iDreamPost

భూమా వారసురాలు ఏమి చేస్తుందో ?

భూమా వారసురాలు  ఏమి చేస్తుందో  ?

ఇదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే చాలా కాలంగా తెలుగుదేశంపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. పైగా ఈ మధ్య హత్యానేరం కేసులో భూమా అఖిల ప్రియ దంపతులపై బాగా ఆరోపణలు కూడా వినిపించాయి. అప్పుడు కూడా టిడిపి నేతలెవరూ అఖిలకు మద్దతుగా మాట్లాడలేదు. ఇటు జిల్లాలో నేతలతో కూడా అఖిలకు మంచి సంబంధాలు ఏరోజు లేదు. దాంతో జిల్లాలో కూడా ఎక్కడా కనబడక పోవటంతో అసలు మాజీ మంత్రి పార్టీలోనే ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అయితే అఖిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు, చినబాబు ట్విట్టర్లో పోస్టులు పెట్టడంతో అందరు ఆశ్చర్యపోయారు. తండ్రి, కొడుకులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారంటే అఖిల ఇంకా టిడిపిలోనే ఉందని అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వాళ్ళలో కొందరికి తండ్రి, కొడుకులు శుభాకాంక్షలు చెప్పగానే వాళ్ళు పార్టీ వదిలేస్తున్నారు.

కడప జిల్లాలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, పులివెందులలో టిడిపి నేత సతీష్ రెడ్డికి చంద్రబాబు, చినబాబు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత కొద్ది రోజులకే వాళ్ళిద్దరు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసేశారు. అలాగే కర్నూలు జిల్లాలో కేఇ ప్రభాకర్ కూడా రాజీనామా చేసేశాడు. ఇపుడు భూమా అఖిలకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. మరి ఈమె ఏమి చేస్తుందో చూడాల్సిందే.

జిల్లాలోని పార్టీ నేతల సమాచారం ప్రకారం అఖిల చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా నేతలు ఎవరితో కూడా అఖిలకు సత్సంబంధాలు లేవు. సీనియర్ నేతలు ఎన్ఎండి ఫరూక్, కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళతో కూడా అఖిలకు పడదు. ఇక మరో సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి హత్యకు మాజీమంత్రి దంపతులు సుపారి ఇచ్చారనే ప్రచారం సంచలమే అయ్యింది. హత్యకు సుపారి అంశం దర్యాప్తులో ఉండగానే హఠాత్తుగా కరోనా వైరస్ సమస్య వచ్చిపడింది కానీ లేకపోతే సుపారి అంశం ఈ పాటికి తేలిపోయుండేదే. కాబట్టి అఖిల అసలు పార్టీలోనే ఉందో లేదో చూసుకుంటే బెటర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి