iDreamPost
android-app
ios-app

స్వీటీ స్పీడ్ పెంచాల్సిన సమయం వచ్చింది

  • Published Sep 10, 2025 | 4:37 PM Updated Updated Sep 10, 2025 | 4:37 PM

చాలా కాలం తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకుంది. ఆ సినిమాలో స్వీటీ మరీ అంత లావుగా ఏమి లేదు. చూడడానికి చుడముచ్చటగానే ఉంది. సరే ఇకనుంచైనా అనుష్క నుంచి సినిమాలు వస్తాయి అనుకున్న వారు నిరాశ పడకతప్పలేదు. ఎందుకంటే మళ్ళీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఘాటీతో వచ్చింది

చాలా కాలం తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకుంది. ఆ సినిమాలో స్వీటీ మరీ అంత లావుగా ఏమి లేదు. చూడడానికి చుడముచ్చటగానే ఉంది. సరే ఇకనుంచైనా అనుష్క నుంచి సినిమాలు వస్తాయి అనుకున్న వారు నిరాశ పడకతప్పలేదు. ఎందుకంటే మళ్ళీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఘాటీతో వచ్చింది

  • Published Sep 10, 2025 | 4:37 PMUpdated Sep 10, 2025 | 4:37 PM
స్వీటీ స్పీడ్ పెంచాల్సిన సమయం వచ్చింది

అనుష్కకు ఫ్యాన్ బేస్ లేరా అంటే కానే కాదు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో అందంతో, అభినయంతో చక్రం తిప్పిన హీరోయిన్ అనుష్క. ఆ తర్వాత మధ్యలో అరుంధతి సినిమా తీసి లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది. ఆ తర్వాత ఎంత మంది ఈ ట్రెండ్ లో పాల్గొన్న అనుష్కను క్రాస్ చేయలేకపోయారు. అనుష్క అయినాసరే భాగమతితో ఈ సినిమాను బీట్ చేయలేకపోయింది. ఆ రేంజ్ లో జేజేమ్మగా తన మార్క్ ను క్రియేట్ చేసింది. అలాంటి స్వీటీ సైజ్ జీరో లాంటి సినిమా తీసి మాయమైపోయింది. అప్పటినుంచి ఆన్ స్క్రీన్ లో కానీ ఆఫ్ స్క్రీన్ లో కానీ స్వీటీ కనిపించడం చాలా రేర్ అయిపోయింది.

చాలా కాలం తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకుంది. ఆ సినిమాలో స్వీటీ మరీ అంత లావుగా ఏమి లేదు. చూడడానికి చుడముచ్చటగానే ఉంది. సరే ఇకనుంచైనా అనుష్క నుంచి సినిమాలు వస్తాయి అనుకున్న వారు నిరాశ పడకతప్పలేదు. ఎందుకంటే మళ్ళీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఘాటీతో వచ్చింది. ఇంకో ఫిమేల్ సెంట్రిక్ మూవీతో మార్క్ సెట్ చేద్దాం అనుకుందో ఏమో తెలీదు కానీ కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ లో వచ్చింది. సరే వచ్చింది ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తే ఇప్పుడు రిలీజ్ తర్వాత ఈ నిందలు పడే బాధ తప్పేది. ఎందుకంటే సినిమాలో అనుష్క తన నటనతో మెప్పించినా.. సినిమా కథ మాత్రం ప్రేక్షకులను థియేటర్స్ వరకు వచ్చేందుకు ఒప్పించలేకపోయింది.

సో ఇప్పుడు అనుష్క ఎదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. పదేళ్ల గ్యాప్ తర్వాతైనా ఓ హీరో కం బ్యాక్ ఇస్తే ఆదరించే ప్రేక్షకులు.. హీరోయిన్ ని కూడా అలానే ఆదరిస్తారు అనుకోవడం పగటి కల. అలా అని అనుష్క అందానికి ఏమి తక్కువ లేదు. ఆమె ఆఫ్ స్క్రీన్ దర్శనం ఇవ్వకపోడానికి కారణాలు ఏంటో తెలీదు కానీ. ఘాటీ లో కూడా అనుష్క చూడడానికి బాగానే ఉంది. కానీ ఇకపై అనుష్క గ్యాప్ తీసుకోకుండా.. వచ్చే కథలను , దర్శకులను ఎక్కవ కాలం వెయిట్ చేయించకుండా.. ప్రేక్షకులతో కనక్టివి పెంచుకుంటే బెటర్. ఇప్పటికైనా స్వీటీ స్పీడ్ పెంచకపోతే కష్టమే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.