Mirai Movie Review In Telugu : మిరాయ్ లాంటి స్ట్రాంగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజ సజ్జ . సినిమా ముందు వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ ను కూడా క్రియేట్ చేశాడు. అలాగే పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరి రిలీజ్ తర్వాత ఆడియన్స్ అందరిని ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Mirai Movie Review In Telugu : మిరాయ్ లాంటి స్ట్రాంగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజ సజ్జ . సినిమా ముందు వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ ను కూడా క్రియేట్ చేశాడు. అలాగే పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరి రిలీజ్ తర్వాత ఆడియన్స్ అందరిని ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హైలెట్ అయ్యాడు తేజ సజ్జ. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ ఇప్పుడు మిరాయ్ లాంటి స్ట్రాంగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ముందు వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ ను కూడా క్రియేట్ చేశాడు. అలాగే పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరి రిలీజ్ తర్వాత ఆడియన్స్ అందరిని ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
మూవీ కథ అంత కూడా తొమ్మిది గ్రంధాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తొమ్మిది గ్రంధాలు ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో ఉంటాయి. వాటికి రక్షణ కవచంలా కాపలాగా కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న కొంతమంది ఉంటారు. వాటి అన్నిటిని దాటుకుంటూ ఒక్కోదాన్ని చేదక్కించుకుంటూ ఉంటాడు మనోజ్. వాటిలో అన్నిటికంటే తొమ్మిదో గ్రంధం మహా పవిత్రమైనది. దానిని దక్కించుకోవడం చాలా కష్టం. దానినీ శ్రీయ కవచంలా కాపాడుతూ ఉంటుంది. మనోజ్ నుంచి వచ్చే ముప్పును ముందే గ్రహించి తన బిడ్డ వేద(తేజ సజ్జ) ను ఓ వీరుడిలా పెంచుతుంది. కానీ అతను చిన్నతనంలోనే తల్లికి దూరం అవుతాడు. ఆ తర్వాత ఏమైంది ? తానొక వీరుడిని అని ఎలా గుర్తించాడు ? ఆ మహాగ్రందాన్ని మనోజ్ దక్కించుకోకుండా తేజ ఏమి చేసాడు ? తన శక్తులు తానూ ఎలా తెలుసుకుని సూపర్ యోధగా మారాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
నటీనటుల పని తీరు :
ఎలా అయితే హనుమాన్ లో రెండు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ లో మెప్పించాడో. ఇక్కడ కూడా సేమ్ అలానే ఓ నార్మల్ మ్యాన్ గా అలాగే ఓ సూపర్ యోధాగా కనిపిస్తాడు. మునుపటికంటే ఈ సినిమాలో తేజ సజ్జా నటనలో ఆ పరిణితి కనిపిస్తుంది. సాధారణంగా పవర్స్ వచ్చిన తర్వాత ఎదో పేరుకి ఫైట్ సిక్వెన్స్ లు పెట్టాం అని కాకుండా.. చాలా యూనిక్ గా సబ్జెస్ట్ కు సింక్ అయ్యేలా.. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా కథలో ఇమిడిపోయేలా చేసాడు దర్శకుడు. ఇక మంచు మనోజ్ స్క్రీన్ టైం తక్కువే అయినా అతని లుక్స్ , యాక్టింగ్ ఇలా స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి వావ్ అనిపించుకున్నాడు. జగపతి బాబు, జైరామ్ , శ్రియా , రితికా నాయక్ , మిగిలిన నటీ నటులంతా వారి వారి క్యారెక్టర్స్ కు వంద శాతం న్యాయం చేశారని చెప్పొచ్చు.
టెక్నీకల్ టీం పనితీరు :
సినిమాలో కథ ఎంత ముఖ్యమో కథనం కూడా అంతే ముఖ్యం. దర్శకుడు తానూ చెప్పాలనుకున్న కథను సింపుల్ గా విజువల్ వండర్ గా చూపించేసాడు. ముఖ్యంగా కథనాన్ని ఎలివేట్ చేసింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఇక్కడ కాస్త డల్ అవుతుంది అనిపించే టైం కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చే ఎలివేషన్స్ తో ఆ ఫీలింగ్ పోతుంది. ఇక విఎఫ్ఎక్స్ , సిజి వర్క్స్ అయితే కంప్లీట్ గా ఐ ఫీస్ట్ అనిపించుకున్నాయి. ఎక్కడా కూడా తేడా లేకుండా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా రూపొందించారు. కేవలం 60 కోట్ల బడ్జెట్ తో ఇలాంటి ఔట్పుట్ తీసుకుని వచ్చారంటే మెచ్చుకోవలసిందే. కొన్ని చోట్ల ఎడిటింగ్ ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుంది.. కాస్త క్రిస్ప్ గా ఉండాల్సిందే అని అనిపించొచ్చు. రన్ టైం విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉండే బావుండేదని ఫీలింగ్ కలగక మానదు. కచ్చితంగా థియేటర్స్ లోనే చూడాల్సిన సినిమా అనైతే అనిపిస్తుంది.
విశ్లేషణ:
సూపర్ హీరోస్ అంటే ఎక్కడో ఉండరని.. మన పురాణాల్లోనే ఉంటారని మిరాయ్ మరోసారి గుర్తుచేసింది. ఈ మధ్య డివోషనల్ కథలకు ప్రేక్షకులు ఫిదా అవ్వడం చూస్తూనే ఉన్నాము. 9 గ్రంధాల చుట్టూ తిరిగే కథలో తానూ నార్మల్ మ్యాన్ అనుకున్న మనిషి ఓ సూపర్ యోధగా మారి.. విలన్ ఆ గ్రంధాలను చేదక్కించుకోకుండా ఎలా ఆపగలిగాడు అనేది కథ. మొదటి హాఫ్ మొత్తం కూడా క్యారెక్టర్స్ ను సినిమా ప్లాట్ ను ఎస్టాబ్లిష్ చేసుకంటూ.. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఫైట్స్ సిక్వెన్స్ లు , ఫ్యామిలిని ఆకట్టుకునే విధంగా కామిడిని పండించాడు. మంచి ఇంటర్వెల్ బ్లాక్ తో సెకండ్ ఆఫ్ కి లీడ్ ఇస్తారు.
ఇక సెకండ్ ఆఫ్ లో సూపర్ యోధాగా మారినా తేజ , అలాగే కథ వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను చూపిస్తారు. ఇక్కడ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్ గా మాత్రం అన్ని కథల్లానే విలన్ ను ఓడించి హీరో సక్సెస్ అవుతాడు. అది ఎలా అయ్యాడు అని చూపించడంలో కార్తీక్ ఘట్టమనేని ఎస్టాబ్లిష్ చేసిన ఎపిసోడ్స్ లోనే అసలు మ్యాజిక్ దాగి ఉంది. దర్శకుడిగా కథను చెప్పడంతోనే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గా కూడా కార్తీక్ ఘట్టమనేని తనదైన మార్క్ చూపించాడు. అక్కడక్కడ కథనం కాస్త స్లో గా అనిపించినా చివరి వరకు సినిమా మొత్తం ప్రేక్షకులను కదలనివ్వకుండా థియేటర్స్ లోనే కూర్చోపెడుతుంది. మొత్తానికి తేజ సజ్జా ఖాతలో మరొక హిట్ పడినట్టే.
ప్లస్ లు :
– విఎఫ్ఎక్స్ , సిజి వర్క్
– సినిమాట్రోగ్రఫి
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
– నటీనటులు
మైనస్ లు :
– స్లో నేరేషన్ (కొన్ని చోట్ల)
– రొటీన్ ఫీల్ ఇచ్చే కొన్ని సీన్స్
రేటింగ్ : 3.25/5
చివరిగా : మిస్టీరియస్ మైథాలాజికల్ మ్యాజిక్ మూవీ మిరాయ్