భైరవం సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకున్నారు కానీ. అది కూడా జరగలేదు. ఇక ఇప్పుడు ఓ డిఫరెంట్ జోనర్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది అనేది రివ్యూలో చూసేద్దాం.
భైరవం సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకున్నారు కానీ. అది కూడా జరగలేదు. ఇక ఇప్పుడు ఓ డిఫరెంట్ జోనర్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కిష్కింధపురి. రాక్షసుడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో హిట్ పడిన దాఖలాలు లేవు. సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. భైరవం సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకున్నారు కానీ. అది కూడా జరగలేదు. ఇక ఇప్పుడు ఓ డిఫరెంట్ జోనర్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
హీరో హీరోయిన్ అంటే శ్రీనివాస్ , అనుపమ ఇద్దరు లవర్స్. వీరిద్దరూ, వీరి స్నేహితులు కలిసి ఓ గోస్ట్ వాకింగ్ టూర్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్ ను నిర్వహిస్తూ ఉంటారు. థ్రిల్ కోరుకునే వారంతా ఆ టూర్ కి వెళ్తూ ఉంటారు. అలా ఓసారి 11 మందితో కలిసి కిష్కింధపురి అనే ఊరి దగ్గర్లో ఉండే.. సువర్ణ మాయ రేడియో స్టేషన్ కి వీరంతా వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అనే ఓ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే ఓ ముగ్గురు చనిపోతారు. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆ వాయిస్ ఎవరిదీ ? అసలు అక్కడికి వెళ్లిన వారు ఎందుకు చనిపోతున్నారు ? వీరంతా ఆ రేడియో స్టేషన్ నే ఎంచుకోడానికి కారణం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే వెండితెర మీద సినిమా చూడాల్సిందే.
నటీనటుల పని తీరు :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు ప్లాప్ అయ్యాయి ఏమో కానీ అతని నటన మాత్రం ఎప్పుడు ప్లాప్ అవ్వలేదు. ప్రతి సినిమాలోనూ తన క్యారెక్టర్ కు వంద శాతం న్యాయం చేస్తూనే ఉన్నాడు. అలానే ఈసారి కూడా రాఘవ అనే పాత్రలో ఇమిడిపోయాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ మొదటి హాఫ్ లో రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి మాత్రం అనుపమలో కొత్త యాంగిల్ బయటపడుతుంది. ఇక సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది శాండీ మాస్టర్.. విశ్వరూప పుత్ర అనే క్యారెక్టర్ తో అదరగొట్టేశాడు. ఇక మిగిలిన వారంతా కూడా తమ పరిధి మేర తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్ టీం పనితీరు :
నిజానికి టెక్నీకల్ టీమ్ చేసిన వర్క్ ఏ మూవీ స్టోరీని హైలెట్ చేసింది. సినిమాలో హీరో బెల్లంకొండ అయితే.. ఈ డిపార్ట్మెంట్ కి హీరో మాత్రం చైతన్ భరద్వాజ్ అనే చెప్పొచ్చు. హర్రర్ సినిమాలంటే కథతో పాటు ప్రేక్షకులను భయపెట్టడం ఇంపార్టెంట్. అలా భయపెట్టాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్రాణం పోయాల్సిందే. దానిని ఎలివేట్ చేసేలా అదిరిపోయే బీజీఎమ్ ఇచ్చాడు చైతన్ భరద్వాజ్. విజువల్స్ పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది ఈ మూవీ. అలాగే రన్ టైం కూడా ప్రేక్షకులకు కమ్ఫర్ట్బుల్ గానే ఉంది. కథ రొటీన్ అయినా.. కథనం విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటె బావుండేదని ఫీలింగ్ కలుగక మానదు.
విశ్లేషణ:
ఆల్మోస్ట్ హర్రర్ మూవీ స్టోరీస్ అన్ని సిమిలర్ గానే ఉంటాయి. అదే స్టోరీ ఫార్మాట్ ను ఫాలో అవుతూ దానికి కొన్ని థ్రిల్లింగ్ అంశాలను కలిపి కథ రాసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో హీరో అండ్ గ్యాంగ్ ఓ దెయ్యాన్ని నిద్రలేపడం. ఆ దెయ్యం ఎందుకు అలా చేస్తుంది.. ఆ దెయ్యం వీరిని ఎందుకు అన్ని తిప్పలు పెడుతుంది అనే ప్లాట్ తోనే మొదటి హాఫ్ అంతా గడిచిపోతుంది. ఎప్పుడైతే దెయ్యం ఎంట్రీ ఇస్తుందో అప్పటినుంచి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరుగుతుంది. సీట్లకు అతుక్కుని కూర్చునేలా చేసాడు దర్శకుడు. సినిమా స్టార్ట్ అయిన ఒక్క పది నిమిషాల తర్వాత నుంచి కూడా కథలో ఇన్వాల్వ్ అయిపోతారు ప్రేక్షకులు. అలా మొదటి హాఫ్ ను మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఎండ్ చేస్తాడు డైరెక్టర్.
ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే.. మొదటి హాఫ్ ఉన్నంత ఐ క్యాచీగా సెకండ్ హాఫ్ ఉండదు. ఇక్కడ అంతా దెయ్యం బ్యాక్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ నేరేషన్ చెప్పడంలో కొన్ని లాజిక్స్ మిస్ అవుతాయి. అయితే ఎక్కడ ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ఈ డైలాగ్ వేస్తారేమో అని.. ముందే సినిమాలోనే దెయ్యం సినిమాలో లాజిక్స్ ఏంటి అనే డైలాగ్ వేసేశాడు దర్శకుడు. సో ముందుగానే ప్రిపేర్ చేసాడు కాబట్టి ఈ లాజిక్స్ ను పక్కన పెట్టేయొచ్చు. ఇలా అక్కడక్కడ కొన్ని మిస్ అయిన ఫైనల్ గా సినిమా అయితే ఓ శాటిస్ఫ్యాక్షన్ ఇస్తుంది. మొత్తానికి సాయి శ్రీనివాస్ హర్రర్ కథతో పాస్ అయినట్టే.
ప్లస్ లు :
– టెక్నీకల్ టీం
– బ్యాక్గ్రౌండ్ స్కోర్
– విజువల్స్
మైనస్ లు :
-సెకండ్ ఆఫ్ (కొన్ని సీన్స్)
– ఊహకు అందే సన్నివేశాలు(కొన్ని)
రేటింగ్ : 3/5
చివరిగా : హర్రర్ మూవీ లవర్స్ కు కిష్కింధపురి మంచి కిక్ ఇస్తుంది