iDreamPost
android-app
ios-app

అదంతా వారి కుట్రే.. జానీ నాతో ఇదే చెప్పాడు – భార్య అయేషా

  • Published Sep 28, 2024 | 10:24 AM Updated Updated Sep 28, 2024 | 12:46 PM

Jani Wife Ayesha: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు గత మూడు రోజులుగా పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జానీ భార్య అయేషా తన భర్తను కలిసేందుకు పోలీసులు ఫర్మిషన్ ఇవ్వడంతో.. ఆమె ఇంటి నుంచి జానీ మాస్టర్ కు భోజనం తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయేషా జైల్లో తన భర్త ఇదే నాతో చెప్పాడంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jani Wife Ayesha: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు గత మూడు రోజులుగా పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జానీ భార్య అయేషా తన భర్తను కలిసేందుకు పోలీసులు ఫర్మిషన్ ఇవ్వడంతో.. ఆమె ఇంటి నుంచి జానీ మాస్టర్ కు భోజనం తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయేషా జైల్లో తన భర్త ఇదే నాతో చెప్పాడంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published Sep 28, 2024 | 10:24 AMUpdated Sep 28, 2024 | 12:46 PM
అదంతా వారి కుట్రే.. జానీ నాతో ఇదే చెప్పాడు – భార్య అయేషా

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో గత మూడు రోజులుగా జానీ మాస్టర్ కు పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగుతుంది. కాగా, బాధితురాలు స్టేట్‌మెంట్‌ను ముందు ఉంచి జానీని నార్సింగి పోలీసులు విచారణ కొనసాగించారు. ఇక పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ పలు సంచలన విషయాలు బయట పెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు జానీ భార్య అయేషా తన భర్తను కలిసేందుకు నార్సింగ్ పోలీసులు ఫర్మిషన్ ఇవ్వడంతో.. ఆమె ఇంటి నుంచి జానీ మాస్టర్ కు భోజనం తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయేషా జైల్లో తన భర్త ఇదే నాతో చెప్పాడంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

జానీ మాస్టర్ కేసులో మూడవ రోజు విచారణ భాగంగా అతని భార్య అయేషా ఆయనను కలిసేందుకు నార్సింగ్ పోలీసు స్టేషన్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తన భర్త కోసం ఇంటి నుంచి భోజనం  తీసుకెళ్లారు. అనంతరం పోలీసు స్టేషన్ బయట ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అయేషాకు జైల్లో తన భర్త జానీ ఏ విషయం కోసం మాట్లాడారు, అసలు ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఆ ప్రశ్నలకు స్పందించిన అయేషా మాట్లాడుతూ.. ‘జైల్లో జానీ ప్రస్తుతానికి బాగనే ఉన్నారు, కాకపోతే జైలు భోజనం కాబట్టి కాస్త ఇబ్బంది పడ్డారు. అందుకే ఇంటి నుంచి చికెన్, బిర్యానీ, రైస్ పట్టికెళ్లి భోజనం పెట్టాను. ఇక ఆయన నాతో ఫ్యామిలీ విషయాలను మాత్రమే మాట్లాడారు.  ముఖ్యంగా పిల్లలను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పారు. అసలు జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు, బయట మాత్రం ఆయన తప్పు చేశారని మీడియాల్లో రాస్తున్నారు. నా భర్త తప్పు చేయనది ఎందుకు ఒప్పుకోవాలి? కానీ తనపై కావలనే ఈ కుట్ర చేస్తున్నరనైతే జానీ నాతో చెప్పారు.

ఇదంతా ఆమె ఏమి ఆశిస్తుందో తెలియడం లేదు. కానీ, నిజ, నిజాలు న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం. ఎన్నో సంవత్సరాలుగా శిష్యురాలిగా ఉన్న అమ్మాయి లైంగిక ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారా ? తనకు మాస్టర్ లైఫ్ ఇచ్చారని చెప్పిన అమ్మాయి .. ఇప్పుడు వేధించాడని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. కేవలం చెప్పుడు మాటలు విని ఆ అమ్మాయి ఇలా చేసి ఉండవచ్చని అనిపిస్తుంది. దీని వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నరనే, లేక ఆ అమ్మాయి ఏమి ఆశిస్తుంచి ఇదంతా చేస్తుందో అర్ధం కావడం లేదు. కానీ, ఒక్కటి మాత్రం నిజం జానీ మాస్టర్ పేరు ప్రతిష్ఠలను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారు.  త్వరలోనే మాకు ఇండస్ట్రీలో కూడా నెమ్మదిగా మాకు అందరూ మద్దతూగా వస్తారంటూ’ అయేషా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ కు  విచారణ కస్టడీ నేటితో ముగియనుంది. అనంతరం ఈరోజు ఉదయం జానీ మాస్టర్ ను పోలీసులుకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరి, జానీ మాస్టర్ భార్య చెప్పిన సంచలన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş