iDreamPost
android-app
ios-app

డే 1 హయ్యెస్ట్ కలెక్షన్ మూవీస్ లిస్ట్! దేవర ఎన్నో ప్లేస్ లో ఉందంటే?

  • Published Sep 28, 2024 | 1:07 PM Updated Updated Sep 28, 2024 | 1:37 PM

Devara Movie Collections Update: దేవర మూవీ థియేటర్స్ లో అల్లాడిస్తుంది. చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపిస్తున్నాడు తారక్. ఇప్పుడు తారక్ అభిమానులంతా కాలర్ ఎగరేసుకునేలా చేస్తున్నాడు. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో దేవర టాప్ లో నిలిచింది. ఆ వివరాలు చూసేద్దాం.

Devara Movie Collections Update: దేవర మూవీ థియేటర్స్ లో అల్లాడిస్తుంది. చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపిస్తున్నాడు తారక్. ఇప్పుడు తారక్ అభిమానులంతా కాలర్ ఎగరేసుకునేలా చేస్తున్నాడు. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో దేవర టాప్ లో నిలిచింది. ఆ వివరాలు చూసేద్దాం.

  • Published Sep 28, 2024 | 1:07 PMUpdated Sep 28, 2024 | 1:37 PM
డే 1 హయ్యెస్ట్ కలెక్షన్ మూవీస్ లిస్ట్! దేవర ఎన్నో ప్లేస్ లో ఉందంటే?

బాస్ మూవీనా మజాకానా.. ఏంటయ్యా ఆ డెడికేషన్.. ఏంటయ్యా ఆ కమిట్మెంట్.. రాజమౌళి సెంటిమెంట్ కు కూడా ఒక్క దెబ్బతో చెక్ పెట్టేశావ్. దేవర సినిమాను ఎన్ని సార్లు చూసినా తక్కువే.. 1000 కోట్లు పక్కా.. దేవర చితక్కొట్టేశాడు . ఇవన్నీ దేవర మూవీ చూసి అభిమానులు కాలర్ ఎగేరేసుకుంటూ చెప్తున్నా మాటలు. నిజమే కదా మరీ.. నా అభిమానులందరినీ కాలర్ ఎగేరేసుకునేలా చేస్తాను అని మాట ఇచ్చాడు తారక్. ఇప్పుడు దేవర తర్వాత జరుగుతున్నది అదే. రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అనుకుంటే.. ఇప్పుడు రిలీజ్ తర్వాత వస్తున్న దేవర టాక్ సెకండ్ హాఫ్. ఇక థియేట్రికల్ ఎండ్ లోపు… కలెక్షన్స్ లో కుంభస్థలాన్నీ బద్దలు కొడతాడా లేదా అనేది.. మూవీలో సస్పెన్స్ ఎలిమెంట్ లా ఉండబోతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ లిస్ట్ లో దేవర ఏ స్థానంలో ఉందో చూసేద్దాం.

ఇప్పటివరకు టాలీవుడ్ లో ఓపెనింగ్ డే రోజున హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ.. రాజమౌళి-తారక్-చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.223 కోట్లను దక్కించుకుని టాప్ 1 లో నిలిచింది. ప్రస్తుతానికి ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే మూవీ రాలేదు. ఇక టాప్-2 లో రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి పార్ట్-2.. ఫస్ట్ డే రూ.214.5 కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి మూవీ రూ.182.6 కోట్లను కొల్లగొట్టి టాప్-3 స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సలార్ మూవీ రూ. 165.3 కోట్లతో టాప్-4 లో ఉంది. ఇలా లిస్ట్ లో టాప్-5 లో యష్ నటించిన కెజిఎఫ్ చాప్టర్-2 రూ. 162.9 కోట్లను నమోదు చేసుకుంది. ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన లియో మూవీ మొదటి రోజు రూ142.8 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుని టాప్-6 లో నిలిచింది. ఇక టాప్-7 లో రూ.136.8 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ తో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ఉంది. ఇక ఇప్పుడు ఈ టాప్-7 లిస్ట్ దేవర కూడా చేరిపోయింది. ఇప్పటివరకు టాప్-4 లో నిలిచిన ప్రభాస్ సలార్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.172 కోట్లు కొల్లగొట్టి టాప్-4 లో నిలించింది దేవర.

ఇక ఇప్పటిలో ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు రిలీజ్ కు లేవు . అందులోను దసరా హాలిడేస్ దగ్గరలోనే ఉన్నాయి. సో ఈ మూవీ కచ్చితంగా థియేటర్స్ లో లాంగ్ రన్ మెయింటైన్ చేస్తుందని నమ్మకంగా చెప్పేయొచ్చు. ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత కొరటాల శివ హిట్ కొడతాడా లేదా.. అని డౌట్ పడిన వాళ్ళందరూ నోటి మీద వేలు వేసుకుంటున్నారు. ఇదిరా దేవర దెబ్బంటే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మరోసారి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రూవ్ అయింది. తారక్ డై హార్డ్ ఫ్యాన్స్ మొదలు ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరిని దేవర మెప్పించింది. దేవర ముందు అంతా బలాదూర్ అనిపించుకునేలా చేస్తుంది. ప్రస్తుతం థియేటర్స్ అన్ని దేవర రీసౌండ్ తో మోత మోగిపోతున్నాయి. ఇక లాంగ్ రన్ లో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడడమే బ్యాలన్స్ . మరి దేవర వరల్డ్ వైడ్ హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ లిస్ట్ లో టాప్ 4 స్థానాన్ని దక్కించుకోవడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş