iDreamPost
android-app
ios-app

మ్యాచ్‌కి ముందు జరిగిన మీటింగ్‌ గురించి బయటపెట్టిన సూర్య! కెప్టెన్‌ వార్నింగ్‌తో..

  • Published Aug 09, 2023 | 4:12 PM Updated Updated Aug 09, 2023 | 4:12 PM
  • Published Aug 09, 2023 | 4:12 PMUpdated Aug 09, 2023 | 4:12 PM
మ్యాచ్‌కి ముందు జరిగిన మీటింగ్‌ గురించి బయటపెట్టిన సూర్య! కెప్టెన్‌ వార్నింగ్‌తో..

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా తొలి విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత యువ జట్టు.. క్రికెట్‌ అభిమానులకు కాస్త ఊరనిస్తూ.. మంచి విజయం సాధించింది. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. సిరీస్‌ సజీవంగా ఉంటుందనే కీలక మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన కనబర్చింది. తొలుత వెస్టిండీస్‌ను ఓ మోస్తారు స్కోర్‌కు కట్టడి చేసి.. ఆ తర్వాత తక్కువ ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను ఛేజ్‌ చేసి గెలిచింది.

అయితే.. మూడు వన్డేల సిరీస్‌తో పాటు, తొలి టీ20ల్లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌, చాలా రోజుల తర్వాత తన స్థాయికి తగ్గట్లు ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కొద్దిలో సెంచరీ మిస్‌ అయినా.. తిరిగి ఫామ్‌ను అందుకోవడంపై సంతోషంగానే ఉన్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌ గెలుపు, తన ప్రదర్శన గురించి సూర్యకుమార్‌ యాదవ్ మాట్లాడుతూ..‘ఈ మ్యాచ్‌లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని మా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా టీమ్‌ మీటింగ్‌లో గట్టిగా చెప్పాడు. ఎవరో ఒక్కరైనా బాగా ఆడినా చాలాని, మ్యాచ్‌ సులువుగా గెలవచ్చిన చెప్పాడు, అయితే ఆ ఒక్కడిని నేనే కావడం సంతోషంగా ఉంది’ అని తెలిపాడు.

కాగా.. ఈ మ్యాచ్‌లో సూర్య 83 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అతనికి తిలక్‌ వర్మ మంచి మద్దతుగా నిలిచాడు. ఈ విషయాన్ని సూర్య కూడా ఒప్పుకున్నాడు. తిలక్‌ వర్మ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే.. చివర్లో విజయానికి 39 పరుగుల దూరంలో సూర్యకుమార్‌ యాదవ్‌ అవుటైన తర్వాత.. క్రీజ్‌లోకి వచ్చిన పాండ్యా 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఆ సమయంలో తిలక్‌ 49 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉన్నాడు. విజయానికి 2 రన్స్‌ అవసరమైన దశలో పాండ్యా సిక్స్‌ కొట్టడంతో మ్యాచ్‌ ముగిసింది. అలా కాకుండా సింగిల్‌ తీసుకోని తిలక్‌కు మ్యాచ్‌ ముగించే అవకాశం ఇచ్చి ఉంటే అతను ఫిఫ్టీ పూర్తి చేసుకునే వాడని, కానీ పాండ్యా అలా చేయలేదని క్రికెట్‌ అభిమానులు పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాపం.. గిల్‌! మొన్నటి వరకు నెక్ట్స్‌ కోహ్లీ అన్నారు.. కానీ, ఇప్పుడు?