iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. CM రేవంత్ కీలక ప్రకటన!

  • Published Sep 28, 2024 | 1:25 PM Updated Updated Sep 28, 2024 | 1:25 PM

Good News for Students: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తాజాగా విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు.

Good News for Students: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తాజాగా విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు.

విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. CM రేవంత్ కీలక ప్రకటన!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేశారు. ఇటీవల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. మహిళలకు వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. తాజాగా సీఎం రేవంత్ సర్కార్ సరొకొత్త నిర్ణయం తీసుకున్నారు.ఈ సారి విద్యార్థులకు కోసం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని రేవంత్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను విద్యార్థులకు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ‘తెలంగాణ దర్శిని’ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువస్తున్నట్లు వివరించారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి విద్యార్థులకు ఒక రోజు ట్రిప్పులుగా పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళ్తారు. వీరికి హెరిటేజ్ సైట్లు, పార్కులు, మాన్యుమెంట్లు చూపించడం ద్వారా చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరిస్తారు. 5 నుంచి 8 వ తరగతి విద్యార్థుల కోసం 20-30 కిలో మీటర్ల పరిధిలో డే ట్రిప్స్ ఉంటాయి. ఈ ట్రిప్స్ లో తెలంగాణలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించి.. అక్కడ విశిష్టతలను విద్యార్థులు తెలుసుకునేలా చేస్తారు.

ఇక 9 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు రోజుల పాటు 50-70 కిలో మీటర్ల పరిధితో లాంగ్ ట్రిప్స్ నిర్వహిస్తారు. ఇందులో స్థానిక చరిత్ర, సంస్కృతి, శిల్ప సంపదను తెలుసుకునేలా అవకాశం కల్పిస్తారు. యూనివర్సిటీ విద్యార్థులకు నాలుగు రోజుల పాటు, వారి సొంత జిల్లాలు దాటి సుదూర ప్రాంతాలకు టూర్లకు వెళ్లే ఏర్పాటు చేస్తారు అధికారులు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల సందర్శించడం ద్వారా విద్యార్థులకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందని, కేవలం పుస్తకాల్లో పాఠాలకే పరిమితం కాకుండా, అనుభవజ్ఞానం లభిస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్దిపై టీ సర్కార్ చర్యలు చేపట్టింది.  ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణ ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పురాతన కట్టడాలు కాపాడటమే లక్ష్యంగా సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.

gamdommarsbahis girişMarsbahisjojobetjojobet giriş