Swetha
ఈ నెల 12 న సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈలోగానే సినిమా ప్రీమియర్స్ వేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. ఇది కచ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కం బ్యాక్ మూవీ అవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
ఈ నెల 12 న సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈలోగానే సినిమా ప్రీమియర్స్ వేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. ఇది కచ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కం బ్యాక్ మూవీ అవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
Swetha
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా కిష్కిందపురి. ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించాడు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. ఈ నెల 12 న సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈలోగానే సినిమా ప్రీమియర్స్ వేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. ఇది కచ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కం బ్యాక్ మూవీ అవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని AAA ముల్టీప్లెక్స్‌లో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఆ షో చూసిన ఆడియన్స్ టాక్ విషయానికొస్తే.. మొదట 10 నిమిషాలు మాత్రం కథలోకి వెళ్లేందుకు టైం తీసుకుంటాడట దర్శకుడు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే కథ ష్కింధపురిలోని సువర్ణ మాయలోకి ప్రవేశిస్తుందో.. అక్కడ నుంచి అసలు మజా స్టార్ట్ అవుతుందట. ఎక్కడ బోర్ కొట్టించకుండా చెప్పాల్సిన పాయింట్ ను సరిగ్గా తెరపై చూపించారట. ఇక సెకండ్ ఆఫ్ విషయానికొస్తే.. హార్ట్ గ్రిప్పింగ్ హర్రర్ ఎలిమెంట్స్ తో ఎక్కడా ల్యాగ్ చేయకుండా.. ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టాడట డైరెక్టర్. పైగా సినిమా పార్ట్ 2 కూడా ఉందని చెప్పే ట్విస్ట్ ఇంకా అదుర్స్ అంట.
సో మొత్తానికి ఇన్నాళ్లకు సినిమా సాయి శ్రీనివాస్ కష్టానికి తగిన ఫలితం దక్కినట్టే అని అంటున్నారు అంతా. రేపు మొదటి షో తర్వాత కూడా ఇదే టాక్ కనుక వస్తే.. ఇక సినిమా విషయంలో ఆలోంచించాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు ప్రీమియర్స్ వలన ఎవరికీ ఎంత లాభం జరిగిందో తెలియదు కానీ.. కిష్కిందపురికి మాత్రం ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. ఇక రేపటి రోజున ఎలాంటి టాక్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.