iDreamPost
android-app
ios-app

Sankranthi Releases : సంక్రాంతికి వచ్చేదెవరు తగ్గేదెవరు

  • Published Oct 19, 2021 | 7:13 AM Updated Updated Oct 19, 2021 | 7:13 AM
Sankranthi Releases : సంక్రాంతికి వచ్చేదెవరు తగ్గేదెవరు

2022 సంక్రాంతికి రాబోతున్నామని ఆర్ఆర్ఆర్ ప్రకటించాక కూడా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. మొన్న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ లో ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ లేకపోయినప్పటికీ ప్రెస్ నోట్ లో మాత్రం దాన్ని నొక్కి చెప్పారు. ‘భీమ్లా నాయక్’ ఇటీవలే రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలో తాము పండక్కే వస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇక ‘రాధే శ్యామ్’ సంగతి సరేసరి. 14 నుంచి వెనక్కు తగ్గే పరిస్థితి లేనేలేదు. ఎవరు వచ్చినా రేస్ లో ఉండే తీరతామని క్లారిటీ ఇస్తూనే వచ్చారు. ఇంకా ‘ఎఫ్3’ సంగతి తేలాల్సి ఉంది. తాజాగా నాగార్జున ‘బంగార్రాజు’ కూడా పండగ బరిలోనే దింపాలని గట్టిగా నిర్ణయించుకున్నారట.

సంక్రాంతి పండగ సులభంగా మూడు భారీ సినిమాలను పెద్ద వసూళ్లతో గట్టెక్కిస్తుంది కానీ మరీ అయిదంటే మాత్రం చాలా పెద్ద సవాల్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల బిసి సెంటర్లలో ఇన్నేసి స్క్రీన్లు అందుబాటులో లేవు. హైదరాబాద్ వైజాగ్ లాంటి నగరాలూ, జిల్లా కేంద్రాలు ఓకే కానీ పట్టణాలు గ్రామాలూ చూసుకుంటే అందుబాటులో ఉన్నవి సరిపోవు. పైగా ఒకేసారి ఇన్ని చిత్రాలు వస్తే ప్రేక్షకులు సైతం ఆప్షన్లు తగ్గించుకుంటారు. థియేటర్ కు వెళ్లడం అందులోనూ మల్టీ ప్లెక్స్ అంటే ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన తరుణంలో ఎంత పండగ అయినా మరీ అయిదేసి సినిమాలకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారా.

ఇప్పుడు అసలు ప్రశ్న ఇందులో ఎవరు నిలుస్తారు ఎవరు వెనక్కు తగ్గుతారు అనేది. ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడొచ్చనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ రాజమౌళి టీమ్ ఇప్పటిదాకా అసలు ప్రమోషన్లను మొదలుపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇంకా డెబ్భై ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ప్రమోట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ కు ఇప్పటి నుంచే ఓ రేంజ్ పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. మరి నిజంగా జనవరికి రావడం అనుమానమా లేక పైన చెప్పిన అయిదు సినిమాల్లో ఎవరైనా డ్రాప్ అవుతారా అనేది వేచి చూడాలి. ఇప్పటికైతే ఈ 5 వ్యూహాల విషయంలో క్లారిటీ లేనట్టే

Also Read : Sharwanand : ఆడాళ్ళ మీదే యువ హీరో భారం

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet