iDreamPost
android-app
ios-app

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ పై సూపర్ డిస్కౌంట్.. త్వరపడండి!

  • Published Sep 26, 2024 | 9:18 PM Updated Updated Sep 26, 2024 | 9:30 PM

Apple iPhone15 Pro Max: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ అయింది. ఈ సేల్ లో 15 ప్రో మ్యాక్స్ ధరని రూ. 1,34,900కి ప్రకటించగా, ఇప్పుడు రూ. 1 లక్ష కన్నా తక్కువ ధరకే ఈ సేల్ లో మనం సొంతం చేసుకోవచ్చు. అదెలాగో పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

Apple iPhone15 Pro Max: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ అయింది. ఈ సేల్ లో 15 ప్రో మ్యాక్స్ ధరని రూ. 1,34,900కి ప్రకటించగా, ఇప్పుడు రూ. 1 లక్ష కన్నా తక్కువ ధరకే ఈ సేల్ లో మనం సొంతం చేసుకోవచ్చు. అదెలాగో పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ పై సూపర్ డిస్కౌంట్.. త్వరపడండి!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ అయింది. ఈ సేల్ లో భాగంగా ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది ఫ్లిప్కార్ట్. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధరని రూ. 1,34,900కి ప్రకటించగా, ఇప్పుడు రూ. 1 లక్ష కన్నా తక్కువ ధరకే ఈ సేల్ లో మనం సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 1,34,900 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ పై ఏకంగా రూ. 35,050 వేల దాకా భారీ ఎక్స్చేంజి తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ ని రూ.99,850 ధరకే పొందవచ్చు.

ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డీల్ ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. ఎప్పుడైనా ఈ ఆఫర్ ని తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని త్వరగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుని పొందవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది ఫింగర్ ఫ్రింట్ స్మడ్జ్‌లను తగ్గించే బ్రష్డ్ ఎఫెక్ట్‌ తో టైటానియం ఛాసిస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ వో ఎల్ ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ 256 జీబి ఇంటర్నల్ స్టోరేజిని కలిగి ఉంది.

35 thousand discount on iPhone 15 pro max

ఇది iOS 17 సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది. అలాగే ఎ17 ప్రో చిప్ ద్వారా రన్ అవుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్ రంగంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని ఆపిల్ కంపెనీ తెలిపింది. ఇందులో జీపీయూతో సూపర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ ఫోన్ 48ఎంపీ + 12 ఎంపీ + 12 ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్ కలిగి ఉంది. 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది. ఇక ఈ ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.