Swetha
పుష్ప మొదటి పార్ట్ లో సమంత చేసిన ఐటెం సాంగ్.. సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీనితో ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించాలంటే.. పార్ట్ 1 కు మించిన ఐటెం సాంగ్ పార్ట్ 2 లో ఉండాలి. అందుకోసం దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. చాలా కాలం ఐటెం సాంగ్ లో హీరోయిన్ కోసం వేటాడాడు. ఎట్టకేలకు లాస్ట్ మినిట్ లో ఆ ఛాన్స్ శ్రీలీల కు దక్కింది. ఈ సాంగ్ కోసం శ్రీలీల దాదాపు ఒకటిన్నర కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారికి సుమారు ఓ 6 కోట్లు సేవ్ అయినట్లే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ
పుష్ప మొదటి పార్ట్ లో సమంత చేసిన ఐటెం సాంగ్.. సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీనితో ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించాలంటే.. పార్ట్ 1 కు మించిన ఐటెం సాంగ్ పార్ట్ 2 లో ఉండాలి. అందుకోసం దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. చాలా కాలం ఐటెం సాంగ్ లో హీరోయిన్ కోసం వేటాడాడు. ఎట్టకేలకు లాస్ట్ మినిట్ లో ఆ ఛాన్స్ శ్రీలీల కు దక్కింది. ఈ సాంగ్ కోసం శ్రీలీల దాదాపు ఒకటిన్నర కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారికి సుమారు ఓ 6 కోట్లు సేవ్ అయినట్లే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ
Swetha
పాన్ ఇండియా రేంజ్ లో ఏదైనా ఓ సినిమా క్లిక్ అవ్వాలంటే.. కథతో పాటు స్టార్ క్యాస్టింగ్ కూడా చాలా అవసరం. ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఈ పాయింట్ ను గట్టిగ పట్టుకున్నాయి. కథలోని లోతుని బలమైన క్యారెక్టర్స్ తో తెరపైన చక్కగా చూపిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు..వివిధ ఇండస్ట్రీలోని స్టార్స్ ను రంగంలోకి దించుతున్నారు. ఇవన్నీ కూడా సినిమాకు లాభాలను తెచ్చి పెట్టడం కోసం ఉపయోగించే టెక్నిక్స్. ఈ క్రమంలో దీనిని అదునుగా తీసుకుని సినీ తారలు రెమ్యునిరేషన్ తో షాక్ ఇస్తున్నారట. మరీ ముఖ్యంగా ఐటెం సాంగ్స్ విషయంలో.. హీరోయిన్స్ అసలు తగ్గడం లేదని సమాచారం. రీసెంట్ గా పుష్ప 2 మూవీ విషయంలో ఇదే జరిగింది. పుష్ప మొదటి పార్ట్ లో సమంత చేసిన ఐటెం సాంగ్.. సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీనితో ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించాలంటే.. పార్ట్ 1 కు మించిన ఐటెం సాంగ్ పార్ట్ 2 లో ఉండాలి.
అందుకోసం దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. చాలా కాలం ఐటెం సాంగ్ లో హీరోయిన్ కోసం వేటాడాడు. ఎట్టకేలకు లాస్ట్ మినిట్ లో ఆ ఛాన్స్ శ్రీలీల కు దక్కింది. దీనితో అందరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఓ పాన్ ఇండియా సినిమా కోసం బాలీవుడ్ లేదా టాలీవుడ్ నుంచి పెద్ద స్టార్ ను తీసుకుని వస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఈ అమ్మడి కంటే ముందు.. ఈ సాంగ్ కోసం శ్రద్ధ కపూర్ పేరు బాగా వినిపించింది. ఆమె కూడా ఓకే చెప్పిందట. కానీ రెమ్యునిరేషన్ మాత్రం అమాంతం పెంచేసిందట. ఈ సాంగ్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయలను కోట్ చేసిందట. దీనితో ప్రత్యామ్నాయం కోసం యూనిట్ వెతుకులాట మొదలెట్టగా శ్రీలీల వారి కంట పడింది. డ్యాన్స్ విషయంలో శ్రీలీలను అసలు తీసిపడేయలేము.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ మంచి డ్యాన్సర్ గా గుర్తింపు సంపాదించుకుంది. గుంటూరు కారం సినిమాతో క్లియర్ గా అందరికి ఈ విషయం అర్థమైపోయింది. దింతో చిత్ర యూనిట్ ఏ చింతా లేకుండా ఆమెను ఫైనల్ చేశారు. పైగా శ్రీలీల ఇచ్చిన రెమ్యూనరేషన్ డిమాండ్ కూడా అందుబాటులో ఉండడంతో.. మేకర్స్ కు ఇది ఇంకాస్త ఈజీ అయింది. ఈ సాంగ్ కోసం శ్రీలీల దాదాపు ఒకటిన్నర కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారికి సుమారు ఓ 6 కోట్లు సేవ్ అయినట్లే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ , నార్త్ బిజినెస్ దృష్ట్యా చూసుకుంటే శ్రద్దా ను కాకపోయినా ఇంకెవరినైనా తీసుకునే ఉంటె.. లెక్కలు పెరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అందులో వాస్తవం లేకపోలేదు. అయినా సరే శ్రీలీల వేసే స్టెప్పులను తక్కువ అంచనా వేయడానికి లేదు. పుష్ప 2 టీం కూడా అల్లు అర్జున్ , శ్రీలీల కాంబినేషన్ విషయంలో చాలా ధీమాగా ఉన్నారు. ఒక్కసారి ఇది వర్క్ అవుట్ అయితే కనుక ఇక శ్రీలీల గ్రాఫ్ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి . మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.