iDreamPost
android-app
ios-app

దేవర కత్తి పదునుకు వణికిన బాక్సాఫీస్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్నికోట్లంటే?

  • Published Sep 28, 2024 | 8:45 AM Updated Updated Sep 28, 2024 | 12:41 PM

Devara day 1 collections: దేవర మూవీ బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తున్నది. రికార్డ్ కలెక్షన్స్ తో దడదడలాడిస్తున్నది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో పెను సంచలనం సృష్టించింది. మొత్తం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Devara day 1 collections: దేవర మూవీ బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తున్నది. రికార్డ్ కలెక్షన్స్ తో దడదడలాడిస్తున్నది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో పెను సంచలనం సృష్టించింది. మొత్తం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

  • Published Sep 28, 2024 | 8:45 AMUpdated Sep 28, 2024 | 12:41 PM
దేవర కత్తి పదునుకు వణికిన బాక్సాఫీస్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్నికోట్లంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ సోలోగా వచ్చిన మూవీకావడంతో దేవరపై అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. దీనికి తగ్గట్టుగానే దేవర రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించింది. దేవర ట్రైలర్స్, ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యూరియస్ లుక్ లో తారక్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

హై వోల్టేజ్ మాస్ యాక్షన్స్ తో రూపుదిద్దుకున్న దేవరకి బోలెడంత హైప్ వచ్చింది. థియేటర్లలో దేవర మాస్ జాతర ఖాయమని సినీ వర్గాలు భావించినట్లుగానే ఊచకోత మొదలైంది. ఈ సినిమాలో తారక్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్ హైలెట్ అయ్యాయి. దేవర కత్తి పదునుకు బాక్సాఫీస్ వణికిపోయింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ తో బాక్సాఫీస్ షేక్ అయ్యింది. దేవర మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

దేవర ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించింది. దేవర రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలయ్యాక దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా దేవర డే1 కలెక్షన్స్ ను అఫీషియల్ గా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి రూ. 48 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియా వైడ్‌గా మరో రూ. 10 కోట్లు లభించాయి. ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు వరకూ షేర్ వచ్చింది. మొత్తంగా దేవర వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లకు పైగా వసూల్ చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మొత్తానికి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. రెండో రోజు మరింత ఎక్కువగా వసూళ్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవరపై టాక్ మారుతుండడంతో వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు భావిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet