iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే మంచి ఫోన్ కావాలా? Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భారీ ఆఫర్లు!

  • Published Sep 27, 2024 | 9:10 AM Updated Updated Sep 27, 2024 | 9:58 AM

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఫోన్ లపై ఆఫర్లు మాములుగా లేవనే చెప్పాలి. ఈ సేల్ సెప్టెంబర్ 27న వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఫోన్ లపై ఆఫర్లు మాములుగా లేవనే చెప్పాలి. ఈ సేల్ సెప్టెంబర్ 27న వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

తక్కువ ధరకే మంచి ఫోన్ కావాలా? Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భారీ ఆఫర్లు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో స్మార్ట్ ఫోన్ లపై ఆఫర్లు మాములుగా లేవనే చెప్పాలి. ఈ సేల్ సెప్టెంబర్ 27న వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.. అయితే ఫ్లిప్ కార్ట్ ప్లస్ కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లు ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చాయి. రూ. 20 వేల కంటే తక్కువ ధరకు ఫోన్ కొనాలనుకునేవారికి ఇంతకన్నా మంచి ఆఫర్లు మళ్ళీ రావు. ఈ సేల్ లో అతి తక్కువ ధరకే లభించే ఫోన్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ ని ఈ సేల్‌లో వినియోగదారులు అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్చేంజి ఆఫర్లు ఇంకా ఇతర డిస్కౌంట్‌లతో కేవలం రూ. 18000 ధరతో కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ 2a స్టైలిష్, పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది స్పీడ్ గా స్మూత్ గా ఉండే పెర్ఫార్మన్స్ ని అందిస్తుంది. ఇక ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది 50MP+50MP డ్యూయల్ కెమెరా సెటప్, 32 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 8 జీబి ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ తక్కువ ధరకే వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM వేరియంట్‌ను వినియోగదారులు అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి కేవలం రూ.19000 కి కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్, ఇది సూపర్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో కలిగి ఉంటుంది. ఇది 6.7-ఇంచెస్ ఫుల్ HD+ P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో రానుంది. ఇది చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇది 50MP+ 13MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ 32 MP కెమెరా కలిగి ఉంటుంది. ఇంకా 5000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ వస్తుంది.ఇది 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.