iDreamPost
android-app
ios-app

Mohammad Nabi: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆఫ్ఘానిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ!

  • Published Nov 08, 2024 | 11:39 AM Updated Updated Nov 08, 2024 | 11:57 AM

Mohammad Nabi Retired From One Day: ఆఫ్ఘానిస్తాన్ స్టార్ ఆలరౌండర్ కీలక ప్రకటన చేశాడు. తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

Mohammad Nabi Retired From One Day: ఆఫ్ఘానిస్తాన్ స్టార్ ఆలరౌండర్ కీలక ప్రకటన చేశాడు. తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

Mohammad Nabi: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆఫ్ఘానిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ!

క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. రీసెంట్ గా భారత సీనియర్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా రిటైర్మెంట్ ప్రకటించగా, తాజాగా అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ కూడా కీలక ప్రకటన చేశాడు. వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. వచ్చే సంవత్సరం పాకిస్థాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత వన్డే క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు తెలిపాడు. ఇక నబీ రిటైర్మెంట్ ను ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ వెల్లడించాడు. అతను శుక్రవారం క్రిక్‌బజ్‌ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన తరువాత నబీ వన్డే ఫార్మాట్ కు రిటైర్ అవుతున్నాడని, ఇప్పటికే అతను తన నిర్ణయాన్ని బోర్డుకు తెలియజేశాడని నసీబ్ ఖాన్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత తన వన్డే కెరీర్ ను ఆపేయాలని అనుకుంటున్నట్లు నబీ కొన్ని నెలల క్రితం తనకు చెప్పాడని నసీబ్ ఖాన్ తెలిపాడు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని నసీబ్ అన్నాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత నబీ T20 కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేయనున్నాడాని నసీబ్ ఖాన్ తెలిపాడు.

మహ్మద్ నబీ అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్లలో ఒకడు. అఫ్గానిస్థాన్ విజయాల్లో చాలా సార్లు కీలక పాత్ర పోషించాడు. మంచి ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతని క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. నబీ 2009లో స్కాట్‌లాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పటి వరకు నబీ మొత్తం 165 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 27.30 సగటుతో మొత్తం 3,549 పరుగులు చేశాడు. బౌలర్ గా 171 వికెట్లు కూడా తీశాడు. ప్రస్తుతం యూఏఈలో బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో మహ్మద్ నబీ ఆడుతున్నాడు. మహ్మద్ నబీ 2019లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత వన్డే క్రికెట్ కి కూడా గుడ్ బై చెప్పనున్నాడు.

ప్రస్తుతం మహ్మద్ నబీ వయస్సు 39ఏళ్ళు. అయితే ఇతను టెస్టుల్లో పెద్దగా రాణించలేదు. నబీ అఫ్గానిస్థాన్ తరపున కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. అందులో కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక టీ 20 విషయానికి వస్తే.. మొత్తం 129 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అందులో 2,165 పరుగులు చేశాడు. ఇక ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వికెట్ల విషయానికి వస్తే టీ20 ఫార్మాట్ లో మొత్తం 96 వికెట్లు పడగొట్టాడు. అయితే దేశవాళి, ఐపీఎల్ టోర్నమెంట్లో… మహమ్మద్ నబీ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇదీ సంగతి. మరి అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ రిటైర్మెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.