iDreamPost

వీడియో: నా భర్తనే కొడతారా? వైన్ షాప్ సిబ్బందిపై ప్రతీకారం తీర్చుకున్న భార్య!

పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తారు భార్యామణులు. అలాంటి దైవం మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకుంటారా? తాట తీస్తారు. తాజాగా తన భర్తపై వైన్ షాప్ సిబ్బంది దాడి చేశారని ఆ వ్యక్తి భార్య ప్రతీకారం తీర్చుకుంది.

పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తారు భార్యామణులు. అలాంటి దైవం మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకుంటారా? తాట తీస్తారు. తాజాగా తన భర్తపై వైన్ షాప్ సిబ్బంది దాడి చేశారని ఆ వ్యక్తి భార్య ప్రతీకారం తీర్చుకుంది.

వీడియో: నా భర్తనే కొడతారా? వైన్ షాప్ సిబ్బందిపై ప్రతీకారం తీర్చుకున్న భార్య!

సాధారణంగా భార్య మీద ఎవరైనా చేయి చేసుకుంటే ఏ భర్త అయినా సహించలేడు. భార్య మీదనే కాదు.. ఇంట్లో ఇంకెవరి మీదనైనా సరే ఎవరైనా చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకోడు. అలాంటి భర్తని ఎవరైనా కొడితే.. మరి అతని కోసం ఎవరు నిలబడేది అంటే భార్యనే. భర్తని ఎవరైనా ఏమైనా అంటే సర్రున తాచుపాములా లేచే భార్యలు చాలా మంది ఉంటారు. ఇంట్లో అత్తమామలు, అమ్మానాన్నలే భర్తను ఏమైనా అంటే ఏమీ అనకండి అని అడ్డు చెప్పే భార్యలు ఉన్నారు. అలాంటిది ఎవడో బయట వ్యక్తి భర్త మీద చేయి చేసుకుంటే ఊరుకుంటారా? అది కూడా రక్తం వచ్చేలా కొడితే సహించగలరా? తాజాగా ఓ మహిళ.. తన భర్తపై దాడి చేసిన వైన్ షాప్ వారిపై గొడవకు దిగింది. నా భర్తనే కొడతారా? ఎవడ్రా కొట్టింది? అంటూ రెచ్చిపోయింది.

ఈ ఘటన హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రమేష్ మద్యం కొనేందుకు మధురానగర్ వైన్స్ షాప్ దగ్గరకు వెళ్లారు. అయితే పేమెంట్ విషయంలో వైన్ షాప్ సిబ్బందికి, రమేష్ కి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వైన్ షాప్ సిబ్బంది రమేష్ తలపై మద్యం బాటిల్ తో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వెళ్లిన భర్తను చూసి భార్య ఏం జరిగిందని ఆరా తీసింది. భార్య జరిగింది చెప్పడంతో ఆమె వైన్ షాప్ దగ్గరకు వెళ్ళింది. స్నేహితులతో కలిసి వైన్ షాప్ మీదకు దాడికి దిగింది. వైన్ షాప్ సిబ్బందిపై చూసి భార్య ఆవేశంతో ఊగిపోయింది. ఎందుకు కొట్టారంటూ వైన్ షాప్ సిబ్బందిని నిలదీసింది. రక్తం వచ్చేంతలా కొట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అంటూ వారిపై వాగ్వాదానికి దిగింది.

దాదాపు గంట సేపు వారితో గొడవ పడింది సదరు మహిళ. బాటిల్స్ పగలగొట్టి.. క్యాష్ కౌంటర్ వద్ద హంగామా సృష్టించింది. వైన్ షాప్ సిబ్బంది మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గొడవ ఆపడానికి వచ్చిన పోలీస్ మీద కూడా చేయి చేసుకుంది. ఆమెను ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ ని జుట్టు పట్టుకుని కొట్టింది. భర్తపై దాడి చేసిన వారిని వదిలేసి.. మమ్మల్ని అడ్డుకుంటారే అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ కాగా.. నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. శభాష్ భర్తను కొట్టిన వాళ్లతో ధైర్యంగా పోరాడావ్.. నీ తెగువకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి