Swetha
డీజే టిల్లుతో ఒక్కసారిగా అందరిలో తన రేంజ్ ను సెట్ చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఇక ఒక సినిమా హిట్ అయిందంటే ఆటోమాటిక్ గా అప్ కమింగ్ సినిమాల మీద అంచనాలు పెరుగుతూ ఉంటాయి . కానీ తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలన్న రూల్ లేదు కదా. సో సిద్దు జొన్నల గడ్డ కూడా టిల్లు లాంటి హై తర్వాత.. జాక్ లాంటి లో చూసాడు
డీజే టిల్లుతో ఒక్కసారిగా అందరిలో తన రేంజ్ ను సెట్ చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఇక ఒక సినిమా హిట్ అయిందంటే ఆటోమాటిక్ గా అప్ కమింగ్ సినిమాల మీద అంచనాలు పెరుగుతూ ఉంటాయి . కానీ తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలన్న రూల్ లేదు కదా. సో సిద్దు జొన్నల గడ్డ కూడా టిల్లు లాంటి హై తర్వాత.. జాక్ లాంటి లో చూసాడు
Swetha
డీజే టిల్లుతో ఒక్కసారిగా అందరిలో తన రేంజ్ ను సెట్ చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఇక ఒక సినిమా హిట్ అయిందంటే ఆటోమాటిక్ గా అప్ కమింగ్ సినిమాల మీద అంచనాలు పెరుగుతూ ఉంటాయి . కానీ తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలన్న రూల్ లేదు కదా. సో సిద్దు జొన్నల గడ్డ కూడా టిల్లు లాంటి హై తర్వాత.. జాక్ లాంటి లో చూసాడు. ఇక ఇప్పుడు తెలుసు కదా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమా అక్టోబర్ 17 న థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వనుంది. సినిమాకు ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి. ఈలోపే టీజర్, సాంగ్స్ మెల్ల మెల్లగా ఒక్కోటి రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకులలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే వర్క్అవుట్ అయ్యేలా ఉంది. ఇక టీజర్ విషయానికొస్తే.. వన్ అండ్ ఆఫ్ మినిట్ ఉన్న ఈ టీజర్ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కంటెంట్ తో నిండిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే డీజే టిల్లుని మించి ఉందని చెప్పొచ్చు.
ఓ హల్దీ ఫంక్షన్ లో హీరో ఇద్దరికీ పసుపు రాయడం.. ఆ నెక్స్ట్ మినిట్ ఏ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం. ఆపై వచ్చే కొన్ని కామిడి సీన్స్ కొన్ని రొమాంటింక్ సీన్స్ ఇలా టీజర్ అంత ఎంటర్టైనింగ్ గా సాగిపోయింది. ఇది కూడా యూత్ ని టార్గెట్ చేసే బరిలోకి దిగుతుంది. ఈ మధ్య యూత్ ని టార్గెట్ చేసే సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి కదా అని.. ఇది కూడా వర్కౌట్ అవుతుందా అంటే ఏమో సినిమా వచ్చేవరకు చెప్పలేం. తెలుసు కదా ఈ మధ్య ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇక ఈ ‘తెలుసు కదా’ ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.