iDreamPost

APలో జిల్లాకో మెడికల్ కాలేజీ.. జగన్ చొరవతో సామాన్యుడి చెంతకి వైద్య విద్య!

సరైన వైద్యం అందక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలు సమీపంలో ఆసుపత్రులు లేకపోవడంతో.. దూర, భారాలు వెళ్లాల్సి వస్తుంది. అలాగే వైద్యుల కొరత కూడా ఉంది. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఏపీలోని జగన్ సర్కార్ పెను మార్పులు చేపట్టింది.

సరైన వైద్యం అందక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలు సమీపంలో ఆసుపత్రులు లేకపోవడంతో.. దూర, భారాలు వెళ్లాల్సి వస్తుంది. అలాగే వైద్యుల కొరత కూడా ఉంది. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఏపీలోని జగన్ సర్కార్ పెను మార్పులు చేపట్టింది.

APలో జిల్లాకో మెడికల్ కాలేజీ.. జగన్ చొరవతో సామాన్యుడి చెంతకి వైద్య విద్య!

ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అనేవి కీలక అంశాలు. ఈ రెండు ఎంత మెరుగ్గా ఉంటాయో ఆ రాష్ట్రం/దేశం కూడా అంత సుభిక్షంగా వర్థిల్లుతుంది. ఎన్నో ప్రభుత్వాలు వీటిని విస్మరిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం వీటికి పెద్ద పీట వేస్తోంది. పేదలకు, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షలా మారిన కార్పొరేట్ తరహా విద్యను అందిస్తోంది జగన్ సర్కార్. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం తీసుకు రావడమే కాకుండా.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించింది. అలాగే సామాన్యులకు కలగా ఉండిపోయే వైద్య విద్యలో పెను మార్పులు తీసుకు వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు శంకు స్థాపన చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

వైద్యో నారాయణో హరి అన్న నానుడిని నమ్మిన జగన్ సర్కార్.. ఏపీలో మెడికల్ విద్యను ప్రోత్సహించే విధంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే 15కు పైగా కాలేజీలను శంకు స్థాపన చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. డాక్టర్ చదవాలన్న ఎంతో మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల కల నేరవేర్చింది. పాడేరు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లి, పులివెందుల, పెనుకొండ, ఆదోనీ, నంద్యాల. ఈ ప్రాంతాల్లో ఆత్యాధునిక వసతులతో మెడికల్ కాలేజీలు నిర్మించారు. రూ. 8,480 కోట్లతో ఈ ప్రభుత్వ కళాశాలలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే ఐదు మెడికల్ కళాశాల్లో తరగుతులు ప్రారంభం అయ్యాయి.

2023-24 విద్యా సంవత్సరం నుండే విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్ర వరం, నంద్యాల వైద్య కళాశాలల్లో విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల.. 750 సీట్లు అదనంగా వచ్చాయి. దీంతో ఎంబీబీఎస్ చదవాలన్న ఎంతో మంది కోరికను నేరవేర్చింది సర్కార్.ఈ ఐదు కళాశాలలను రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఒక్కో కళాశాలల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్, స్మార్ట్ టీవీలు, లైబ్రరీలు, మైక్రో స్కోపిక్, డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఐదు కాలేజీలు అందుబాటులోకి వస్తుండగా.. వీటి ద్వారా కూడా అదనంగా మరో 750 ఎంబీబీఎస్ సీట్లు రాబోతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో 7 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల ద్వారా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,735కి పెరగనుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రతి చోట అత్యాధునిక మెడికల్ కాలేజీ, భోదనాసుపత్రి నిర్మించడం వల్ల నాలుగేళ్ల వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు.. డాక్టర్లుగా పట్టా భద్రులయ్యాక.. ఈ మెడికల్ కాలేజీల్లో రోగులకు నిరంతరం సేవలు అందించే అవకాశం ఉంటుంది. ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు ఉండటం వల్ల.. పట్టణాల్లోని ప్రజలు కూడా వ్యయ ప్రయాసలు పడుతూ దూర భారాల్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. సామాన్యుడికి అందని వైద్య విద్యను అందించేందుకు జగన్ సర్కార్ పడిన తపన ఇది. జగన్ చొరవతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వైద్యుల సంఖ్య పెరగడమే కాకుండా ఉద్యోగాల కల్పన, సగటు మానవుడికి మెరుగైన వైద్యం అందనుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి