iDreamPost

అనుపమ To మమితా బైజు: తెలుగులో మల్లు హీరోయిన్స్‌ని ఎక్కువగా తీసుకోవడానికి కారణం!

ఏ సినిమా చూసినా దాదాపు మలయాళ హీరోయిన్సే కనబడుతున్నారు. కుప్పలు తెప్పలుగా మలయాళ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏటా హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళకి దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎందుకంత డిమాండ్?

ఏ సినిమా చూసినా దాదాపు మలయాళ హీరోయిన్సే కనబడుతున్నారు. కుప్పలు తెప్పలుగా మలయాళ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏటా హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళకి దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎందుకంత డిమాండ్?

అనుపమ To మమితా బైజు: తెలుగులో మల్లు హీరోయిన్స్‌ని ఎక్కువగా తీసుకోవడానికి కారణం!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తెలుగు సినిమాలు, తెలుగు హీరోలు ఏలుతుంటే.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మాత్రం మలయాళ హీరోయిన్స్ ఏలుతున్నారు. లిస్ట్ ఓపెన్ చేస్తే ఏ సినిమా చూసినా కేరళ హీరోయిన్సే కనబడతారు. తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు, వాళ్ళ సొంత భాషలో చేసే సినిమాలు.. ఇలా ఏ సినిమా చూసిన మలయాళ హీరోయిన్సే ఉంటారు. వేళ్ళ మీద లెక్కపెట్టలేనంత మంది హీరోయిన్స్ ఉన్నారు ఇప్పుడు. వీరంతా ఇండియాలోనే హాట్ ఫేవరెట్ హీరోయిన్స్ గా ఉన్నారు. నయనతార, కీర్తి సురేష్, నిత్యామీనన్, సంయుక్తా మీనన్, ఐశ్వర్యా మీనన్, ఐశ్వర్యా లక్ష్మి, అమలా పాల్, అనుపమ పరమేశ్వరన్, అపర్ణ బాలమురళీ, మడోన్నా సెబాస్టియన్, నివేదా థామస్, గౌరీ కిషన్, మంజూ వారియర్, ప్రియా ప్రకాష్ వారియర్, మాళవిక మోహనన్, రెబా మోనికా జాన్ నిన్న ప్రేమలు సినిమాతో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన మమితా బైజు ఇలా వీరంతా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. దక్షిణాది సినిమాలను ఏలుతున్నారు.

అయితే ఇంతమంది మలయాళ హీరోయిన్స్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఎలా ఏలుతున్నారు? అసలు మలయాళ హీరోయిన్స్ కి ఎందుకింత డిమాండ్? వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మన వాళ్ళని అంతలా ఆకర్షించేంతగా ఏముంది వారిలో అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది పారితోషికం. మిగతా ఇండస్ట్రీ హీరోయిన్స్ తో పోల్చుకుంటే మలయాళ హీరోయిన్స్ తక్కువ పారితోషికం తీసుకుంటారు. ఈ కారణం చేత నిర్మాతలు వీరితో సినిమాలు తీసేందుకు ఎగబడతారు. మొదట్లో కాబట్టి మరీ అంత పాపులర్ కాదు కాబట్టి పారితోషికం తక్కువ తీసుకుంటారు. నయనతారలా బాగా ఫేమస్ అయితే పారితోషికం పెంచేస్తారు. అయినప్పటికీ మలయాళ హీరోయిన్స్ మిగతా స్టార్ హీరోయిన్స్ తో పోలిస్తే తక్కువే తీసుకుంటారన్న అభిప్రాయం అయితే ఉంది.

రెండవ కారణం మలయాళంలో టాలెంట్ ని బాగా ప్రోత్సహిస్తారు. కేరళ ఆర్ట్స్, కల్చర్ ని ప్రోత్సహించే బలమైన సాంప్రదాయం ఉంది. దీని వల్ల ఎక్కువ మంది ఆర్టిస్టులు బయటకు వస్తారు. దీనికి తోడు మలయాళ ఇండస్ట్రీకి హై క్వాలిటీ సినిమాలు, అర్ధవంతమైన సినిమాలు తీస్తారన్న పేరు ఉంది. దీంతో నటించడానికి ఎక్కువ మంది ముందుకొస్తుంటారు. నటనను కెరీర్ గా మలచుకోవాలని భావిస్తారు. అక్కడ మగవారినే కాకుండా నటన వచ్చు అంటే మహిళా నటీమణులను కూడా ప్రోత్సహిస్తారు. ఆడ, మగ అన్న తేడా ఉండదు. ఎక్కువ మంది ప్రతిభ గల హీరోయిన్స్ బయటకు రావడం వల్ల దర్శక నిర్మాతలకు ఎక్కువ ఆప్షన్స్ కనబడుతున్నాయి. పైగా తెలుగులో హీరోయిన్స్ తక్కువ. అందుకే అనుపమ లాంటి మలయాళ హీరోయిన్స్ కి అంత డిమాండ్ ఉంటుంది.

పైగా మనోళ్లు ఎక్కువగా మలయాళ సినిమాలు చూస్తారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలు జీవితానికి దగ్గరగా సహజంగా ఉంటాయి. వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ కూడా హై రేంజ్ లో ఉంటాయి. హీరోయిన్స్ మాత్రమే కాదు.. హీరోలు కూడా అద్భుతంగా నటిస్తారు. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్లను అందించిన మలయాళ ఇండస్ట్రీకి ఇందుకే ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందుకే సబ్ టైటిల్స్ ఉంటే చాలు భాష అర్థం కాకపోయినా ఎగబడి చూస్తారు. ఓటీటీల్లో ఎక్కడ చూసినా మలయాళ హీరోయిన్స్ దే హవా. వీళ్ళ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని వీళ్ళని తీసుకుంటారు మన వాళ్ళు. అది మలయాళ హీరోయిన్స్ కి ఉన్న డిమాండ్. కొత్తగా మమితా బైజు అనే పిల్ల వచ్చింది. ఇప్పుడు ఈమెతో కూడా మనవాళ్ళు సినిమా చేస్తారు. మరి మలయాళ హీరోయిన్స్ కి ఇంత డిమాండ్ ఉండడానికి ఇంకేమైనా కారణాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి