iDreamPost
android-app
ios-app

మూడో రోజు విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన జానీ మాస్టర్‌!

  • Published Sep 28, 2024 | 11:15 AM Updated Updated Sep 28, 2024 | 11:15 AM

Jani Master: అత్యాాచార కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు పోలీసులు మూడవ రోజు విచారణ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో జానీ మాస్టర్ సంచలన నిజాలు బయటపెట్టాడు. ముఖ్యంగా బాధితురాలే తనను అలా వేధించిందని జానీ మాస్టర్ పేర్కొన్నట్లు సమాచారం.

Jani Master: అత్యాాచార కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు పోలీసులు మూడవ రోజు విచారణ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో జానీ మాస్టర్ సంచలన నిజాలు బయటపెట్టాడు. ముఖ్యంగా బాధితురాలే తనను అలా వేధించిందని జానీ మాస్టర్ పేర్కొన్నట్లు సమాచారం.

  • Published Sep 28, 2024 | 11:15 AMUpdated Sep 28, 2024 | 11:15 AM
మూడో రోజు విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన జానీ మాస్టర్‌!

మహిళ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో జానీ మాస్టర్ కు కస్టడీలో ఇవ్వాలని పోలీసులు ఇటీవలే కోర్టును ఆవ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. జానీ మాస్టర్ కు గత మూడు రోజులుగా పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగుతుంది. కాగా, మూడవ రోజు విచారణ భాగంగా.. జానీ మాస్టర్ కు లాయర్ సమక్షంలో పోలీసులు బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ముందు ఉంచి విచారించారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణలో జానీ మాస్టర్ పలు సంచలన నిజాలు బయటపెట్టాడు. ముఖ్యంగా బాధితురాలే తనను అలా వేధించిందని జానీ మాస్టర్ పేర్కొన్నట్లు సమాచారం. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అత్యాాచార కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు పోలీసులు మూడవ రోజు విచారణ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో జానీ మాస్టర్ సంచలన నిజాలు బయటపెట్టాడు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘నేను ఏ తప్పు చేయలేదు. నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. ఇకపోతే ఢీ షో ద్వారా తనకు తానే నాతో పరిచయం పెంచుకుంది. అలాగే మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. కేవలం తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను.

కానీ, ఆమె మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలని మానసికంగా హింసించింది, బలవంతం పెట్టింది. ఎన్నోసార్లు బాధితురాలు నా పై బెదిరింపులకు దిగింది. ఇక ఆ వేధింపులు ఎక్కువైపోవడంతో నేను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాను. సుకుమార్ నన్ను పిలిచి మాట్లాడిన కూడా బాధితురాలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాపై కావలనే పెద్ద కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో నన్ను ఇరికించారు’ అంటూ జానీ మాస్ట్ర విచారణలో పోలీసులకు తెలియజేశాడు.

మరోవైపు జానీ భార్య అయేష తన భర్తను కలుసుకునేందుకు  నార్సింగి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్ కు వచ్చిన అయేషా తన భర్తకు ఇంటి భోజనం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ కు నేటితో పోలీసు కస్టడీ ముగియనుంది. కాగా, నేడు పోలీసులు జానీ మాస్టర్ ను రంగారెడ్డి కోర్టుకు ప్రవేశపెట్టనున్నారు. మరి, కస్టడీలో జానీ మాస్టర్ బయటపెట్టిన సంచలన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş