iDreamPost
android-app
ios-app

ప్రభాస్ మరో రామాయణం చేస్తున్నాడా ! ఎంత వరకు నిజం?

  • Published Sep 28, 2024 | 11:29 AM Updated Updated Sep 28, 2024 | 11:29 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో రామాయణం తీస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రభాస్ దర్శకుడు ఓమ్ రౌత్ తో ఆదిపురుష్ మూవీ తీశాడు ప్రభాస్. మరి ఇప్పుడు వినిపిస్తున్న వార్తల వెనుక కారణం ఏంటి? అదేంటో చూసేద్దాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో రామాయణం తీస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రభాస్ దర్శకుడు ఓమ్ రౌత్ తో ఆదిపురుష్ మూవీ తీశాడు ప్రభాస్. మరి ఇప్పుడు వినిపిస్తున్న వార్తల వెనుక కారణం ఏంటి? అదేంటో చూసేద్దాం.

  • Published Sep 28, 2024 | 11:29 AMUpdated Sep 28, 2024 | 11:29 AM
ప్రభాస్ మరో రామాయణం చేస్తున్నాడా ! ఎంత వరకు నిజం?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో తెలియనిది కాదు. వరుస ప్రాజెక్ట్స్ తో తానూ పరుగులు పెట్టడమే కాకుండా దర్శకులను సైతం పరుగులు పెట్టిస్తున్నాడు. కనీసం ఏడాదికి ఓ సినిమా అయినా రిలీజ్ చేసేలా ఉన్నాడు డార్లింగ్. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ రాబోయే సినిమాల మీద భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతానికైతే రాబోయే సినిమాల గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లేవు. కానీ ఇప్పుడు ప్రభాస్ విషయంలో మాత్రం మరో కొత్త బజ్ వినిపిస్తుంది. ప్రభాస్ మరో రామాయణం తీస్తున్నాడంటూ ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్ నడుస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ ఓ రామాయణం తీసి ప్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు మరో రామాయణం ఏంటి? ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల వెనుక కారణం ఏంటి ? అదేంటో చూసేద్దాం

గతంలో ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ తో కలిసి ఆదిపురుష్ సినిమా తీశాడు. ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుని.. థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులు.. చాలా నిరాశ చెందారు. ఏకంగా రామాయణం కథనే పూర్తిగా మార్చేసి.. ఇష్టానుసారం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని.. ఆదిపురుష్ చేశారని విమర్శలు వచ్చాయి. ఇక దర్శకుడు ఓం రౌత్ మీద వచ్చిన ట్రోలింగ్స్ సంగతి తెలియనిది కాదు. ఏదైనా మంచి విఎఫ్ఎక్స్ తో సినిమాలు వస్తున్నాయంటే.. వాటిని చూసి ఇప్పటికీ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న ప్రభాస్ మరో రామాయణం విషయానికొస్తే, బాలీవుడ్ లో ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో.. రణ్బీర్ కపూర్ , సాయి పల్లవి కాంబినేషన్ లో రామాయణం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ రామాయణం కోసం బాలీవుడ్ మేకర్స్ ప్రభాస్ ను అప్రోచ్ అయ్యారట. రామాయణంలో పరశురాముడి పాత్రకు ప్రభాస్ కట్ అవుట్ సరిగ్గా సరిపోతుందని భావించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బీ టౌన్ నుంచి బజ్ వినిపిస్తుంది.

అయితే ప్రభాస్ ఇందుకు ఒకే చెప్పాడా లేదా అనే విషయం అయితే ఇంకా తెలియదు. ఒకవేళ ప్రభాస్ కనుక ఒకే చెప్తే కచ్చితంగా ఈ మూవీ రేంజ్ మరో లెవెల్ కు చేరుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ మూవీలో పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఉన్నారు. వారికి తోడు ఈ పాన్ ఇండియా స్టార్ కూడా యాడ్ అయితే .. నెక్స్ట్ లెవెల్ హైప్ కొనసాగడం ఖాయం. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. హను రాఘవపూడి తో ఫౌజీ.. మారుతితో ది రాజా సాబ్.. ఇక ఈ రెండు కాకుండా సలార్ పార్ట్-2 , కల్కి పార్ట్-2… అలాగే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. మరి ఈ మూవీస్ అన్నీ ఎప్పటికి రిలీజ్ అవుతాయో.. ఫ్యాన్స్ ను ఏ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibom