Swetha
ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిందని అంతా అంటున్నారు. కానీ అసలు ప్రేక్షకులకు ఏమి కావలి.. వారికీ ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అనేది మాత్రం ఎవరు గ్రహించడం లేదు. విజువల్ గ్రాండియర్లు , భారీ క్యాస్టింగ్ , భారీ సెటప్స్ కథలు యాక్షన్ డ్రామాలు రొటీన్ లవ్ స్టోరీలు. ఎంతసేపు భారీతనం మీదే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు.
ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిందని అంతా అంటున్నారు. కానీ అసలు ప్రేక్షకులకు ఏమి కావలి.. వారికీ ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అనేది మాత్రం ఎవరు గ్రహించడం లేదు. విజువల్ గ్రాండియర్లు , భారీ క్యాస్టింగ్ , భారీ సెటప్స్ కథలు యాక్షన్ డ్రామాలు రొటీన్ లవ్ స్టోరీలు. ఎంతసేపు భారీతనం మీదే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు.
Swetha
ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిందని అంతా అంటున్నారు. కానీ అసలు ప్రేక్షకులకు ఏమి కావలి.. వారికీ ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అనేది మాత్రం ఎవరు గ్రహించడం లేదు. విజువల్ గ్రాండియర్లు , భారీ క్యాస్టింగ్ , భారీ సెటప్స్ కథలు యాక్షన్ డ్రామాలు రొటీన్ లవ్ స్టోరీలు. ఎంతసేపు భారీతనం మీదే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో చిన్న సినిమాలు ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ సోల్ ను శాటిస్ఫై చేసి.. ఇది కదరా సినిమా అంటే అనే పేరు.. పేరుతో పాటు పెట్టిన పైసలకు డబుల్ ప్రాఫిట్ ను సంపాదించుకుని వెళ్లిపోతున్నాయి.
ఘాటీ, మదరాసి లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడి.. వీక్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ను కనబరిచింది లిటిల్ హార్ట్స్. ప్రమోషన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ పెట్టుకున్న బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 3 కోట్ల 70 లక్షలు. అయితే ఇప్పుడు 22 కోట్ల గ్రాస్, 11.5 కోట్ల షేర్ వసూలు చేసిన లిటిల్ హార్ట్స్ ఎనిమిది కోట్ల లాభం దక్కించుకుంది. పెట్టుబడిలో నాణ్యత ఉంటె ఆదాయం ఇలానే ఉంటుందని లిటిల్ హార్ట్స్ ఇండస్ట్రీకి లిటిల్ మెసేజ్ ఇచ్చినట్టు అయింది. ఇక రేపు మార్కెట్ లో కొత్త సినిమాలు దిగుతున్నాయి. ఆ రెండిటికి కూడా ఈక్వల్ బజ్ ఉంది. సో లిటిల్ హార్ట్స్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవచ్చు.
అయినా పెద్దగా ప్రాబ్లమ్ ఏమి లేదు. ఇప్పటికే రాబట్టాల్సిన మొత్తం అమౌంట్ వచ్చేసింది. ఇకపై కూడా వస్తే అవన్నీ బోనస్ లే అనుకోవాలి. ఇక ఓటిటి ఎంట్రీ ఎప్పుడో తెలీదు కానీ వచ్చాక మాత్రం విధ్వంసమే. ఇంతకుముందు కూడా కోర్ట్ లాంటి చిన్న సినిమాలు ఆడడానికి కంటెంట్ ఏ కారణం. అయినాసరే దీని మీద ఎవరు దృష్టిపెట్టలేకపోయారు. ఇక ఇప్పుడు మరోసారి మరో చిన్న సినిమా ఇంకో చిన్న వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచైనా దర్శక నిర్మాతలు దీని మీద ఫోకస్ చేస్తే.. ప్రతి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం గ్యారెంటీ. ఇక నుంచైనా ఈ విషయంలో శ్రద్ద వహించకపోతే అది రెండు కోట్ల సినిమా అయినా రెండు వందల కోట్ల సినిమా అయినా.. ప్రేక్షకుల ఆదరణలో మాత్రం తేడా ఉండదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.