Swetha
ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేసే సమయంలో.. సినిమాకు సంబందించిన కొన్ని సీన్స్ ఓ లేక కొన్ని సాంగ్స్ ఓ ప్రేక్షకులకు బాగా ఎక్కిస్తూ ఉంటాయి. అబ్బా ఈ సాంగ్ కోసమైనా సినిమాకు వెళ్ళాలి లేదా ఈ సీన్స్ కోసమైనా వెళ్ళాలి అని అనుకుంటారు. తీరా సినిమాకు వెళ్లి చూస్తే ఆ సీన్ నో ఆ సాంగ్ నో కట్ చేసి.. ప్రేక్షకులను నిరాశకు గురి చేసి ఇళ్లకు పంపిస్తున్నారు ఈ మధ్య.
ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేసే సమయంలో.. సినిమాకు సంబందించిన కొన్ని సీన్స్ ఓ లేక కొన్ని సాంగ్స్ ఓ ప్రేక్షకులకు బాగా ఎక్కిస్తూ ఉంటాయి. అబ్బా ఈ సాంగ్ కోసమైనా సినిమాకు వెళ్ళాలి లేదా ఈ సీన్స్ కోసమైనా వెళ్ళాలి అని అనుకుంటారు. తీరా సినిమాకు వెళ్లి చూస్తే ఆ సీన్ నో ఆ సాంగ్ నో కట్ చేసి.. ప్రేక్షకులను నిరాశకు గురి చేసి ఇళ్లకు పంపిస్తున్నారు ఈ మధ్య.
Swetha
ఈ మధ్య కాలంలో సినిమాలు తీసే విధానంలో చాలానే మార్పులు వస్తున్నాయి. కథ అనుకున్నప్పుడు ఓ విధంగా ఉంటె దాని ఔట్పుట్ మరో విధంగా ఉంటుంది. దీని అంతటికి కారణం ఏంటయ్యా అంటే జనాలకి సినిమా కాస్త బోర్ కొట్టకుండా చూపించాలని అనుకోడమే. ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేసే సమయంలో.. సినిమాకు సంబందించిన కొన్ని సీన్స్ ఓ లేక కొన్ని సాంగ్స్ ఓ ప్రేక్షకులకు బాగా ఎక్కిస్తూ ఉంటాయి. అబ్బా ఈ సాంగ్ కోసమైనా సినిమాకు వెళ్ళాలి లేదా ఈ సీన్స్ కోసమైనా వెళ్ళాలి అని అనుకుంటారు.
తీరా సినిమాకు వెళ్లి చూస్తే ఆ సీన్ నో ఆ సాంగ్ నో కట్ చేసి.. ప్రేక్షకులను నిరాశకు గురి చేసి ఇళ్లకు పంపిస్తున్నారు ఈ మధ్య. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి పరవాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్నీ సోషల్ మీడియా కోడై కూస్తుంది. అలాగే ఇప్పుడు మిరాయ్ విషయంలోను అదే జరిగింది. సినిమాకు జనాలు బాగానే వైబ్ అవుతున్నారు కానీ అసలు సినిమాని హైలెట్ చేసిన వైబ్ ఉంది బేబీ సాంగ్ మాత్రం సినిమాలో కనిపించడం లేదు. అసలు సాంగ్ ఎందుకు రిలీజ్ చేయాలి ఇప్పుడు సినిమాలో ఎందుకు కట్ చేయాలి అని కొందరు వాపోతుంటే.. ఇప్పటికే థియేటర్ లో చాలా సేపు కూర్చున్నాం ఈ సాంగ్ లేకపోతే ఏమైందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.
ఇది మొదటి సారి కూడా కాదు.. కింగ్డమ్ , దేవర సినిమాల విషయంలో కూడా ఇదే జరిగింది. ముందు ఆ సాంగ్స్ కట్ చేసి సినిమా రిలీజ్ చేశారు. తర్వాత వాడిని యాడ్ చేసి మరోసారి రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మిరాయ్ విషయంలో ఇది సరైన నిర్ణయం అని చెప్పొచ్చేమో.. ఎందుకంటే సినిమా మొదటి నుంచి చివరి వరకు ఓ పద్దతి ప్రకారం మైథలాజి , యాక్షన్స్ సిక్వెన్స్ లతో నడిచింది. ఎక్కడా ఫోర్స్ ఫుల్ గా లవ్ ట్రాక్ చూపించే ప్రయత్నం చేయలేదు. సో అసలు ఆ ట్రాక్ లేనప్పుడు ఆ బేబీతో వైబ్ ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ సాంగ్ పెట్టిన పులిహోరలో లవంగం తగిలినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకో ఫీలింగ్ రాదు. అందుకే సాంగ్ కట్ చేసి రన్ టైం ను కూడా తగ్గించారు.
అసలు ఇదంతా ముందే అనుకున్నప్పుడు సాంగ్ షూట్ చేయడం దేనికి.. ప్రమోషనల్ కంటెంట్ లో వదిలి దానిని ప్రేక్షకుల నరాల్లోకి ఎక్కించడం దేనికి.. అనే ప్రశ్నకు సమాధానం దర్శకుడికే తెలియాలి. అయితే ఇంకొద్ది రోజుల తర్వాత ఈ సాంగ్ ను యాడ్ చేసి కొత్త వెర్షన్ మిరాయ్ ని రిలీజ్ చేసిన ఆశ్చర్యం లేదు. చేయకపోయినా వచ్చే నష్టం లేదు. ఎలాగూ సాంగ్ యూట్యూబ్ లో ఉండనే ఉంది. ఏదేమైనా పాత పద్దతుల్లా ఫోర్స్ ఫుల్ గా అయితే లవ్ ట్రాక్, సాంగ్ ను ఇరికించాలని అనుకోలేదు దర్శకుడు. న్యూ జెన్ ఫిలిం మేకర్స్ లో మెచ్చుకోదగిన వాటిలో ఇదొకటి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మిరాయ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి