iDreamPost
android-app
ios-app

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు.. ఆదేశించిన బెంగళూరు కోర్టు

రాజకీయ ఉద్దండులు, వాణిజ్య వేత్తలు, బిజినెస్ మ్యాన్స్, ట్యాక్స్ పేయర్స్, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపారులే కాదు.. సామాన్యులు కూడా ఆసక్తిగా బడ్జెట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో ప్రస్తావనకు వచ్చే పేరు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో ఆమె చీరలు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే ఆమెకు బిగ్ షాక్ ఇచ్చింది కోర్టు.

రాజకీయ ఉద్దండులు, వాణిజ్య వేత్తలు, బిజినెస్ మ్యాన్స్, ట్యాక్స్ పేయర్స్, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపారులే కాదు.. సామాన్యులు కూడా ఆసక్తిగా బడ్జెట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో ప్రస్తావనకు వచ్చే పేరు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో ఆమె చీరలు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే ఆమెకు బిగ్ షాక్ ఇచ్చింది కోర్టు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు.. ఆదేశించిన బెంగళూరు కోర్టు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురించి తెలియని వారుండరేమో బహుశా. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా ఆమె పేరు ప్రస్తావనకు వస్తుంది. ఇప్పటి వరకు ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశ పట్టిన ఏకైక మంత్రిగా ఆమె రికార్డులు సృష్టించారు. అలాగే బడ్జెట్ సమయంలో ఆమె ధరించే చీరలు కూడా ట్రెండీగా నిలవడంతో పాటు చర్చకు దారి తీస్తుంటాయి. 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్‌ను నియమించారు. ఇప్పుడు మోడీ 3.0 ప్రభుత్వంలో కూడా ఆమె ఇదే బాధ్యతలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు నిర్మలా. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆమె దోపిడీకి పాల్పడ్డారన్న ఫిర్యాదుపై ఇలా స్పందించింది.

ప్రస్తుతం రద్దైన ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా నిర్మలా సీతారామన్ దోపిడీ రాకెట్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ జనాధికార సంఘర్ష సంఘటనే (జేఏస్పీ)కి చెందిన ఆదర్శ్ అయ్యర్ బెంగళూరులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదులో ఏముందంటే… ఈ రాకెట్‌లో నిర్మలా మాత్రమే కాకుండా బీజెపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజెపీ నేతలు నలీన్ కుమార్ కటీల్, బీవై విజయేంద్ర హస్తం కూడా ఉంది. కార్పొరేట్ సంస్థలను ఎన్‌ఫోర్స్ మెంట్ రైడ్స్ పేరుతో బయపెట్టి.. వేల కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల పేరిట వసూలు చేసుకున్నారు. ఈ బాండ్లను జాతీయ, రాష్ట్ర స్థాయిలోని బీజెపీ నేతలు నగదుగా మార్చుకున్నారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే పథకం రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమ నిధులు కూడగట్టడాన్ని సులభతరం చేసిందని, ఇందులో నిర్మలాతో పాటు ఇతర సీనియర్ బిజెపీ నాయకులు రోల్ ఉందంటూ తొలుత పోలీసులకు కంప్లయింట్ చేశాడు. నిర్మలా సీతారామన్‌పై కేసు పెట్టేందుకు తిలక్‌నగర పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో చట్టసభ ప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయ స్థానం వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.  జడ్జి సంతోశ్‌ గజానన హెగ్డే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ముఖ్య నేతలపై కేసు ఫైల్ చేశారు. ఈ ఆరోపణలు కొట్టివేసిన బీజెపీ నిర్మలా సీతారామన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, ఎలక్టోరల్ బాండ్ల జారీ విధానపరమైన అంశమని, తమ నేతలు ఎటువంటి నేరానికి పాల్పడలేదంటూ చెప్పుకొచ్చింది. 2018లో మోడీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ఆయా పార్టీలకు విరాళాలు వస్తుంటాయి. నగదు రూపంలో కూడా బాండ్ల రూపంలో విరాళాలు ఉంటే.. పారదర్శకత ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని తీసుకు వచ్చింది.  అయితే, ఫిబ్రవరిలో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఈ పథకాన్ని “రాజ్యాంగ విరుద్ధం” అని పేర్కొంటూ..  రాజకీయ నిధులకు సంబంధించి పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని తెలుపుతూ.. వీటిని రద్దు చేసింది.