iDreamPost
android-app
ios-app

ఇన్నాళ్లకు బాక్స్ ఆఫీస్ కు మంచి రోజులొచ్చాయ్

  • Published Sep 12, 2025 | 1:01 PM Updated Updated Sep 12, 2025 | 1:01 PM

ప్రేక్షకుల తీరు మారిందా లేదా దర్శకులు దారి తప్పుతున్నారా అని సోషల్ మీడియాలో డెబిట్ లు జరుగుతున్నాయి. ఎవరి సైడ్ నుంచి ఆలోచించిన వారే కరెక్ట్ అని ఇంకొందరు. ఇలా ఎవరికీ వారు మంచివాళ్ళని అనిపించుకుంటున్న క్రమంలో బాక్స్ ఆఫీస్ వసూళ్లు వెనుకబడిపోయాయి. ఈ దెబ్బతో డీలా పడిన డిస్ట్రిబ్యూటర్లను.. వాడిపోయిన ప్రేక్షకుల మొహాలను నవ్వించడానికి ఓ స్టెప్ ముందుకు వచ్చి..

ప్రేక్షకుల తీరు మారిందా లేదా దర్శకులు దారి తప్పుతున్నారా అని సోషల్ మీడియాలో డెబిట్ లు జరుగుతున్నాయి. ఎవరి సైడ్ నుంచి ఆలోచించిన వారే కరెక్ట్ అని ఇంకొందరు. ఇలా ఎవరికీ వారు మంచివాళ్ళని అనిపించుకుంటున్న క్రమంలో బాక్స్ ఆఫీస్ వసూళ్లు వెనుకబడిపోయాయి. ఈ దెబ్బతో డీలా పడిన డిస్ట్రిబ్యూటర్లను.. వాడిపోయిన ప్రేక్షకుల మొహాలను నవ్వించడానికి ఓ స్టెప్ ముందుకు వచ్చి..

  • Published Sep 12, 2025 | 1:01 PMUpdated Sep 12, 2025 | 1:01 PM
ఇన్నాళ్లకు బాక్స్ ఆఫీస్ కు మంచి రోజులొచ్చాయ్

ప్రతి వారం ఈ వారం వచ్చే సినిమాలు కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తాయ్ అని ఆశ పడడమే తప్ప.. ఆ ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ప్రేక్షకుల తీరు మారిందా లేదా దర్శకులు దారి తప్పుతున్నారా అని సోషల్ మీడియాలో డెబిట్ లు జరుగుతున్నాయి. ఎవరి సైడ్ నుంచి ఆలోచించిన వారే కరెక్ట్ అని ఇంకొందరు. ఇలా ఎవరికీ వారు మంచివాళ్ళని అనిపించుకుంటున్న క్రమంలో బాక్స్ ఆఫీస్ వసూళ్లు వెనుకబడిపోయాయి. ఈ దెబ్బతో డీలా పడిన డిస్ట్రిబ్యూటర్లను.. వాడిపోయిన ప్రేక్షకుల మొహాలను నవ్వించడానికి ఓ స్టెప్ ముందుకు వచ్చి.. కాంపిటీటర్స్ కు చిన్న మెసేజ్ ఇచ్చి.. లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమా అందరిని శాటిస్ఫై చేసింది.

ఇక అదే ఊపులో అసలు రిలీజ్ కంటే ముందే కొసరు లాంటి ప్రీమియర్స్ రూపంలో పాజిటివ్ బజ్ సంపాదించుకున్నాయి కిష్కింధపురి , మిరాయ్. రెండు డిఫరెంట్ జోనర్స్ . పైగా మార్కెట్ లో రెండు జోనర్స్ కు డిమాండ్ బాగానే ఉంది. సో ఇక్కడ కాంపిటీషన్ అనే మాట కాస్త పక్కన పెట్టేయొచ్చు. ప్రేక్షకుల ఛాయస్ లో ఏది ముందు ఉంటుంది అనేది చెప్పలేం కానీ..ఎండ్ ఆఫ్ ది వీకెండ్ కు మాత్రం రెండిటికి మంచి కలెక్షన్స్ వస్తాయి అనైతే చెప్పొచ్చు. ఆ పైన ఓజి రాడానికి ఇంకా 13 రోజుల సమయం ఉంది. దాని మీద ఇప్పటికి విపరీతమైన బజ్ ఉంది. కానీ ఎక్కడో చిన్న చిన్న సందేహాలు అనుమానాలకు ఓజి సైతం అతీతం కాదు.

ఎందుకంటే గతంలో బడా హీరోల భారీ అంచనాల సినిమాలు.. బాక్స్ ఆఫీస్ ముందు ఎలా బోల్తా పడ్డాయో చూసాము. కాబట్టి ఓజి మొదటి షో టాక్ అయ్యేవరకు కాస్త సందేహ పడక తప్పదు. అప్పటివరకు ఓపెన్ గ్రౌండ్ మిరాయ్ , కిష్కింధపురి సినిమాలాదే. లిటిల్ హార్ట్స్ ఇక్కడ కాస్త వెనుకబడే అవకాశం ఉంది. అయినా పర్లేదు ఎందుకంటే ఇప్పటికే లాభాల్లో ఉంది ఈ మూవీ. మొత్తానికి ఇన్నాళ్లకు బాక్స్ ఆఫీస్ కు మంచి రోజులు వచ్చాయి. వరుస పెట్టి వస్తున్నా సినిమాలన్నీ కూడా గల్లాపెట్టె నింపేలానే ఉన్నాయి. ఇక ఈ వీకెండ్ కంప్లీట్ అయితే కానీ మిరాయ్ , కిష్కింధపురి లెక్కలు బయటకురావు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

కిష్కింధపురి మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి