Swetha
మరికొద్ది గంటల్లో మిరాయ్ మూవీ రిజల్ట్స్ ఏంటో తెలిసిపోతాయి. ఇప్పటివరకు అయితే సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.అయితే అన్నిటికంటే హైలెట్ సినిమాలో కనిపించిన ఓ పెద్ద పక్షి. ఇది మన సూపర్ హీరోకు సాయం చేస్తుందంట. ఈ పక్షి వెనుక ఓ పెద్ద కథ కూడా దాగి ఉందట. అదేంటంటే ఆల్రెడీ సినిమాలో రాముడి క్యారెక్టర్ కీలకంగా ఉంటుందని టీం చెప్పకనే చెప్పారు.

మరికొద్ది గంటల్లో మిరాయ్ మూవీ రిజల్ట్స్ ఏంటో తెలిసిపోతాయి. ఇప్పటివరకు అయితే సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. హనుమాన్ ఎలాంటి సౌండ్ లేకుండా వచ్చి భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు మిరాయ్ కి కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ దక్కితే మాత్రం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. పైగా సినిమాలో భారీ విజువల్స్ , సిజి వర్క్ లో క్వాలిటీ ఇలా ప్రతిదీ చాలా నీట్ గా ప్రెసెంట్ చేసినట్లు అనిపిస్తుంది.
అయితే అన్నిటికంటే హైలెట్ సినిమాలో కనిపించిన ఓ పెద్ద పక్షి. ఇది మన సూపర్ హీరోకు సాయం చేస్తుందంట. ఈ పక్షి వెనుక ఓ పెద్ద కథ కూడా దాగి ఉందట. అదేంటంటే ఆల్రెడీ సినిమాలో రాముడి క్యారెక్టర్ కీలకంగా ఉంటుందని టీం చెప్పకనే చెప్పారు. అలాగే పురాణాల్లో రాముడికి సాయం చేసిన జటాయువు పక్షి గురించి అందరికి తెలిసిందే. ఆ జటాయువుకు సంపతి అనే సోదరుడు ఉన్నాడట. వీరిద్దరు సూర్యుడి పుత్రులట. ఒకానొక సమయంలో జటాయును కాపాడే క్రమంలో సంపతి రెక్కలు కాలిపోయాయట.
దీనితో అది ఎగరలేకపోయిన పరోక్షంగా.. లంకలో ఉన్న సీతమ్మ వారి జాడ తెలుసుకునేందుకు రాముడికి సాయం చేసిందట. ఇప్పుడు ఆ సంపతి పక్షి రాజు మిరాయ్ లోని సూపర్ హీరోకి తన లక్ష్యాన్ని ఛేదించడంలో సాయం చేస్తుందట. కథ ముందుకు సాగే కొద్దీ ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కు ఈ పక్షే కారణం అవుతుందట. భారీ విఎఫ్ఎక్స్ ఖర్చు చేసి మరీ ఈ పక్షిని రూపొందించారట మేకర్స్. సో ఒక్క పక్షి వెనుకే ఇంత కథ ఉంటె ఇంకా సినిమాలో ఇలాంటి రహస్యాలు ఎన్ని ఉంటాయో.. ఇంకొద్ది గంటల్లో తెలిసిపోతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.