Swetha
Parada Movie OTT: లేడి ఓరియెంటెడ్ మూవీస్ వర్క్ అవుట్ అవ్వవా అంటే.. కథలో కంటెంట్ ఉంటె ఏ సినిమా అయినా వర్కౌట్ అవుతుందని.. నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఇప్పుడొస్తున్న ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఎందుకు పేలడం లేదు అనే ప్రశ్నకు సమాధానం దర్శకులే చెప్పాలి.

లేడి ఓరియెంటెడ్ మూవీస్ వర్క్ అవుట్ అవ్వవా అంటే.. కథలో కంటెంట్ ఉంటె ఏ సినిమా అయినా వర్కౌట్ అవుతుందని.. నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఇప్పుడొస్తున్న ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఎందుకు పేలడం లేదు అనే ప్రశ్నకు సమాధానం దర్శకులే చెప్పాలి. వారు తీసుకుంటున్న స్టోరీ లైన్స్ లో సమస్యలు ఉన్నాయా.. వాటిని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో లోపాలు ఉన్నాయా అనేది ఓసారి రీచేక్ చేసుకోవాల్సిందే. అలాంటప్పుడే థియేటర్స్ లో సినిమాల లైఫ్ స్పాన్ కాస్త ఎక్కువ కాలం ఉంటుంది. లేదంటే వీలైనంత త్వరగా ఓటిటి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తుంది.
ఇప్పుడు అనుపమ లేటెస్ట్ మూవీ పరదా పరిస్థితి అదే అయింది. నటీనటులన్నాక హిట్ లు ప్లాపులు సహజమే. కానీ ఎంచుకునే కథలు బావుంటే అప్పుడే ఆటోమాటిక్ గా వారు కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చునుకుంటారు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే అనుపమ రీసెంట్ గా నటించిన పరదా మూవీ… మూడు వారాల్లోనే వెండితెర మీద నుంచి ప్రేక్షకుల స్క్రీన్స్ మీదకు వచ్చేసింది. ఇంత త్వరగా మూవీ ఓటిటి లోకి రాడానికి కారణాలేంటో తెలియనిది కాదు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. సో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.