iDreamPost

పాపం.. గిల్‌! మొన్నటి వరకు నెక్ట్స్‌ కోహ్లీ అన్నారు.. కానీ, ఇప్పుడు?

  • Published Aug 09, 2023 | 9:12 AMUpdated Aug 09, 2023 | 9:12 AM
  • Published Aug 09, 2023 | 9:12 AMUpdated Aug 09, 2023 | 9:12 AM
పాపం.. గిల్‌! మొన్నటి వరకు నెక్ట్స్‌ కోహ్లీ అన్నారు.. కానీ, ఇప్పుడు?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 దగ్గర పడుతోంది. అక్టోబర్‌ 5 నుంచి ఈ మహా సంగ్రామం మొదలు కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సంసిద్ధం అవుతున్నాయి. హాట్‌ ఫేవరేట్స్‌లో ఒకటైన ఆస్ట్రేలియా ఇప్పటికే 18 మందితో ఓ ప్రిలిమినరీ టీమ్‌ను ప్రకటించింది. అందులోంచి 15 మందిని ఫైనల్‌ చేయనుంది. ఇలా అన్ని జట్లు తమ తమ వరల్డ్‌ కప్‌ టీమ్స్‌ను ఒక పక్కా ప్రణాళికతో ప్రిపేర్‌ చేసుకుంటున్నాయి. అయితే.. టీమిండియా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా, మొహమ్మద్‌ సిరాజ్‌ మినహా ఐదో ప్లేయర్‌ ఎవరో కూడా చెప్పలేని పరిస్థితి. బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, పంత్‌ లాంటి స్టార్లు గాయాల నుంచి రికవరీ అవుతున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన యువ క్రికెటర్లు ఇప్పుడు తుస్సు మంటున్నారు. దీంతో భారత వరల్డ్‌ కప్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ టీమ్‌ను కనీసం ఊహించడానికి కూడా ఆటగాళ్లు దొరకడం లేదు.

దారుణంగా విఫలం అవుతున్న యువ క్రికెటర్లు..
రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌ విన్నింగ్‌ స్టార్లు, సీనియర్‌ ఆటగాళ్లతో పాటు యువ క్రికెటర్లు శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌ లాంటి ఆటగాళ్లు జట్టుకు బలంగా మారుతారు అనుకుంటే.. పరిస్థితి రివర్స్‌ అయింది. ప్రస్తుతం గిల్‌, కిషన్‌, సంజు చెత్త ఫామ్‌లో ఉన్నారు. పైగా గిల్‌, కిషన్‌కు వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన రికార్డ్‌ ఉంది. టీమిండియా భవిష్యత్తు స్టార్లుగా ప్రశంసలు పొందిన ఈ యువ ఆటగాళ్లు ఇప్పుడు టీమ్‌కు హ్యాండించేలా ఉన్నారు. ముఖ్యంగా శుబ్‌మన్‌ గిల్‌ గురించి మాట్లాడుకోవాలి. గిల్‌ టీమ్‌లోకి వచ్చిన కొత్తలో అద్భుతంగా ఆడాడు. నిలకడకు మారుపేరుగా నిలిచాడు. టీమిండియాకు నెక్ట్స్‌ విరాట్‌ కోహ్లీ తనే అని అనుకున్నారంతా.. కానీ, గత తొమ్మిది మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన చూస్తే.. ఇతను నెక్ట్స్‌ కోహ్లీ ఏంటి? అంత సీన్‌ లేదులే అనిపిస్తుంది. చాలా దారుణంగా ఆడుతున్నాడు.

వెస్టిండీస్‌ టూర్‌లో రెండు టెస్టులు, మూడు వన్టేలు, మూడు టీ20లు కలుపుకుని గిల్‌ ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌లు చూస్తే.. 6, 10, 29, 7, 34, 85, 3, 7, 6 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ ఉంది. ఐదు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు ఉండటం గమనార్హం. గిల్‌ కోసం పాపం.. అకారణంగా శిఖర్‌ ధావన్‌ లాంటి మంచి వన్డే ప్లేయర్‌ను ఇంటికి పంపారు. రోహిత్‌ శర్మతో కలిసి వరల్డ్‌ కప్‌లో టీమ్‌కు మంచి ఓపెనర్‌గా మారాతాడు అనుకుంటే.. ఇప్పుడు జట్టులో చోటే కష్టంగా మారింది గిల్‌కు. మరో రెండు టీ20లు, ఆసియా కప్‌ 2023లో మాత్రమే గిల్‌కు అవకాశం ఉంది. వాటిలో కూడా అతను విఫలం అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో బహుషా అతను ఉండకపోవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఛీ.. నువ్వింత అసూయపరుడివా? పాండ్యాపై ఫ్యాన్స్‌ మండిపాటు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి