iDreamPost

అధిక బరువు ఉన్నవాళ్లు ఇలా చేయండి.. బరువు కచ్చితంగా తగ్గుతారు..

అధిక బరువు ఉన్నవాళ్లు ఇలా చేయండి.. బరువు కచ్చితంగా తగ్గుతారు..

ప్రస్తుతం చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య ఊబకాయం. ఈమధ్య కరోనా సమయంలో అందరూ ఇళ్లల్లో ఉండటం వల్ల ఎక్కువగా బరువు పెరిగారు. మన వయసుకు తగిన దానికన్నా ఎక్కువ బరువు ఉంటే దానిని ఊబకాయం అంటారు. అధిక బరువు వలన షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎనిమిది గంటలు కన్నా ఎక్కువ నిద్ర పోయినా, ఎక్కువగా ఒత్తిడి కలిగినా కూడా బరువు పెరుగుతారు. కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఆహారంలో తీసుకుంటే కూడా బరువు ఎక్కువగా పెరుగుతారు.

బరువు తగ్గడానికి ఉదయం పరకడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీరు తాగాలి. టిఫిన్ బదులు కూరగాయల జ్యూసులు తాగాలి. నీరు మరియు గ్రీన్ టీ ఎక్కువగా తాగాలి. భోజనానికి ముందు కూడా నీరు తాగితే దానివల్ల కడుపు నిండినట్టుగా ఉండి తక్కువ భోజనాన్ని తింటారు.

అలాగే ఉదయం మరియు సాయంత్రం రెండు సమయాల్లో ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. జాగింగ్, వాకింగ్ లేదా సైక్లింగ్ చేయాలి. ఇలా రోజుకు రెండు గంటలు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట చేయడం వాళ్ళ బరువు తగ్గుతారు. భోజనం తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు. రాత్రి పడుకునే సమయం కంటే మూడు గంటలు ముందే భోజనం తింటే మంచిది. సబ్జా నీళ్ళల్లో నిమ్మరసం కలుపుకొని రోజూ త్రాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి