మాటేంటి?

  • Published Jun 08, 2024 | 10:32 PM Updated Updated Jun 08, 2024 | 10:32 PM

Gold Rates: ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అయితే ఈ గోల్డ్ రేట్లు ఇంకా తగ్గుతాయా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

Gold Rates: ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అయితే ఈ గోల్డ్ రేట్లు ఇంకా తగ్గుతాయా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

  • Published Jun 08, 2024 | 10:32 PMUpdated Jun 08, 2024 | 10:32 PM
కుప్పకూలుతున్న గోల్డ్ రేట్లు.. ఇంకా తగ్గుతాయా? నిపుణులు మాటేంటి?

మన దేశంలో బంగారానికికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంగారం పెరిగినా, తగ్గినా కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. మనదేశంలో పసిడి ప్రియులు ఎక్కువే. అయితే గత కొంతకాలంగా గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు చోటు చేసుకోవడంతో గోల్డ్ రేట్లలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ద్రవ్యోల్బణం సహా పలు ఇతర గణాంకాలు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటివి బంగారం ధరల మీద కీలక ప్రభావం చూపిస్తాయి. ఇక ఇటీవల కాలంలో ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రకటనతో గోల్డ్ రేట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా వడ్డీ రేట్లపై సమీక్ష జరిపిన టైంలో.. ఈ ఏడాదిలో మూడు సార్లు అయినా వడ్డీ రేట్లు తగ్గిస్తుందని సంకేతాలు ఇచ్చింది.

దీంతో గోల్డ్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు తగ్గడంతో.. ఇప్పుడు బంగారం రేట్లు పడిపోయాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుండగా మరోసారి గోల్డ్ రేట్లు పెరిగాయి. ఇక ప్రస్తుతం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. సాధారణంగా ఫెడ్ .. వడ్డీ రేట్లు పెంచితే డాలర్, బాండ్ ఈల్డ్స్ వాల్యూ పెరిగి గోల్డ్ రేటు తగ్గుతుంటుంది. అదే వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్ ధర పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగానే గోల్డ్ రేటు పెరిగింది. ఇప్పుడు యూఎస్ నాన్ ఫామ్ పేరోల్ రిపోర్ట్ సానుకూలంగా ఉన్న కారణంగా గోల్డ్ రేటు ఒక్కసారిగా పడిపోయింది. శుక్రవారం నాడు గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు 3.49 శాతం పడిపోయి 2294 డాలర్లకు చేరుకుంది. వారం రోజులుగా గమనిస్తే దాదాపు 1.40 శాతం పడిపోయింది.

అయితే ఇప్పుడు యూఎస్ పేరోల్ డేటా స్ట్రాంగ్ గా ఉండడంతో.. డాలర్ ఒక్కసారిగా పుంజుకుంది. శుక్రవారం 0.70 శాతం పెరిగి 104.93 వద్ద డాలర్ రేటు స్థిరంగా ఉంది. ఈ కారణంగా గోల్డ్ రేటు తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా 4.271 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి, మార్చిలో చైనా వరుసగా భారీగా గోల్డ్ కొనుగోలు చేయడంతో ఏప్రిల్ నెలలో తగ్గింది. ఇప్పుడు గోల్డ్ కొనుగోళ్లు ఆపడంతో గోల్డ్ రేటు దిగొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. చైనా గోల్డ్ కొనుగోలు ఆపడం.. బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడం, డాలర్ రేటు పెరుగుతుండడం వల్ల స్వల్ప వ్యవధిలోనే గోల్డ్ రేటు పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్.. తర్వాతి సమీక్షలో తీసుకునే నిర్ణయం మీద కూడా గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు.